న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. పెట్టుబడిదారుల సొమ్మును రికవరీ 61 ప్రాపర్టీలను జులై 17న వేలం ద్వారా విక్రయించ నున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 26.2 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది.
చట్టవిరుద్ధ పథకాల ద్వారా పబ్లిక్ నుంచి పెట్టుబడులను సమీకరించడంతో శారద్ గ్రూప్‌పై సెబీ తాజా చర్యలకు నడుం బిగించింది. గ్రూప్‌నకు పశ్చిమబెంగాల్‌లోని భూములతోపాటు.. ఇతర ఆస్తులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1వరకూ వేలం వేయనున్నట్లు వెల్లడించింది.ఈవేలం నిర్వహణలో సీ1 ఇండియా, ఆస్తుల విక్రయంలో క్విక్‌ఆర్ రియల్టీ.. సెబీకి సహకారాన్ని అందించనున్నాయి.
ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్ సక్సెస్ జర్నీ
Comments
Please login to add a commentAdd a comment