Profitability way
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
పటిష్టంగా భారత బ్యాంకుల లాభదాయకత
న్యూఢిల్లీ: భారత బ్యాంకుల లాభదాయకత ఆరోగ్యకర స్థాయిలో స్థిరపడుతుందని, ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడడం కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ రేటింగ్స్ అంచనా వేసింది. ‘‘భారత బ్యాంకుల లాభాలు ఇక మీదట ఆరోగ్యంగానే ఉంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల భారం గణనీయంగా పెరిగిన దగ్గర్నుంచి, గత ఏడేళ్లలో ఈ రంగం ఎంతో మెరుగుపడింది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలిసేత్ ఛాబ్రియా తెలిపారు. రుణ వసూళ్లు బలంగా ఉన్నాయని, భారత బ్యాంకులు దశాబ్ద కాలంలో మెరుగైన ఫలితాలను చూపిస్తున్నాయని ఎస్అండ్పీ రేటింగ్స్ పేర్కొంది. క్రెడిట్ వ్యయాలు తక్కువగా ఉండడం, అధిక నికర వడ్డీ మార్జిన్ల నుంచి ప్రయోజనం పొందడం వల్ల భారత బ్యాంకింగ్ రంగం ప్రయోజనం చూస్తున్నట్టు తెలిపింది. వ్యవస్థ అంతటా ఆస్తులపై సగటు రాబడులు (ఆర్వోఏఏ) 1.2 శాతంగా 2022–23లో ఉంటాయని, 2023–24లో 1.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా వచ్చే ఎన్పీఏలు తక్కువగానే ఉన్నట్టు తెలిపింది. మాఫీ చేసిన రుణాలు వసూలు అవుతుండడంతో వాటి లాభాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. భారత్ బలమైన ఆర్థిక పనితీరు బ్యాంకింగ్ రంగానికి సానుకూలమని ఎస్అండ్పీ రేటింగ్స్ అంచనా వేసింది. 2026 వరకు భారత్ ఏటా 6–7 శాతం స్థాయిలో వృద్ధిని చూస్తుందని, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని తెలిపింది. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన దగ్గర్నుంచి ఇష్యూ ధర కన్నా దిగువనే ట్రేడ్ అవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పనితీరును మార్చడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసి అధిక లాభాలు ఆర్జించడంపైనా, ఇన్వెస్టర్లకు మరింత రాబడులు అందించడంపైనా దృష్టి సారించాలని ఒత్తిడి పెంచుతోంది. (Jay Y Lee శాంసంగ్‌కు కొత్త వారసుడు, కొత్త సవాళ్లు) ఇందులో భాగంగా కొత్త తరాన్ని కూడా ఆకర్షించేలా పథకాల వ్యూహాలను మార్చుకోవాలని, లాభ దాయకతను పెంచేలా మరిన్ని టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టడాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ సమీక్షలో సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయడం ద్వారా 65 ఏళ్ల సంస్థను ఆధునీకరించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) అలాగే పథకాలను కూడా ఆధునీకరించేలా మేనేజ్మెంట్తో కలిసి పని చేస్తు న్నట్లు అధికారి వివరించారు. రూ. 902-949 ధర శ్రేణితో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దీని ద్వా రా ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్లు వచ్చాయి. (Hero MotoCorp ఫిలిప్పైన్స్‌లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ ) అయితే, మే 17న లిస్టింగ్ తొలి రోజే ఇష్యూ ధర కన్నా తక్కువగా రూ. 872 వద్ద లిస్టయిన ఎల్ ఐసీ షేరు అప్పటి నుంచి కోలుకోలేదు. ప్రస్తు తం రూ. 595 దగ్గర ట్రేడవుతోంది. కానీ వచ్చే ఏడా ది వ్యవధిలో ఎల్ఐసీ షేరు బాగా రాణిస్తుందని కొన్ని బ్రోకరేజీలు బులిష్‌గా ఉన్నాయి. రేటు రూ. 1,000 స్థాయికి చేరవచ్చని సిటీ అంచనా వేసింది. -
ఆఫీసులో ఉచిత మీల్స్, స్నాక్స్ కట్..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ అన్ఎకాడమీ ఇకపై అనవసర వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, లాభదాయకతపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ జీతాల్లో కోత విధించడంతో పాటు గ్లోబల్ టెస్ట్ ప్రెప్ వంటి కొన్ని వ్యాపారాలను కూడా మూసివేయనుంది. సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ ఈ విషయాలు తెలిపారు. ఆఫీసులో కాంప్లిమెంటరీగా ఇచ్చే మీల్స్, స్నాక్స్ కూడా ఇకపై ఉండబోవని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, టాప్ మేనేజ్మెంట్తో పాటు ఎవరికీ కూడా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాల్లాంటి ప్రయోజనాలు లభించనవి ముంజల్ తెలిపారు. అంతే కాకుండా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా నియమించిన డ్రైవర్లను కూడా తొలగిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఖాతాల్లో పుష్కలంగా రూ. 2,800 కోట్ల మేర నిధులు ఉన్నప్పటికీ .. వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో లాభదాయకతను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ముంజల్ వివరించారు. పనితీరు బాగాలేదంటూ ఇటీవలే 10 శాతం మంది సిబ్బందిని (దాదాపు 600 మంది) తొలగించిన అన్ఎకాడమీ తాజాగా మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
రోడ్డున్న ప్రతి గ్రామానికీ బస్సు
కాచిగూడ: ప్రజల సహకారంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల భాటలో నడిపించే విధంగా కృషి చేస్తామని ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్లు, అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రతి నెలా రూ.75కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోందని అన్నారు. రోడ్డున్న ప్రతి గ్రామానికీ బస్సును నడిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మరిన్ని ఎక్కువ ప్రాంతాలను కలుపుతూ బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. రూ.230 కోట్లతో 1157 కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కాలనీల నుంచి కాలనీలకు, గ్రామీణ ప్రాంతాల్లో 236 మిని బస్సులను నడుపుతామని అన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.5వేల కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యంతో అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్, రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్రావు, డివిజనల్ మేనేజర్ వరప్రసాద్, బర్కత్‌పుర డిపో మేనేజర్ శంకర్, కాచిగూడ డిపో మేనేజర్‌తో పాటు పలు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మెన్ హరితహారంలో భాగంగా బస్టాండులో మొక్కలు నాటారు.