‘రియో’కు మరో హైదరాబాదీ | another hyderabad shooter to riyo olympics | Sakshi
Sakshi News home page

‘రియో’కు మరో హైదరాబాదీ

Published Fri, Jan 29 2016 12:19 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

‘రియో’కు మరో హైదరాబాదీ - Sakshi

‘రియో’కు మరో హైదరాబాదీ

అర్హత సాధించిన షూటర్ కైనాన్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు హైదరాబాద్ షూటర్ కైనాన్ చెనాయ్ క్వాలిఫై అయ్యాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో అతను పోటీ పడతాడు. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో గురువారం కైనాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. పతకం సాధించకపోయినా సెమీస్‌కు చేరడంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే రియోకు ఎంపికయ్యాడు.

కైనాన్‌తో కలిపి ఇప్పటికి వరకు షూటింగ్‌లో భారత్‌నుంచి 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్ల సంఖ్య పదికి చేరింది. మరో వైపు విజయ్ కుమార్ ఆశలు ఆవిరయ్యాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో విఫలం కావడంతో విజయ్ రియో అవకాశం కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement