qualification
-
నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!
Google Winter Internship 2024: ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి. అప్లై చేయడం ఎలా? అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి. https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది! కనీస అర్హతలు.. ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అనుభవం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python). ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, నెట్వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని. స్టైఫండ్ ఎలా? ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది. -
‘మోదీ’ తీర్పు దేశానికే షాక్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశమంతా షాకైందని ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ విద్యార్హతలపై అనుమానాలను ఈ తీర్పు మరింత పెంచింది. ఆయన నిజంగానే గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివి ఉంటే ఆ విషయాన్ని అవి గర్వంగా చెప్పుకోవాలి. అలాకాకుండా వివరాలు దాచేస్తున్నాయి. మోదీకి నిజంగానే డిగ్రీ ఉంటే దాన్ని గుజరాత్ వర్సిటీ ఎందుకు చూపించడం లేదు? ఇందుకు మోదీ అహంకారమైనా కారణం అయ్యుండాలి. లేదంటే ఆయన సర్టిఫికెట్లు నకిలీవైనా అయ్యుండాలి’’ అని అన్నారు. మోదీ విద్యావంతుడై ఉంటే నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసేవారు కాదని అభిప్రాయపడ్డారు. మోదీ విద్యార్హతలు కోరినందుకు కేజ్రీవాల్‌కు కోర్టు రూ.25 వేల జరిమానా కూడా విధించడం తెలిసిందే. -
హవ్వ... మోసగాడికి వత్తాసా?
తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఉదంతంలో చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. అశోక్‌బాబు అరెస్ట్ అయిన తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే దాన్ని కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌గా చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి అతడికి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీ సబార్డినేట్ రూల్ 23(6) ప్రకారం ప్రభుత్వ శాఖాధి పతులు, డైరెక్టర్ల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాలంటే సదరు ఉద్యోగి తప్పనిసరిగా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. కాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ బాబు వ్యవహరించారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన 1996 నాటికి పదోన్నతి పొంది విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. అదే సంవత్సరం శాఖాధిపతుల కార్యాలయంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను బీకామ్ చదివి నట్టూ, అలాగే ఎన్ఐఐటీ అనే ప్రైవేటు సంస్థ నుంచి డిప్లమో ఇన్ కంప్యూటర్ (డీకామ్) కూడా పొందినట్టూ అఫిడవిట్ ఇస్తూ దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాదు తన సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హతగా ఉన్న డీకామ్ను బీకామ్గా ట్యాంపర్ చేసి ప్రభుత్వాన్ని మోసగించారు. అశోక్‌బాబు మోసంపై వాణిజ్య పన్నుల శాఖలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాధిపతి కార్యాలయం కోసం దరఖాస్తు చేసిన ఆరుగురు ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను తన వద్దకు తీసుకురావాలని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. వారిలో ఐదుగురి సర్వీస్ రిజిస్టర్లు వచ్చాయి. కానీ అశోక్‌బాబు సర్వీస్ రిజిస్టర్ రాలేదు. తరువాత చూస్తే ఆయన సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్ వద్ద చిత్తు చిత్తుగా కొట్టివేసి ఉంది. అంటే ఆ కాలమ్‌లో ఏం రాసి ఉందన్నది ఎవరికీ తెలియకూడదనే అలా చేశారు. ప్రభుత్వ శాఖలో సంబంధిత అధికారి నియంత్రణలో ఉండాల్సిన సర్వీస్ రిజిస్ట ర్ను అనుమతి లేకుండా తీసుకుని అలా కొట్టివేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. అశోక్‌బాబు తప్పుడు విద్యార్హతలను పేర్కొంటూ ప్రభు త్వాన్ని మోసగించారనే ఫిర్యాదుపై 2013లోనే వాణిజ్య పన్నుల శాఖ విచారణకు ఆదేశించింది. కాగా 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అశోక్‌బాబుపై దర్యాప్తును 2018వరకు సాగ దీసిన టీడీపీ ప్రభుత్వం అతడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక టీడీపీకి రాజకీయ లబ్ధి కలిగించేలా 2014లో ప్రభుత్వ ఉద్యోగులను మోసగించిన అశోక్ బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చంద్రబాబు 2018 చివర్లో నిర్ణయించారు. దాంతో ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారు. సర్వీసు నిబంధన 42 ప్రకారం 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి వీఆర్ఎస్ కోసం కనీసం మూడు నెలల నోటీసు ఇవ్వాలి. ఆ ప్రకారం అశోక్‌బాబుకు 2019, జనవరి 31న వీఆర్ఎస్ ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా 2019, జనవరి 10నే ఆయనకు వీఆర్ఎస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎవరైనా ఉద్యోగిపై ఏదైనా కేసు పెండింగులో ఉంటే వీఆర్ఎస్కు అనుమతించకూడదన్నది ప్రభుత్వ నిబంధన. ఈ విషయంలోనూ అశోక్‌బాబుకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. తనపై ఎలాంటి కేసులు పెండిం గులో లేవని ఆయన తన వీఆర్ఎస్ దరఖాస్తులో పేర్కొన్నారు. దాన్ని సరిచూసుకోకుండానే ఉన్నతాధికారులు వీఆర్ఎస్కు అను మతించడం వెనుక టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. కానీ ఎమ్మెల్సీ నామినేషన్ çసందర్భంలో సమర్పించిన అఫిడివిట్లో అశోక్‌బాబు తనపై నాలుగు కేసులు పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. అంటే ఆయన వీఆర్ఎస్ దరఖాస్తులో ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు సమాచారమిచ్చారన్నది స్పష్టమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అశోక్‌బాబు అక్రమా లకు వత్తాసు పలకడంతో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగిలింది. దాంతో ఆయన అక్రమాలపై పూర్తి ఆధారాలతోసహా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అన్ని అంశా లను సమగ్రంగా పరిశీలించిన లోకాయుక్త అశోక్‌బాబుపై ఆరో పణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని భావించింది. అందుకే ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఆదేశిం చింది. ఎట్టకేలకు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ రంగం లోకి దిగి జనవరి 25న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అంతవరకు అశోక్‌బాబు తాను బీకామ్ చదివినట్టు సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపర్ చేశారనే అంతా భావించారు. కానీ సీఐడీ దర్యాప్తుతో ఆయన అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ఆయన ఏకంగా ఓ ఫేక్ బీకామ్ సర్టిఫికెట్‌ను సమర్పించినట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు తాను బీకామ్ చేసినట్టు ఆయన అఫిడవిట్ కూడా సమర్పించారని తెలిసింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వాన్ని మోసగించారన్నది నిర్ధారణ అయ్యింది. తగిన ఆధారాలు లభించినందునే సీఐడీ ఆయన్ని ఫిబ్రవరి 10 రాత్రి అరెస్టు చేసింది. విజయవాడలోని న్యాయస్థానంలో అశోక్‌బాబును ప్రవేశ పెట్టినప్పుడు ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయస్థానం స్పందిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ న్యాయస్థానం అశోక్‌బాబుకు బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. అంతేగానీ ఆయన ఏమీ నిర్దోషి అని తీర్పునివ్వలేదు. ఆయన అక్రమాలపై దర్యాప్తు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌బాబు బెయిల్‌పై విడుదల కాగానే ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు చంద్రబాబు. ఇదెంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఉద్యోగుల హక్కుల కోసం డిమాండ్ చేసినందుకే అశోక్‌బాబుపై ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టింది’ అని ఆరోపణలతో అసలు విష యాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు చంద్రబాబు. వాస్తవానికి ఉద్యోగుల సమస్యపై ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్‌బాబుకు ఏ సంబంధమూ లేదు. ఆయన ప్రస్తుతం ఉద్యోగుల ప్రతినిధి కాదు. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అంశంపై ఆందోళన చేశాయి. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సామ రస్యంగా పలు దఫాలు చర్చించి ఉభయపక్షాలకు సమ్మతంగా సానుకూల ఫలితాన్ని సాధించింది. 14 ఏళ్లు సీఎంగా చేశాను... రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం అశోక్ బాబుకు వత్తాసు పలకడం ద్వారా ఏకంగా ప్రభుత్వ అధికార వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. హవ్వ... ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా? – వడ్డాది శ్రీనివాస్, సాక్షి అమరావతి విలేఖరి -
Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): ‘నేనూ పేద కుటుంబంలోనే పుట్టా. కష్టపడి ఎదిగాను. కేంద్రమంత్రిగా పనిచేశా. గవర్నర్‌గా కొనసాగుతున్నా. ఇందుకు కారణం ఉన్నత చదువులు చదవడమేనని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గొల్లకురుమలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారసభకు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గొల్లకురుమల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ గొల్ల,కురుమలు గొర్లకాపరులుగా ఆగిపోవద్దన్నారు. వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు. గొల్ల కురుమలను ఎస్సీ జాబితాలో కలపాలనే వినతిని సర్కారుకు సిఫారసు చేస్తానన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, నాయకులు మహిపాల్, రవీందర్, మల్లేశ్, సురేశ్, సాయిబాబా పాల్గొన్నారు. చదవండి: ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా? -
‘నిట్’ ప్రవేశాలకు 75% మార్కులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు క్లాస్ 12 బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది’ అని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది. ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
‘డిగ్రీ లేకుండానే ఎం.ఫిల్ చేశాడా?!’
న్యూఢిల్లీ : ఓ వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా స్మృతి ఇరానీ గురించిన చర్చే నడుస్తోంది. స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో సమర్పించిన నివేదికలో మాత్రం ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్మృతి ఇరానీ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. స్మృతి ఇరానీకి మద్దతిస్తూ ఆమె తరఫున వకల్తా పుచ్చుకున్నారు. స్మృతి ఇరానీ డిగ్రీ చేయలేదు సరే.. మరి మీ నాయకుడు మాస్టర్స్ చేయకుండానే ఎం.ఫిల్ పూర్తి చేశాడు. దీనికి ఏం సమాధానం చెప్తారంటూ అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ తన ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంతో, ఇంతకాలం ఆమె విద్యార్హతలపై తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ల నుంచి తన డిగ్రీ పూర్తి అయ్యిందని స్మృతి చేసిన వాదనలు తప్పుగా నిరూపణ అయ్యాయి. దాంతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది.. ఎన్నికల కమిషన్ స్మృతి ఇరానీ నామినేషన్‌ని తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. -
‘ఐసీడీఎస్‌లో సూపర్వైజర్ అర్హత డిగ్రీనే’
సాక్షి, హైదరాబాద్: సమ గ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టులను పూర్తిస్థాయిలో పదోన్నతుల ద్వారానే ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు సోమవారం ఆ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో అంగన్వాడీ టీచర్ల అర్హతల నిబంధనల్లో కాస్త ఊరట కలగనుంది. అంగన్వాడీ టీచర్లలో అనుభవజ్ఞులు, అర్హత కలిగిన వారినే సూపర్వైజర్లు (గ్రేడ్–2)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..వారి విద్యార్హత కనీసం డిగ్రీ ఉండాల్సిందిగా పేర్కొంది. క్షేత్రస్థాయిలో డిగ్రీ చదివిన వారు అతి తక్కువ మంది ఉండటంతో ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. డిగ్రీ అర్హత కాకుండా పదోతరగతిని ప్రామాణికంగా తీసుకోవాలని మెజార్టీ టీచర్లు కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పదోతరగతి అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తామని కానీ, ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. -
డిప్లొమా అభ్యర్థుల అర్హతపై డైలమా
జంగారెడ్డిగూడెం : కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీలో డిప్లొమా(పాలిటెక్నిక్) అభ్యర్థుల అర్హతపై ఇంకా డైలమా కొనసాగుతోంది. పోస్టులకు వారూ అర్హులేనని ఏపీ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి ఇంకా స్పష్టత లేదు. ఫలితంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసి ప్రాథమిక పరీక్ష రాసి అర్హత సాధించిన డిప్లొమా అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షా సమయంలో పోలీసు అధికారులు అర్హులు కాదంటూ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది అభ్యర్థులు ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. నోటిఫికేషన్లో ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రకటించారు కనుక డిప్లొమా అభ్యర్థులూ అర్హులేనని ఈనెల 19న ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. కానిస్టేబుళ్ల ఎంపిక కోసం జిల్లాలోని ఏలూరు , భీమవరం కేంద్రాల్లో 21,661 మంది అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష రాశారు. వీరిలో 6,472 మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,86,472 మంది పరీక్షలకు హాజరుకాగా 1,16,127 మంది అర్హత సాధించారు. వీరందరికీ పోలీసు రిక్రూట్ మెంట్‌బోర్డు జారీ చేసిన నిబంధనల ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి వారంపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. పాలిటెక్నిక్ అభ్యర్థులను మాత్రం సర్టిఫికేట్ల పరిశీలన దశలోనే నిరాకరించారు. దీంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డిప్లొమా అభ్యర్థులు జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కొందరు రిక్రూట్మెంట్ బోర్డుకు తమ అభ్యర్థనను మెయిల్ ద్వారా పంపారు. అయినా స్పందన లేకపోవడంతో అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లోనూ ఇదే సమస్య తలెత్తడంతో అక్కడి అభ్యర్థులంతా ఉన్నత విద్యాశాఖను ఆశ్రయించారు. దీంతో ఇంటర్మీడియెట్ బోర్డు పాలిటెక్నిక్ కూడా ఇంటర్మీడియెట్‌తో సమానమేనని ప్రకటించింది. దీంతో అక్కడ డిప్లొమా అభ్యర్థులకూ అర్హత కల్పించారు. తాజాగా ఏపీ ట్రిబ్యునల్ తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గానీ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా అభ్యర్థులకు ఎటువంటి సమాచారం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల మందికిపైగా డిప్లొమా అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష అర్హత సాధించగా, జిల్లాలో ఈ సంఖ్య 200కు పైగానే ఉంది. ఏపీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కాపీని ఏపీ పోలీస్రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్‌ను కలిసి డిప్లొమా అభ్యర్థులు అందజేశారు. అయినా స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును గౌరవించి న్యాయం చేయాలని డిప్లొమా అభ్యర్థులు కోరుతున్నారు. -
‘రియో’కు మరో హైదరాబాదీ
అర్హత సాధించిన షూటర్ కైనాన్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు హైదరాబాద్ షూటర్ కైనాన్ చెనాయ్ క్వాలిఫై అయ్యాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో అతను పోటీ పడతాడు. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో గురువారం కైనాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. పతకం సాధించకపోయినా సెమీస్‌కు చేరడంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే రియోకు ఎంపికయ్యాడు. కైనాన్తో కలిపి ఇప్పటికి వరకు షూటింగ్లో భారత్‌నుంచి 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్ల సంఖ్య పదికి చేరింది. మరో వైపు విజయ్ కుమార్ ఆశలు ఆవిరయ్యాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విఫలం కావడంతో విజయ్ రియో అవకాశం కోల్పోయాడు. -
నా పనితీరును చూడండి.. చదువును కాదు..