మార్కెట్ల భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు
మెప్పించని కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు
విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం
సెన్సెక్స్ 931 పాయింట్లు... నిఫ్టీ 309 పాయింట్లు డౌన్
రూ.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్‌ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.
ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్‌లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి.
అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే
ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల
సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్‌ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్‌బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్‌అండ్‌టీ 2%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment