qualification details report
-
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు
ప్రపంచంలో అత్యంత ధనవంతులు(Richest People)గా ఉన్నవారు తమ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తూంటారు. అందులో భాగంగా చాలామంది తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. అందుకు తమ విద్యాభ్యాసం ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచంలోని టాప్ ధనవంతుల విద్యార్హతలు(Educational Qualifications) తెలుసుకుందాం.ఎలాన్ మస్క్ నికర విలువ: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఆర్ట్స్ ఇన్ ఫిజిక్స్, సైన్స్ ఇన్ ఎకనామిక్స్ విభాగంగా బ్యాచిలర్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో చేరిన కొన్ని రోజులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిసి తన వ్యాపారాలు ప్రారంభించారు.జెఫ్ బెజోస్ నికర విలువ: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు.మార్క్ జుకర్ బర్గ్ నికర విలువ: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్బుక్హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివారు.లారీ ఎల్లిసన్ నికర విలువ: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఎట్ అర్బానా-చాంపైన్ నుంచి ప్రీ-మెడికల్ స్టూడెంట్‌గా చేరాడు. కానీ డిగ్రీ పూర్తి కాకముందే చదువు ఆపేశాడు. తర్వాత కొంత కాలానికి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు.బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నికర విలువ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్వీఎంహెచ్-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీఎకోల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.లారీ పేజ్ నికర విలువ: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ పట్టా పొందారు.సెర్గీ బ్రిన్ నికర విలువ: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలుయూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు.వారెన్ బఫెట్ నికర విలువ: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్‌షైర్ హాత్వేయూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె క్లెయిమ్ విధానంలో ఈ పొరపాట్లు వద్దు..స్టీవ్ బామర్ నికర విలువ: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరారు. కానీ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడం వల్ల చదువు మధ్యలోనే ఆపేశారు.జెన్సెన్ హువాంగ్ నికర విలువ: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియాఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. -
యూపీ రెండో దశ అభ్యర్థుల్లో..12 మంది నిరక్షరాస్యులు
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 55 స్థానాలకు సోమవారం జరిగే రెండో దశ పోలింగ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 12 మంది నిరక్షరాస్యులు. 67 మందికి కష్టంగా చదవడం, రాయడం వచ్చు. 114 మంది 8వ తరగతి దాకా చదివారు. 102 మంది పీజీ చేయగా ఆరుగురు పీహెచ్డీ చేశారు. అభ్యర్థుల అఫిడవిట్ల వివరాల ఆధారంగా యూపీ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఈ మేరకు వెల్లడించింది. మహిళా అభ్యర్థులు 11.8 శాతమున్నారని చెప్పింది -
టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు
అసెంబ్లీ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆర్కే మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ కార్యదర్శిగా కొనసాగడానికి అర్హతల్లేని కె.సత్యనారాయణను తక్షణం పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్హతల్లేవని తెలిసీ ఆ పదవిలో కొనసాగిస్తున్నా రంటే సీఎం చంద్రబాబుకు ఆయనతో ఉన్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యనారాయణ నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా టీడీపీ కార్యకర్తలా పనిచేస్తు న్నారని తప్పుపట్టారు. రెండేళ్లుగా కార్యదర్శి విద్యా ర్హతల గురించి సమాచారమడుగుతున్నా ఇవ్వట్లేదన్నారు. ఇదే విషయమై తాను సమాచారహక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే మూడు నెలల క్రితం అసెంబ్లీ పీఐఓకు రూ.15వేలు జరిమానా విధించారని తెలిపారు. తాను స్వయంగా స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కార్యాలయా లకెళ్లి సమాచారం కావాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. కార్యదర్శిపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమోదై నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందని, ప్రభుత్వోద్యోగిపై కేసు ఉన్నపుడు పదవినుంచి తప్పించి విచారణనుంచి బయటికొచ్చాకే మళ్లీ పదవివ్వాలని సీసీఏ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. -
‘ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని తొలగించాలి’
-
జనవరి 18న రికార్డులతో హాజరుకండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హత కేసులో జనవరి 18న అన్ని రికార్డులతో తమ ఎదుట హాజరుకావాలని అసెంబ్లీ పీఐవోను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది. శుక్రవారం ఆర్టీఐ కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసును వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
సర్టిఫికెట్లతో హాజరుకండి: ఆర్టీఐ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతల అంశంపై ఆర్టీఐ కమిషన్ స్పందించింది. అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతల సర్టిఫికెట్లతో డిసెంబర్ 14 న తమ ముందు హాజరు కావాలంటూ అసెంబ్లీ పిఐఓను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
'అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతలపై నివేదిక ఇవ్వండి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ విచారణకు ప్రభుత్వ తరఫు న్యాయవాది హాజరుకాలేదు. దీనిపై రెండు వారాల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. లేకుంటే చీఫ్ సెక్రటరీ కోర్టుకు రావాల్సి వస్తుందని హెచ్చరించింది. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.