ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో వ్యాపారవేత్తలు తమదైన రీతిలో బిజినెస్ చేస్తూ నువ్వా.. నేనా అన్నట్లు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 10 మంది జాబితా విడుదల చేసింది.
ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్ళీ టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) నిలిచాడు, ఆ తరువాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ, జెఫ్ బెజోస్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్), సెర్గీ బ్రిన్ (గూగుల్) నిలిచారు.
టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా
- ఇలాన్ మస్క్ (Elon Musk) - 227.8 బిలియన్ డాలర్స్
- బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - 179.3 బిలియన్ డాలర్స్
- జెఫ్ బెజోస్ - 174.0 బిలియన్ డాలర్స్
- లారీ ఎల్లిసన్ - 134.9 బిలియన్ డాలర్స్
- మార్క్ జుకర్‌బర్గ్ - 130.2 బిలియన్ డాలర్స్
- బిల్ గేట్స్ - 119.9 బిలియన్ డాలర్స్
- వారెన్ బఫెట్ - 119.2 బిలియన్ డాలర్స్
- లారీ పేజీ - 118.7 బిలియన్ డాలర్స్
- స్టీవ్ బాల్మెర్ - 115.4 బిలియన్ డాలర్స్
- సెర్గీ బ్రిన్ - 113.8 బిలియన్ డాలర్స్
Comments
Please login to add a commentAdd a comment