semi-finals
-
ఖోఖో ప్రపంచకప్: సెమీస్‌లో భారత జట్లు
న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. దేశీయ క్రీడలో దుమ్మురేపుతున్న మన జట్లు క్వార్టర్స్‌లో అదే ఆధిపత్యం కనబర్చాయి. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో భారత్ 109–16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. వరుసగా ఐదో మ్యాచ్‌లో 100 పాయింట్లకు పైగా స్కోరు చేసిన మన అమ్మాయిలు... ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లె, నస్రిన్ షేక్, ప్రియాంక, రేష్మ రాథోడ్ సత్తా చాటారు. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఉగాండా 71–26 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌పై, దక్షిణాఫ్రికా 51–46 పాయింట్ల తేడాతో కెన్యాపై, నేపాల్ 103–8 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాయి. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో ఉగాండాతో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతాయి. పురుషుల క్వార్టర్ ఫైనల్లో భారత్ 100–40 పాయింట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రామ్‌జీ కశ్యప్, ప్రతీక్, ఆదిత్య విజృంభించడంతో తొలి రౌండ్లోనే 58 పాయింట్లు సాధించిన భారత్... చివరి వరకు అదే జోరు కొనసాగించింది. రెండో రౌండ్లో తీవ్రంగా పోరాడిన శ్రీలంక ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 58–38తో ఇంగ్లండ్‌పై, నేపాల్ 67–18తో బంగ్లాదేశ్‌పై, ఇరాన్ 86–18తో కెన్యాపై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. నేడు జరగనున్న సెమీఫైనల్స్‌లో ఇరాన్‌తో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్ తలపడతాయి. -
Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో హాంకాంగ్‌పై నెగ్గింది. 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–13, 21–12తో ఎన్జీ సాజ్ వైయు–ఎన్జీ వింగ్ యుంగ్ జోడీపై నెగ్గి భారత్‌కు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్–తనీషా 24–26, 17–21తో లీ చున్ రెగినాడ్–ఎన్జీ సాజ్ వైయు చేతిలో... లక్ష్య సేన్ 22–20, 19–21, 18–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–16, 21–11తో తాంగ్ చున్ మన్–యెంగ్ షింగ్ చోయ్ ద్వయంపై నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో పీవీ సింధు 16–21, 21–7, 21–9తో సలోని మెహతాను ఓడించడంతో భారత్ 2–2తో స్కోరును సమం చేసింది. -
FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్ కిక్’
ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్ చాంపియన్’ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు ఫ్రాన్స్... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడుతుంది. దోహా: అర్జెంటీనా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్‌గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్... 79వ నిమిషంలో ‘సబ్‌స్టిట్యూట్’ రాన్‌డల్ కొలొముని ఫ్రాన్స్ జట్టుకు చెరో గోల్ అందించారు. 78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్ రాన్‌డల్ 44 సెకన్లలోనే గోల్ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్ ఇవ్వని మొరాకో సెమీస్‌లో రెండు గోల్స్ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్‌లకి, తాజా సెమీఫైనల్స్‌కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్ సమరం రెండు సాకారం కాలేకపోయాయి. ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్మన్ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్ షాట్ కష్టం కావడంతో కిలియాన్ ఎంబాపెకు క్రాస్ చేశాడు. కానీ అతని షాట్ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్‌పోస్ట్‌కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్ కీపర్ యాసిన్ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్ రొమెయిన్ సైస్, అచ్రాఫ్ డారి గోల్‌పోస్ట్‌ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు. ఆఖరి క్షణంలో గోల్పోస్ట్లోనే ఉన్న అచ్రాఫ్ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్ అయ్యింది. ఫ్రాన్స్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్ వొవునహి ఫ్రాన్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా లాంగ్‌షాట్ కొట్టాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా మిస్సయ్యింది. ఒలివియర్ జిరూడ్ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్‌కీపర్ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్‌పోస్ట్ కుడివైపున బార్ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్ ఆటగాడు జిరూడ్ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్‌ను మొరాకో డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ కళ్లు చెదిరే కిక్‌తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్ వేగంతో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్‌ను గోల్‌పోస్ట్ కుడివైపున ఉన్న జవాద్ ఎల్ యామిక్ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్ కిక్ కొట్టాడు. దాదాపు గోల్ అయ్యే ఈ షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ కుడి వైపునకు డైవ్ చేసి చేతితో బయటికి పంపించాడు. ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్‌డల్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్ చేసుకొని గోల్‌పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్‌పోస్ట్‌కు మరింత సమీపంలో ఉన్న రాన్డల్కు ఎంబాపె క్రాస్పాస్ చేశాడు. 79 నిమిషంలో రాన్‌డల్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది. 4: ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది. 5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962), నెదర్లాండ్స్ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి. 4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఫైనల్‌కు చేర్చిన నాలుగో కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన దిదీర్ డెషాంప్ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్బాయెర్ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెషాంప్ ప్లేయర్‌గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు ఆయనే కోచ్‌గా ఉన్నారు. 3: ప్రపంచకప్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా ఫాస్టెస్ట్ గోల్ చేసిన మూడో ప్లేయర్‌గా రాన్‌డల్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్ మొరాలెస్ (ఉరుగ్వే; 2002లో సెనెగల్పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్ (డెన్మార్క్; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
T20 World Cup 2022: ఈసారీ ఫ్లాప్ షో
ఏడాది వ్యవధిలో మరోసారి భారత క్రికెట్ అభిమానులను మన జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. గత టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశకే పరిమితమైన జట్టు ఆ నిరాశను దూరం చేస్తూ ఈసారి అత్యధిక విజయాలతో సెమీస్ చేరడంతో కొత్తగా ఆశలు చిగురించాయి. అయితే ఇంగ్లండ్ అద్భుత బ్యాటింగ్‌తో వాటిని తుంచేసింది. ఇప్పటి వరకు మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు చూస్తే సెమీస్‌లోనూ విజయం సులువనిపించింది. కానీ బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించలేక సగం ఆట ముగిసే సరికే వెనకడుగు వేసిన టీమిండియా... బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఓపెనర్లు చెలరేగుతుంటే ఏం చేయాలో కెప్టెన్ సహా ఆటగాళ్లు బిక్కమొహం వేశారు! టాస్ ఓడిపోవటం మొదలు ఏదీ భారత్‌కు అనుకూలంగా సాగలేదు. ఓపెనర్ల వైఫల్యం ఇక్కడా కొనసాగగా, మరోసారి ఆదుకోవాల్సిన భారం కోహ్లిపై పడింది. పరిస్థితిని బట్టి అతను కూడా కాస్త తగ్గి ఆడాల్సి రాగా, 360 డిగ్రీ సూర్యకుమార్‌ను సరైన వ్యూహంతో ఇంగ్లండ్ కట్టిపడేసింది. అంతా చేయిదాటిపోతున్న దశలో హార్దిక్ చెలరేగడంతో కీలక పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఛేదన ఇంత సులువా అనిపించేలా హేల్స్, బట్లర్ ఎవరినీ లెక్క చేయకుండా మన బౌలర్లందరిపై విరుచుకుపడ్డారు. ఫలితమే టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యం... ఆపై టీమిండియా ఓటమి ఖాయం. టోర్నీ తొలి విజేత తర్వాతి ఏడు ప్రయత్నాల్లోనూ రిక్తహస్తాలతో ఇంటికి..! అడిలైడ్: టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. సెమీస్‌లో సత్తా చాటి ఎంసీజీలో మరోసారి పాకిస్తాన్‌ను ఢీకొడుతుందని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఫైనల్ సాధ్యమవుతుందని భావించిన వారందరికీ ఇంగ్లండ్ బలమైన షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లి (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) మరో అర్ధసెంచరీ సాధించాడు. జోర్డాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), కెప్టెన్ జోస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం మెల్బోర్న్లో జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్ మైదానంలోనే ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడగా పాక్ గెలిచింది. సూర్యకుమార్ విఫలం... ఈ నాకౌట్ మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో భారత్ స్కోరు 62/2 మాత్రమే! ఈ అతి జాగ్రత్తే చివరకు జట్టు కొంప ముంచింది. చివర్లో హార్దిక్ జోరుతో కొన్ని పరుగులు వేగంగా వచ్చినా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తగినంత స్కోరు చేయలేక టీమిండియా భంగపడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) మరో కీలక పోరులోనూ పేలవ ప్రదర్శన కనబర్చగా, రోహిత్ శర్మ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యాడు. రోహిత్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ (10 బంతుల్లో 14) వరుస బంతుల్లో 6, 4 కొట్టి తన శైలిని ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాతి బంతికే రషీద్ అతని ఆటను ముగించడంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగి లింది. ఫలితంగా కోహ్లి కూడా ఆత్మరక్షణలో పడి ధాటిని ప్రదర్శించలేకపోయాడు. 16 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 110 పరుగులకు చేరింది. 4 ఓవర్లలో 58 పరుగులు... భారత జట్టు చివరకు కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగిందంటే హార్దిక్ బ్యాటింగే కారణం. చివరి 4 ఓవర్లలో భారత్ 58 పరుగులు సాధిస్తే అందులో హార్దిక్ ఒక్కడే 50 కొట్టాడు! 18 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను, స్యామ్ కరన్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదాడు. మరో ఎండ్‌లో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి వెనుదిరగ్గా, పంత్ (6) రనౌటయ్యాడు. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కూడా వరుసగా 6, 4 కొట్టాక వెనక్కి జరిగి మరో భారీ షాట్ ఆడే క్రమంలో ఆఖరి బంతికి హార్దిక్ అవుటయ్యాడు. బంతి బౌండరీని దాటినా, షాట్ ఆడే సమయంలో అతని కాలు స్టంప్స్‌ను తాకింది. ఎదురులేని బ్యాటింగ్... ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించే వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి వరకు దానిని కొనసాగించింది. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఓపెనింగ్ జోడీనే విడదీయలేకపోయారు. ఈ మ్యాచ్‌కు ముందు భువనేశ్వర్ బౌలింగ్‌లో చెత్త రికార్డు (32 బంతుల్లో 5 సార్లు అవుట్) ఉన్న బట్లర్ ఈసారి మాత్రం వెనక్కి తగ్గలేదు. భువీ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు బాది అతను తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో హేల్స్ 6, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో ఇంగ్లండ్ 63 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్‌తో) సాధించింది. ఆ తర్వాత మరింత జోరుగా లక్ష్యం దిశగా జట్టు దూసుకుపోయింది. 28 బంతుల్లోనే హేల్స్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 61 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. అశ్విన్ ఓవర్లో హేల్స్ 6, 4 కొట్టగా, హార్దిక్ ఓవర్లో 6, 4 బాది బట్లర్ 36 బంతుల్లో తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత షమీ ఓవర్లో బట్లర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. షమీ తర్వాతి ఓవర్ ఆఖరి బంతికి లాంగాన్ మీదుగా భారీ సిక్సర్‌తో హేల్స్ ఆట ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వోక్స్ 5; రోహిత్ (సి) కరన్ (బి) జోర్డాన్ 27; కోహ్లి (సి) రషీద్ (బి) జోర్డాన్ 50; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రషీద్ 14; హార్దిక్ (హిట్‌వికెట్) (బి) జోర్డాన్ 63; పంత్ (రనౌట్) 6; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–56, 3–75, 4–136, 5–158, 6–168. బౌలింగ్: స్టోక్స్ 2–0–18–0, వోక్స్ 3–0–24–1, స్యామ్ కరన్ 4–0–42–0, రషీద్ 4–0–20–1, లివింగ్‌స్టోన్ 3–0–21–0, జోర్డాన్ 4–0–43–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బట్లర్ (నాటౌట్) 80; హేల్స్ (నాటౌట్) 86; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 170. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–25–0, అర్‡్షదీప్ 2–0–15–0, అక్షర్ 4–0–30–0, షమీ 3–0–39–0, అశ్విన్ 2–0–27–0, హార్దిక్ 3–0–34–0. ఈ రోజు మా ఆటతో చాలా నిరాశ చెందాను. మేం బ్యాటింగ్ బాగానే చేశామని భావిస్తున్నా. బౌలింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం. 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యం ఛేదించేంత సులువైన పిచ్ ఏమీ కాదిది. నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించడం ముఖ్యం. ఇది ఎలా చేయాలో ఎవరూ నేర్పించరు. అది వ్యక్తిగతంగా చేయాల్సిన పని. ఐపీఎల్లో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లలో వారంతా ఒత్తిడిని అధిగమించినవారే. మా బౌలింగ్‌కు సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లో బంతి కొంత స్వింగ్ అయినా అది సరైన దిశలో వెళ్లలేదు. మైదానం కొలతలపై మాకు అవగాహన ఉంది. వికెట్‌కు ఇరువైపులా పరుగులు ఆపేందుకు వ్యూహాలు రూపొందించినా ఇంగ్లండ్ ఓపెనర్లు భారీగా పరుగులు రాబట్టగలిగారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 170: టి20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం. 1: టి20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఒక జట్టు 10: వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొదటిసారి. 2:టి20 ప్రపంచకప్‌లో (2021లో పాక్ చేతిలో) రెండుసార్లు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఏకైక జట్టు భారత్. 4008: అంతర్జాతీయ టి20ల్లో కోహ్లి పరుగులు. 4 వేల పరుగులు దాటిన తొలి ఆటగాడిగా కోహ్లి. -
నిఖత్ సంచలనం
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నాజిమ్ కైజబే (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన బౌట్లో నిఖత్ 5–0తో నాజిమ్‌ను ఓడించింది. నిఖత్‌తోపాటు సరితా దేవి (60 కేజీలు), మనీషా (54 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో 37 ఏళ్ల సరితా దేవి 3–2తో రిమ్మా వొలసెంకో (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో పెటిసియో నైస్ జా (ఫిలిప్పీన్స్)పై, సిమ్రన్4–1తో హా తిన్ లిన్ (వియత్నాం)పై గెలిచారు. శివ థాపా కొత్త చరిత్ర పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో శివ 5–0తో రుజాక్రన్ జున్త్రోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో శివ 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం సాధించాడు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆశిష్ కుమార్ 5–0తో ఒముర్బెక్ (కిర్గిస్తాన్)పై, ఆశిష్ 5–0తో త్రాన్ డుక్ థో (వియత్నాం)పై, సతీశ్ 3–2తో దోయోన్ కిమ్ (కొరియా)పై గెలిచారు. ఓవరాల్‌గా భారత్ నుంచి 13 మంది బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం సెమీఫైనల్ బౌట్లు జరుగుతాయి. -
సాక్షి ఇండియా స్పెల్‌బీ సెమి ఫైనల్ కేటగిరీ–4
-
అమ్మాయిల ఆటకట్టు!
తొలిసారి ఐసీసీ టోర్నీని గెలుచుకోవాలని ఆశించిన భారత మహిళల జట్టుకు సెమీ ఫైనల్లోనే భంగపాటు ఎదురైంది. ఏడాది క్రితం వన్డే ఫైనల్లో మన ఆశలు కూల్చిన ఇంగ్లండ్ ఈసారి మరో అడుగు ముందే టీమిండియా ఆట కట్టించింది. సీనియర్ ప్లేయర్‌ను పక్కన పెట్టిన వ్యూహాత్మక తప్పిదం మొదలు పిచ్‌కు తగినట్లుగా ఆటతీరును మార్చుకోలేక బ్యాటింగ్‌లో కుప్ప కూలడం, ఆపై ఆరుగురు స్పిన్నర్లు కూడా ప్రత్యర్థిపై ప్రభావం చూపలేకపోవడంతో మన పోరు తుది సమరానికి చేరక ముందే ముగిసి పోయింది. లీగ్ దశలో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద కనిపించిన హర్మన్ సేన అసలు ఆటలో మాజీ చాంపియన్ ముందు నిలవలేక చేతులెత్తేసింది. నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు మూడోసారి సెమీఫైనల్‌కే పరిమితమైంది. గతంలో రెండు సార్లు సెమీస్ చేరిన టీమిండియా ఈసారి అద్భుతమైన ఫామ్‌లో ఉండి కూడా ఆ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్ర వారం తెల్లవారు జామున ఇక్కడి సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాప్–4 మినహా మిగతా ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ (3/9), కిర్స్టీ గార్డన్ (2/20), ఎకెల్‌స్టోన్ (2/22) భారత్‌ను దెబ్బ తీశారు. భారత్ ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు ఉన్నాయి. అనంతరం ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమీ జోన్స్ (47 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), నటాలీ స్కివర్ (38 బంతుల్లో 52; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. 23 పరుగులకే 8 వికెట్లు... స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో భారత్‌కు శుభారంభమే లభించింది. 13 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను ఎకెల్‌స్టోన్ వదిలేసింది. ఆ వెంటనే ఎకెల్‌స్టోన్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్మృతి ఫోర్, సిక్సర్ బాదింది. అయితే చివరకు ఆమె ఓవర్లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి స్మృతి వెనుదిరిగింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 కాగా... ఆ ఓవర్ చివరి బంతికి భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ తాన్యా (11) ప్రభావం చూపలేకపోయింది. అయితే హర్మన్ (20 బంతు ల్లో 16; 1 సిక్స్), జెమీమా కలిసి వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, 1 సిక్సర్ సహా భారత్ 19 పరుగులు రాబట్టింది. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి జెమీమా రనౌట్ కావడంతో ఆట మలుపు తిరిగింది. గార్డన్ ఒకే ఓవర్లో వేద కృష్ణమూర్తి (2), హర్మన్లను ఔట్ చేయగా... హీతర్ నైట్ వరుస బంతుల్లో హేమలత (1), అనూజ (0)లను డగౌట్ పంపించింది. రాధ (4) రనౌట్ కాగా, చివరి ఓవర్లో అరుంధతి (6), దీప్తి (7) ఔట్ కావడంతో మరో మూడు బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. అలవోకగా... స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి కొంత ఆశలు రేపారు. రెండో ఓవర్లోనే బీమాంట్ (1)ను రాధ ఔట్ చేయగా...తడబడుతూ ఆడిన వ్యాట్ (8)ను దీప్తి వెనక్కి పంపించింది. అయితే ఈ దశలో జోన్స్, స్కివర్ సమర్థంగా ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. భారత బ్యాటింగ్‌ను చూసిన అనుభవంతో ఎలాంటి సాహసాలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. పిచ్‌ను సరిగా అంచనా వేయడంలో వీరిద్దరు సఫలమయ్యారు. 2 పరుగుల వద్ద స్కివర్ ఇచ్చిన క్యాచ్‌ను పూనమ్ వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా వీరిద్దరు జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో ముందుగా స్కివర్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అనూజ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన జోన్స్ అర్ధసెంచరీతో పాటు మ్యాచ్‌ను కూడా ముగించింది. ‘హర్మన్ మోసకారి’ ‘ఆమె అబద్ధాల కోరు, మోసకారి, తారుమారు చేసే మనిషి, పరిణతి చెందలేదు. కెప్టెన్‌గా పనికి రాదు. మహిళల క్రికెట్ ఆట కంటే రాజకీయాలను ఎక్కువగా నమ్ముతుండటం దురదృష్టకరం’ అంటూ హర్మన్‌ప్రీత్‌పై మిథాలీ రాజ్ మేనేజర్ అనీషా గుప్తా నిప్పులు చెరిగింది. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో మిథాలీని ఆడించకపోవడంపై తన ఆగ్రహాన్నంతా ట్విట్టర్లో వెళ్లగక్కింది. -
మేరీ మెరిసె...
న్యూఢిల్లీ: పట్టుదల ఉండాలే కాని వయసనేది ఒక అంకె మాత్రమేనని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ నిరూపించింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో సెమీస్ చేరడం ద్వారా ఈ మణిపూర్ మెరిక కొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఏడు పతకాలు గెలిచిన తొలి బాక్సర్‌గా మేరీకోమ్ ఘనత వహించింది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రజతంతో కలిపి ఆరు పతకాలు నెగ్గిన మేరీకోమ్ తాజా ప్రదర్శనతో తన ఖాతాలో ఏడో పతకాన్ని జమ చేసుకుంది. ఈ టోర్నీకి ముందు ఈ రికార్డు కేటీ టేలర్ (ఐర్లాండ్–6 పతకాలు), మేరీకోమ్ పేరిట సంయుక్తంగా ఉండేది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల మేరీకోమ్ 5–0తో వు యు (చైనా)పై ఘనవిజయం సాధించింది. మేరీకోమ్‌తోపాటు లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మరో మూడు పతకాలను ఖాయం చేశారు. అయితే భారత్‌కే చెందిన పింకీ రాణి (51 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు), మనీషా (64 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 21 ఏళ్ల లవ్లీనా 5–0తో స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)పై; 21 ఏళ్ల సోనియా 4–1తో మెసెలా యెని కాస్టెనాడ (కొలంబియా)పై; 23 ఏళ్ల సిమ్రన్‌జిత్ 3–1తో అమీ సారా (ఐర్లాండ్)పై విజయం సాధించారు. పింకీ 0–5తో పాంగ్ చోల్ మి (ఉత్తర కొరియా) చేతిలో... మనీషా 1–4తో స్టొయికా పెట్రోవా (బల్గేరియా) చేతిలో... భాగ్య వతి 2–3తో జెస్సికా (కొలంబియా) చేతిలో... సీమా 0–5తో జియోలి (చైనా) చేతిలో ఓడారు. బుధవారం విశ్రాంతి దినం. గురు, శుక్రవారాల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా) తో మేరీకోమ్; చెన్ నియెన్ చిన్ (చైనీస్ తైపీ)తో లవ్లీనా... శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జో సన్ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్ డుయు (చైనా)తో సిమ్రన్‌జిత్ తలపడతారు. -
సెమీస్‌కు సునాయాసంగా
ప్రత్యర్థి బౌలింగ్ నుంచి ప్రతిఘటన ఎదురైనా... బ్యాటింగ్‌లో మోస్తరు స్కోరే చేయగలిగినా... పట్టు విడవని భారత అమ్మాయిలు విజయాన్ని ఒడిసిపట్టారు. టి20 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్స్ చేరారు. హైదరాబాదీ మిథాలీ రాజ్ స్థిరమైన ఇన్నింగ్స్‌కు... రాధ యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ స్పిన్ మాయ తోడవడంతో టీమిండియా గెలుపు సునాయాసమైంది. ప్రావిడెన్స్: భారత అమ్మాయిలు అంచనాలను అందుకున్నారు. హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టారు. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం రాత్రి ఐర్లాండ్‌తో ఇక్కడ జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ప్రపంచకప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిథాలీ రాజ్ (56 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు స్మృతి మంధాన (29 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. కింబర్లీ గార్త్ (2/22) కట్టడి చేసింది. ఛేదనలో రాధ యాదవ్ (3/25), దీప్తి శర్మ (2/15) పొదుపైన బౌలింగ్‌తో ఐర్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. ఇసొబెల్ జాయ్సే (33) టాప్ స్కోరర్. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. మిథాలీ అర్ధశతకం... తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌కు మిథాలీ, స్మృతి శుభారంభం అందించారు. పెద్దగా మెరుపుల్లేకున్నా సమయోచితంగా ఆడారు. మళ్లీ భారీ స్కోరు ఖాయం అనుకుంటున్న దశలో స్మృతిని బౌల్డ్ చేసి గార్త్ ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. దూకుడు చూపిన జెమీమా రోడ్రిగ్స్ (11 బంతుల్లో 18; 3 ఫోర్లు) మిథాలీకి అండగా నిలిచింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ 40 పరుగులు జత చేశారు. అప్పటికి ఐదు ఓవర్లపైనే ఆట ఉండటం... