ప్రపంచంలో సంపన్నుల సంపద కరిగిపోయింది. ఒక్క జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ శుక్రవారం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపద 134 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు) క్షీణించింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ షేర్లు మార్కెట్‌లో విస్తృత అమ్మకాల మధ్య 8.8% పడిపోయాయి. బెజోస్ నెట్‌వర్త్ 191.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో భారీగా సంపద క్షీణించడం జెజోస్‌కి ఇది మూడోసారి. 2019లో విడాకుల పరిష్కారం తర్వాత 36 బిలియన్ డాలర్లు, 2022లో అమెజాన్ షేర్లు 14% పడిపోయాయి.
నాస్‌డాక్ 100 ఇండెక్స్ 2.4% పడిపోయింది. ఇలాన్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్‌తో సహా ఇతర టెక్ బిలియనీర్ల సంపదలు వరుసగా 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలపై అనిశ్చితి, అలాగే కొన్ని అధిక-ప్రొఫైల్ ఆదాయాల్లో నిరాశలు, టెక్-హెవీ ఇండెక్స్‌ను దిద్దుబాటులోకి నెట్టేశాయి. కేవలం మూడు వారాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల విలువను తుడిచిపెట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment