
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఆటో షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారమూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు కలిసొచ్చాయి. కేంద్రం వెల్లడించిన స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదయ్యాయి. కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించగలిగాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 545 పాయింట్లు పెరిగి 58,115 వద్ద నిలిచింది. ఏప్రిల్ 13వ తేదీ తర్వాత సెన్సెక్స్ 58 వేల స్థాయిపై ముగియడం ఇదే తొలిసారి.
నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 17,340 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. కాగా, ఇటీవల జీవితకాల కనిష్టానికి దిగివచ్చిన రూపాయి రికవరీ క్రమంగా రికవరీ అవుతోంది. సోమవారం 18 పైసలు బలపడి నెలగరిష్ట స్థాయి 79.24 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా వాహన విక్రయాలు జూలైలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో ఆటో షేర్లు భారీగా గిరాకీ నెలకొంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇకపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
4 రోజులు: రూ.12.74 లక్షల కోట్లు
4 రోజుల ర్యాలీతో రూ.12.74 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► 5జీ స్పెక్ట్రం కోసం రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు పైగా బిడ్లు ధాఖలవడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. రిలయన్స్ 2.60% ఎగసి రూ.2,575 వద్ద స్థిరపడింది. ఎయిర్‌టెల్ షేరు 2.40% పెరిగి రూ.694 వద్ద ముగిసింది.
చదవండి: ఆగస్ట్‌లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment