15–18 శాతం మధ్య ఉండొచ్చు
వెండిలోనూ స్థిరమైన రాబడి
విశ్లేషకుల అంచనాలు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది.
కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment