న్యూఢిల్లీ: పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసుల(పీఎంఎస్)కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఇకపై పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ క్లయింట్ల నిధులను నిర్వహించేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలు పేరుతో అదనపు రక్షణాత్మక మార్గదర్శకాలను అనుసరించవలసి ఉంటుంది. పనితీరు(పెర్ఫార్మెన్స్), ప్రామాణికత(బెంచ్‌మార్కింగ్)లకు సంబంధించి సెబీ తాజా గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది.
క్లయింట్ల పెట్టుబడి ఆశయాలకు అనుగుణంగా నిధులను నిర్వహించేటప్పుడు పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అప్రోచ్(ఐఏ)ను పాటించవలసి ఉంటుంది. పనితీరు, ప్రామాణికతలపై సమీక్షకు ఇవి అవసరమని సెబీ తెలియజేసింది. 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకిరానున్న తాజా మార్గదర్శకాలు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల పనితీరును తెలుసుకునేందుకు సహాయకారిగా నిలవనున్నట్లు పేర్కొంది.
చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం!
Comments
Please login to add a commentAdd a comment