న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశమంతా షాకైందని ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ విద్యార్హతలపై అనుమానాలను ఈ తీర్పు మరింత పెంచింది. ఆయన నిజంగానే గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివి ఉంటే ఆ విషయాన్ని అవి గర్వంగా చెప్పుకోవాలి.
అలాకాకుండా వివరాలు దాచేస్తున్నాయి. మోదీకి నిజంగానే డిగ్రీ ఉంటే దాన్ని గుజరాత్ వర్సిటీ ఎందుకు చూపించడం లేదు? ఇందుకు మోదీ అహంకారమైనా కారణం అయ్యుండాలి. లేదంటే ఆయన సర్టిఫికెట్లు నకిలీవైనా అయ్యుండాలి’’ అని అన్నారు. మోదీ విద్యావంతుడై ఉంటే నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసేవారు కాదని అభిప్రాయపడ్డారు. మోదీ విద్యార్హతలు కోరినందుకు కేజ్రీవాల్‌కు కోర్టు రూ.25 వేల జరిమానా కూడా విధించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment