న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లోకి గడిచిన ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 మధ్య) 84.8 లక్షల మంది మిలీనియల్ ఇన్వెస్టర్లు కొత్తగా అడుగు పెట్టా రు. ఈ వివరాలను క్యామ్స్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. గత ఐదేళ్లలో కొత్త ఇన్వెస్టర్లలో 54 శాతం మంది మిలీనియల్స్ ఉండడం విశేషం. 1980–1990 మధ్య జన్మించిన వారిని మిలీనియల్స్‌గా చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఉత్ప త్తులపై గతంతో పోలిస్తే అవగాహన, ప్రచారం విస్తృతం కావడం తెలిసిందే.
ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు
ఫలితంగా ఏటాటా కొత్త ఇన్వెస్టర్లలో చక్కని వృద్ధి కనిపిస్తోంది. ఫండ్స్ పెట్టుబడులను ఆన్‌లైన్‌లోనే సరళంగా చేసుకునే వెసులుబాటు కూడా ఇందుకు అనుకూలిస్తోంది. 2018–19 నుంచి 2022–23 మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి కొత్తగా 1.57 కోట్ల మంది ఇన్వెస్టర్లు ప్రవేశించారు. 2022–23లో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల నమ్మకం బలంగా ఉందని, సంపద సృష్టికి మిలీనియల్స్ మ్యూచువల్ ఫండ్స్‌ను మెరుగైన సాధనంగా చూస్తున్నట్టు క్యా మ్స్ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశించిన మిలీనియల్ ఇన్వెస్టర్లలో మహిళలు 30%గా ఉన్నారు. మహిళల్లోనూ పెట్టుబడుల పట్ల ఆసక్తి పెరుగుతుందనడానికి ఇది నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment