
సర్టిఫికెట్లతో హాజరుకండి: ఆర్టీఐ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతల అంశంపై ఆర్టీఐ కమిషన్ స్పందించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతల అంశంపై ఆర్టీఐ కమిషన్ స్పందించింది. అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతల సర్టిఫికెట్లతో డిసెంబర్ 14 న తమ ముందు హాజరు కావాలంటూ అసెంబ్లీ పిఐఓను ఆర్టీఐ కమిషన్ ఆదేశించింది.
అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.