ప్రపంచంలో అత్యంత ధనవంతులు(Richest People)గా ఉన్నవారు తమ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తూంటారు. అందులో భాగంగా చాలామంది తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అందుకు తమ విద్యాభ్యాసం ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచంలోని టాప్ ధనవంతుల విద్యార్హతలు(Educational Qualifications) తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్
నికర విలువ: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్, సైన్స్ ఇన్ ఎకనామిక్స్ విభాగంగా బ్యాచిలర్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరిన కొన్ని రోజులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిసి తన వ్యాపారాలు ప్రారంభించారు.
జెఫ్ బెజోస్
నికర విలువ: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్
ప్రిన్‌స్టన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.
మార్క్ జుకర్ బర్గ్
నికర విలువ: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్‌బుక్
హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివారు.
లారీ ఎల్లిసన్
నికర విలువ: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్
యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎట్ అర్బానా-చాంపైన్ నుంచి ప్రీ-మెడికల్ స్టూడెంట్‌గా చేరాడు. కానీ డిగ్రీ పూర్తి కాకముందే చదువు ఆపేశాడు. తర్వాత కొంత కాలానికి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు.
బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ
నికర విలువ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్‌వీఎంహెచ్-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ
ఎకోల్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
లారీ పేజ్
నికర విలువ: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)
యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ పట్టా పొందారు.
సెర్గీ బ్రిన్
నికర విలువ: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలు
యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
వారెన్ బఫెట్
నికర విలువ: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్‌షైర్ హాత్‌వే
యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
ఇదీ చదవండి: ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..
స్టీవ్ బామర్
నికర విలువ: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరారు. కానీ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడం వల్ల చదువు మధ్యలోనే ఆపేశారు.
జెన్సెన్ హువాంగ్
నికర విలువ: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియా
ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment