దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాలను చవిచూశాయి. స్టాక్‌మార్కెట్ ప్రారంభంలో సూచీల జోరు కనిపించినా...ట్రేడింగ్ ముగిసే సమయంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీ సూచీలు నష్టాలను చవిచూశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 60,997 పాయింట్లతో ప్రారంభమవ్వగా ఒకానొక సమయంలో సూచీలు 400 కు పాయింట్లతో 61, 570 వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో ఇన్వెస్టర్లు అమ్మకాలపై మొగ్గు చూపడంతో చివరికి 206.93 పాయింట్ల నష్టంతో 61143.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 57.40 పాయింట్లు నష్టపోయి 18,210.95 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్-30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాలను గడించాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను పొందాయి.
చదవండి: జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!
Comments
Please login to add a commentAdd a comment