Richest People
-
సన్నబడ్డ సంపన్నులు! రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి!!
ప్రపంచంలో సంపన్నుల సంపద కరిగిపోయింది. ఒక్క జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ శుక్రవారం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపద 134 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు) క్షీణించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ షేర్లు మార్కెట్లో విస్తృత అమ్మకాల మధ్య 8.8% పడిపోయాయి. బెజోస్ నెట్‌వర్త్ 191.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో భారీగా సంపద క్షీణించడం జెజోస్కి ఇది మూడోసారి. 2019లో విడాకుల పరిష్కారం తర్వాత 36 బిలియన్ డాలర్లు, 2022లో అమెజాన్ షేర్లు 14% పడిపోయాయి.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4% పడిపోయింది. ఇలాన్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్‌తో సహా ఇతర టెక్ బిలియనీర్ల సంపదలు వరుసగా 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలపై అనిశ్చితి, అలాగే కొన్ని అధిక-ప్రొఫైల్ ఆదాయాల్లో నిరాశలు, టెక్-హెవీ ఇండెక్స్‌ను దిద్దుబాటులోకి నెట్టేశాయి. కేవలం మూడు వారాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల విలువను తుడిచిపెట్టేసింది. -
ఈ ఏడాది ప్రపంచ కుబేరులు వీరే.. జాబితా ఇదే!
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో వ్యాపారవేత్తలు తమదైన రీతిలో బిజినెస్ చేస్తూ నువ్వా.. నేనా అన్నట్లు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 10 మంది జాబితా విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్ళీ టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) నిలిచాడు, ఆ తరువాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ, జెఫ్ బెజోస్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్), సెర్గీ బ్రిన్ (గూగుల్) నిలిచారు. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా ఇలాన్ మస్క్ (Elon Musk) - 227.8 బిలియన్ డాలర్స్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - 179.3 బిలియన్ డాలర్స్ జెఫ్ బెజోస్ - 174.0 బిలియన్ డాలర్స్ లారీ ఎల్లిసన్ - 134.9 బిలియన్ డాలర్స్ మార్క్ జుకర్‌బర్గ్ - 130.2 బిలియన్ డాలర్స్ బిల్ గేట్స్ - 119.9 బిలియన్ డాలర్స్ వారెన్ బఫెట్ - 119.2 బిలియన్ డాలర్స్ లారీ పేజీ - 118.7 బిలియన్ డాలర్స్ స్టీవ్ బాల్మెర్ - 115.4 బిలియన్ డాలర్స్ సెర్గీ బ్రిన్ - 113.8 బిలియన్ డాలర్స్ -
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!
గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి విన్నారా!. దీన్ని ఎక్కువగా అత్యంత ధనవంతులే కోరుకుంటారట. ఈ పాస్‌పోర్ట్‌ని పొందడమే అదృష్టంగా భావిస్తారట వారు. అసలేంటి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్. ధనవంతులకు ఆ పాస్‌పోర్ట్ అంటే ఎందుకంతా క్రేజ్!. గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం పొందే పాస్‌పోర్ట్. గణనీయమైన ఆర్థిక పెట్టుబడుల ద్వారా వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు విదేశాల్లో నివాసం ఉండగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని వీసా రహిత ప్రయాణం అనాలి. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకునేందుకు సులవైన మార్గం కూడా. ఈ పాస్‌పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు.. గోల్డెన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అనేక దేశాలకు పాస్‌పోర్ట్ లేకుండా ఈజీగా రాకపోకలు సాగించగలరు. కొన్ని దేశాలు పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూసే వారికి అనూకూలమైన పన్ను విధానాలను అందించి మరీ పెట్టుబడులు పెట్టేలా చేసి మరీ ఈ వీసాలను ఇస్తాయట. ఇది కొత్త మార్కెట్లకి, పెట్టుబడి అవకాశాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ కారణంగా ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలను తదితరాలను పొందుతారు. ఇలాంటి పౌరసత్వాలను అందించే దేశాలు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఆంటిగ్వా మరియు బార్బుడా మరియు డొమినికా వంటి దేశాలు ఇలాంటి ఆకర్షణీయమైన పౌరసత్వ కార్యక్రమాలను అందిస్తున్నాయి. అలాగే మాల్టా, సైప్రస్ వంటి దేశాలు ఐరోపా చుట్టి వచ్చేలా, కొన్ని కరేబియన్ దేశాలు, వనాటు వంటివి యునైటెడ్ స్టేట్స్లో ఉండేలా ఆకర్షణీయమైన వీసాలను అందిస్తున్నాయి. చుట్టుమడుతున్న వివాదాలు గమ్యాన్ని బట్టి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్ వందల వేల నుంచి మిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ వీసా ఆర్థిక ప్రయోజనాలు, మెరగైన జీవనశైలికి ప్రధాన ఆకర్షణగా ఉన్నా.. ఆస్తుల దుర్వినియోగం జరిగే ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ధనవంతులకు ఇదోక అవకాశంలా.. ఆస్తులను కాపాడుకునేందుకు సులభమైన మార్గంలా ఉండే ప్రమాదం ఉంది. అలాగే భద్రత, స్వేచ్ఛ పరంగా కూడా ఈ పాస్‌పోర్ట్ విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. (చదవండి: అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..) -
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
పదో వంతు దేశ జీడీపీ వారి చేతుల్లోనే..
ముంబై: దేశంలోని 25మంది కుబేరులు పదోవంతు దేశ జీడీపీని కలిగి ఉన్నారని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రతినిధులు ఓ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు యాటిన్ షా స్పందిస్తూ.. సంపదలో ఎక్కువ భాగం వారసత్వంగా లభిస్తుందని పత్రిక ప్రకటనలో తెలిపారు. కాగా, భారత కుబేరులు 53 శాతం సంపదను వారసత్వంగా పొందినా, సంపద సృష్టిపై కూడా వారు దృష్టి పెట్టారని షా విశ్లేషించారు. హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఐదు ట్రిలియన్ డాలర్ల జీడీపీని లక్ష్యంగా పెట్టుకోవడంతో కుబేరుల సంపద మూడు రెట్లు పెరగనుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సంపద సృష్టి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత అధికంగా ఉన్న భారత్‌లో సంపద సృష్టి జరిగే అవకాశం మెండుగా ఉందని, తద్వారా ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఐఐఎఫ్ఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
టాప్-10 కుబేరుల్లో జుకర్ బర్గ్
మార్కెట్ల పతనం, చమురు ధరలు పడిపోవడం ప్రపంచ ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపింది. చాలా మంది కుబేరుల సంపద విలువ గణనీయంగా తగ్గిపోయింది. ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 2009 నుంచి తొలిసారి 10 మంది స్థానం కోల్పోయారు. ఇక ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ సారి 221 మంది స్థానం కోల్పోగా, కొత్తగా 198 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. ప్రపంచ అత్యంత కుబేరుల తాజా జాబితాలో బిల్ గేట్స్ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద విలువ 5.08 లక్షల కోట్ల రూపాయలు. కాగా గతేడాదితో పోలిస్తే ఆయన సంపద విలువ దాదాపు 28 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది. యూరప్‌కు చెందిన జారా అమానికో ఓర్టెగా రెండో స్థానానికి దూసుకెళ్లారు. ఆయన ఈ స్థానానికి రావడం ఇదే మొదటి సారి. వారెన్ బఫెట్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంతకుముందు 2వ స్థానంలో ఉన్న మెక్సికో వాసి కార్లోస్ స్లిమ్ 4వ స్థానానికి పడిపోయారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ 16వ స్థానం నుంచి ఏకంగా 6వ స్థానానికి ఎదిగారు. జుకర్ బర్గ్‌తో పాటు అమేజాన్ సీఈవో జెఫ్ బిజోస్ తొలిసారి టాప్-10లో స్థానం సంపాదించారు. చైనాకు చెందిన వాంగ్ జియాన్లిన్ తొలిసారి టాప్-20లో చేరారు.