గోల్డెన్ పాస్‌పోర్ట్ గురించి విన్నారా!. దీన్ని ఎక్కువగా అత్యంత ధనవంతులే కోరుకుంటారట. ఈ పాస్‌పోర్ట్‌ని పొందడమే అదృష్టంగా భావిస్తారట వారు. అసలేంటి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్. ధనవంతులకు ఆ పాస్‌పోర్ట్ అంటే ఎందుకంతా క్రేజ్!.
గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం పొందే పాస్‌పోర్ట్. గణనీయమైన ఆర్థిక పెట్టుబడుల ద్వారా వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు విదేశాల్లో నివాసం ఉండగలుగుతారు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని వీసా రహిత ప్రయాణం అనాలి. ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారాలను విస్తరించుకునేందుకు సులవైన మార్గం కూడా.
ఈ పాస్‌పోర్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు..
- గోల్డెన్ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అనేక దేశాలకు పాస్‌పోర్ట్ లేకుండా ఈజీగా రాకపోకలు సాగించగలరు. కొన్ని దేశాలు పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూసే వారికి అనూకూలమైన పన్ను విధానాలను అందించి మరీ పెట్టుబడులు పెట్టేలా చేసి మరీ ఈ వీసాలను ఇస్తాయట.
- ఇది కొత్త మార్కెట్లకి, పెట్టుబడి అవకాశాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
- ఈ పాస్‌పోర్ట్ కారణంగా ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలను తదితరాలను పొందుతారు.
ఇలాంటి పౌరసత్వాలను అందించే దేశాలు
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ఆంటిగ్వా మరియు బార్బుడా మరియు డొమినికా వంటి దేశాలు ఇలాంటి ఆకర్షణీయమైన పౌరసత్వ కార్యక్రమాలను అందిస్తున్నాయి. అలాగే మాల్టా, సైప్రస్ వంటి దేశాలు ఐరోపా చుట్టి వచ్చేలా, కొన్ని కరేబియన్ దేశాలు, వనాటు వంటివి యునైటెడ్ స్టేట్స్‌లో ఉండేలా ఆకర్షణీయమైన వీసాలను అందిస్తున్నాయి.
చుట్టుమడుతున్న వివాదాలు
గమ్యాన్ని బట్టి ఈ గోల్డెన్ పాస్‌పోర్ట్ వందల వేల నుంచి మిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ వీసా ఆర్థిక ప్రయోజనాలు, మెరగైన జీవనశైలికి ప్రధాన ఆకర్షణగా ఉన్నా.. ఆస్తుల దుర్వినియోగం జరిగే ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ధనవంతులకు ఇదోక అవకాశంలా.. ఆస్తులను కాపాడుకునేందుకు సులభమైన మార్గంలా ఉండే ప్రమాదం ఉంది. అలాగే భద్రత, స్వేచ్ఛ పరంగా కూడా ఈ పాస్‌పోర్ట్ విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి.
(చదవండి: అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment