జనవరి 18న రికార్డులతో హాజరుకండి | RTI directs to assembly pio to attend on january 18 th | Sakshi
Sakshi News home page

జనవరి 18న రికార్డులతో హాజరుకండి

Published Fri, Dec 23 2016 8:05 PM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

RTI directs to assembly pio to attend on january 18 th

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హత కేసులో జనవరి 18న అన్ని రికార్డులతో తమ ఎదుట హాజరుకావాలని అసెంబ్లీ పీఐవోను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది. శుక్రవారం ఆర్టీఐ కమిషనర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసును వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement