అత్యంత సంపన్నురాలుకు తప్పని ఓటమి | Country's richest woman loses in Haryana polls | Sakshi

అత్యంత సంపన్నురాలుకు తప్పని ఓటమి

Oct 19 2014 5:19 PM | Updated on Sep 2 2017 3:06 PM

దేశంలో అత్యంత సంపన్నురాలిగా పేరుగాంచిన సావిత్రి జిందాల్కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది.

చండీగఢ్:దేశంలో అత్యంత సంపన్నురాలిగా పేరుగాంచిన సావిత్రి జిందాల్కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది.కాంగ్రెస్ పార్టీ తరపున హిసార్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన సావిత్రి ఓటమిపాలయ్యారు.

2005, 2009 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి పదవి చేపట్టిన సావిత్రికి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశలు అడియాశలయ్యాయి.  ఆమె 13 వేలకు పైగా ఓట్ల తేడాతో సమీప బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో ఓడారు. వేల కోట్ల రూపాయల ఓపీ జిందాల్ గ్రూప్నకు సావిత్రి చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్కు తల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement