కామారెడ్డి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా భావించిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు అయోమయాన్ని సృష్టించా యి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు గత నెల 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందు, మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11తేదీ ల్లో మండల, జిల్లా ప్రాదేశిక నియోజ కవర్గాల ఎన్నికలు జరిగాయి.
వాటికి సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 12,13 తేదీలలో పూర్తి కాగా, వాటి లో మిశ్రమ ఫలితాలు రావడం అభ్యర్థులను ఆలోచనలో పడవేసింది. సా ర్వత్రికానికి ముందు జరిగిన ఎన్నికలను సెమీస్‌గా భావించారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల ఫలితా లు ఒక రకంగా ఉండగా, ప్రాదేశిక నియోజకవర్గాల ఫలితాలు మరోరకంగా ఉన్నా యి. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వారిని వెన్నాడుతోంది.
ఇదీ పరిస్థితి
కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఫలితాలను పరిశీలిస్తే, కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులకుగాను కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుం ది. ఇండిపెండెంట్‌గా గెలుపొందిన ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. టీఆర్‌ఎస్ కేవలం ఐదుగురు కౌన్సిలర్లను గెలు చుకుంది. ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 14,087 కాగా, టీఆర్‌ఎస్‌కు 11,345 ఓట్లు వచ్చాయి. సీట్ల పరంగా టీఆర్‌ఎస్ కన్నా 12 స్థానాలు ఎక్కువగా గెలుచుకున్న కాంగ్రెస్‌కు కేవలం 2,742 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అలాగే మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
నియో జకవర్గంలో నాలుగు జడ్‌పీటీసీ స్థానాలుండగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చెరో రెండింటిని గెలుచుకున్నాయి. ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్‌కు 48,560 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ కు 50,309 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌కు కేవలం 1749 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఎంపీటీసీ స్థానాల సంఖ్యను పరిశీలిస్తే నియోజకవర్గంలో 63 స్థానాలకుగాను కాంగ్రెస్ 33 గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌కు 27 స్థానాలు మాత్రమే వచ్చాయి. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మద్య నువ్వానేనా అన్నట్టుగా పో టీ కనిపించింది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. మరి సార్వత్రిక ఎన్నికలలో ఓటరు ఎలా తీర్పు ఇచ్చాడన్నది తేలాలంటే మరో రోజు వేచిచూడాల్సిందే. ఎన్నికలోల గెలిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఓడితే రాజకీయంగా దెబ్బతినాల్సిందేనన్న అభిప్రాయం వారిని వెన్నాడుతోంది.
అంతటా ఇలాగే
దాదాపు ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాలలో నెలకొని ఉంది. నిజామాబాద్ నగరంలో అనూహ్యంగా ఎంఐఎం దూసుకువచ్చింది. ఇది అంచనాలను తారుమారు చేస్తుందేమోననే ఆలోచన ఆయా పార్టీల నేతలను వెంటాడుతోంది. బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో అన్ని జడ్‌పీటీసీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకు ంది. మిగతా ప్రాంతాలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇదే నేతలను ఆందోళనకు గురి చేస్తోంది.
బల్దియా, పరిషత్ఫలితాలతో అయోమయం
Published Thu, May 15 2014 3:08 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement