
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 55 స్థానాలకు సోమవారం జరిగే రెండో దశ పోలింగ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 12 మంది నిరక్షరాస్యులు. 67 మందికి కష్టంగా చదవడం, రాయడం వచ్చు. 114 మంది 8వ తరగతి దాకా చదివారు. 102 మంది పీజీ చేయగా ఆరుగురు పీహెచ్‌డీ చేశారు. అభ్యర్థుల అఫిడవిట్ల వివరాల ఆధారంగా యూపీ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఈ మేరకు వెల్లడించింది. మహిళా అభ్యర్థులు 11.8 శాతమున్నారని చెప్పింది