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (7) బ్యాటింగ్‌కు రావడంతో టీమిండియా మరోసారి పెద్ద లక్ష్యాన్ని విధించేలా కనిపించింది. అయితే, రిచర్డ్సన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన కౌర్ అదే ఊపు కొనసాగించబోయి అవుటైంది. వేదా కృష్ణమూర్తి (9) త్వరగానే వెనుదిరిగింది. అర్ధ శతకం (54 బంతుల్లో) అందుకున్న మరుసటి ఓవర్లోనే మిథాలీ పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ వేగం తగ్గింది. ఛేదనలో ఐర్లాండ్ ఓపెనర్ క్లారా షిల్లింగ్టన్ (23) జాగ్రత్తగా ఆడింది. దీంతో ఆ జట్టు ఐదు ఓవర్ల పాటు వికెట్ కోల్పోలేదు. భారత పేసర్ మాన్సి జోషి పొదుపుగా బంతులేయగా మరో ఓపెనర్ గాబి లూయీస్ (9)ను చక్కటి బంతితో దీప్తిశర్మ బోల్తా కొట్టించింది. రన్‌రేట్ ఒత్తిడిలో ముందుకొచ్చి ఆడబోయి తొలుత షిల్లింగ్టన్, అనంతరం కెప్టెన్ డెలానీ (9) స్టంపౌటయ్యారు. జాయ్సే బ్యాట్ ఝళిపించినా అప్పటికే మ్యాచ్ చేజారింది. -
సెమీస్‌లో యువ భారత్
సవర్ (బంగ్లాదేశ్): అండర్–19 ఆసియా కప్‌లో యువ భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ అఫ్గానిస్తాన్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (93 బంతుల్లో 92; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోని (66 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. 14 పరుగులకే 3 వికెట్లు్ల కోల్పోయిన యువ భారత్‌ను యశస్వి ఆదుకున్నాడు. సిమ్రన్ సింగ్(17)తో నాలుగో వికెట్‌కు 62 పరుగులు, ఆయుశ్ బదోనితో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా, కైస్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 45.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రియాజ్ హుస్సేన్ (92 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్), రహ్మానుల్లా గుర్బాజ్ (30 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. సిద్ధార్థ్ దేశాయ్ (4/37), హర్‡్ష త్యాగి (3/40), సమీర్ చౌదరి (2/18) ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో శ్రీలంకతో అఫ్గానిస్తాన్ తలపడతాయి. -
బెల్జియం Vs ఫ్రాన్స్: ఫైనల్ చేరేదెవరు?
వేగంలో సమఉజ్జీలు... దాడుల్లో దీటైనవారు... రక్షణ శ్రేణిలో దుర్భేద్యులు... పోరాటంలో పోటాపోటీ! ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో తలపడనున్న ఫ్రాన్స్– బెల్జియం జట్ల ప్రదర్శనను విశ్లేషిస్తే ఇలానే ఉంటుంది. అన్ని విభాగాల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉన్న రెండింటి మధ్య ‘మాజీ చాంపియన్’ హోదా ఒక్కటే తేడా. 1998లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్... తర్వాత పడుతూ లేస్తూ ప్రయాణం సాగి స్తోంది. ఈసారి గ్రీజ్మన్ వంటి ఆటగాడికి ఎంబాపెలాంటి మెరిక తోడవడంతో ఆటతీరుతోపాటు జట్టు రాతే మారిపోయింది. లీగ్ దశలో సాధారణంగానే కనిపించినా నాకౌట్లో దుమ్ము దులిపేస్తోంది. ఇక 1986లో సెమీస్ చేరడమే ఈ మెగా టోర్నీలో బెల్జియంకు అత్యుత్తమం. ఇప్పుడు మాత్రం ముందునుంచి ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ సంచలనా త్మకంగా ఆడుతోంది. రొమేలు లుకాకు, ఈడెన్ హజార్డ్, డి బ్రుయెన్ల త్రయం ముందు ఎంతటి ప్రత్యర్థైనా వణకాల్సిందే. ఈ నేపథ్యంలో సెమీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సెయింట్ పీటర్స్బర్గ్: రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ విజేతగా నిలవాలనే పంతంతో ఫ్రాన్స్! ‘గోల్డెన్ జనరేషన్’ ఆటగాళ్లతో ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కప్పు కొట్టలేమన్న పట్టుదలతో బెల్జియం! లీగ్ దశను అజేయంగా ముగించి, నాకౌట్లో ప్రత్యర్థులను పిండి చేసిన ఈ రెండు జట్లు మంగళవారం అర్ధరాత్రి ఇక్కడి సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియంలో తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఏ ఒక్కరి ప్రదర్శన మీదనో ఆధారపడకుండా, దూకుడే మంత్రంగా ఆడుతూ, బలా బలాల్లోనూ సమతూకంతో కనిపిస్తున్నందున ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు మంచి పోరాటాన్ని వీక్షించే అవకాశం కలగనుంది. వీరి పోరాటం చూడండి... డి బ్రుయెన్ కాంటె బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో 20 గజాల దూరం నుంచి బెల్జియం ఆటగాడు డి బ్రుయెన్ కొట్టిన గోల్ చూస్తే ఔరా అనాల్సిందే. కచ్చితమైన పాస్‌లు ఇతడి ప్రత్యేకత. మరోవైపు కాంటె... ప్రపంచంలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం తన గొప్పతనం. మరి వీరిలో ఎవరు మిడ్ ఫీల్డ్‌లో మెరుస్తారో? లుకాకు (Vs) వరానె, ఉమ్టిటి టోర్నీలో నాలుగు గోల్స్ కొట్టడంతో పాటు సహచరులకు అవకాశాలు సృష్టిస్తున్నాడు బెల్జియం ఫార్వర్డ్ రొమేలు లుకాకు. మరోవైపు ప్రత్యర్థుల గోల్ అవకాశాలను నీరుగార్చడంలో ఫ్రాన్స్ సెంట్రల్ డిఫెన్స్ ఆటగాళ్లు వరానె, ఉమ్టిటి సిద్ధహస్తులు. క్వార్టర్స్‌లో ఉరుగ్వే స్టార్ సురెజ్‌ను వీరు కట్టిపడేశారు. ఈ ద్వయాన్ని దాటడం లుకాకుకు చిక్కుముడే. వెర్టాంగెన్(Vs) ఎంబాపె, గ్రీజ్మన్ బెల్జియం రక్షణ త్రయంలో కీలకం వెర్టాంగెన్. ఎడమ వైపున ఉండే ఇతడు డిపెండబుల్ ఆటగాడు. ఫ్రాన్స్ చిరుతలు గ్రీజ్మన్, ఎంబాపెలను నిలువరించడం తనకు పెద్ద పరీక్ష కానుంది. ఎంబాపె మిడ్ ఫీల్డ్ నుంచి వేగంగా పరిగెడుతూ ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాను ఎలా పడగొట్టాడో అందరూ చూశారు. ఇక గ్రీజ్మన్ గోల్ కొట్టాడంటే ఆ మ్యాచ్‌లో ఇప్పటిదాకా ఫ్రాన్స్‌కు పరాజయమన్నది ఎదురుకాలేదు. అనుభవజ్ఞుడైన వెర్టాంగెన్... ఈసారి గ్రీజ్మన్, ఎంబాపెలను ఎలా నిలువరిస్తాడో? హజార్డ్(Vs) పవార్డ్ ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడుతున్నాడు బెల్జియం కెప్టెన్ ఈడెన్ హజార్డ్. దాడులతో పాటు చురుకైన కదలికలకు పెట్టింది పేరు. క్వార్టర్స్‌లో బ్రెజిల్ ఇతడి ధాటికి వెనుకంజ వేసింది. రైట్ బ్యాక్‌లో తనకు ఫ్రాన్స్ యువ కెరటం పవార్డ్తో పోటీ తప్పదు. 22 ఏళ్ల పవార్డ్... ప్రి క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై కీలక సమయంలో గోల్ కొట్టాడు. లోరిస్(Vs) కోర్టొయిస్ ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో గోల్ ఇచ్చి విమర్శల పాలైన ఫ్రాన్స్ గోల్‌కీపర్ హ్యుగో లోరిస్... తర్వాత తేరుకుని అడ్డుగోడలా మారాడు. ఉరుగ్వేపై అతడి ఆటే దీనికి నిదర్శనం. బెల్జియం పొడగరి కోర్టొయిస్... అగ్రశ్రేణి కీపర్. బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో నెమార్ షాట్‌ను కొనవేళ్లతో పైకి పంపి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. సెమీస్ చేరాయిలా... ఫ్రాన్స్ ►ఆస్ట్రేలియాపై 2–1తో గెలుపు ►పెరూపై 1–0తో విజయం ►డెన్మార్క్‌తో 0–0తో డ్రా ►ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 4–3తో విజయం ►క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 2–0తో జయభేరి బెల్జియం ►పనామాపై 3–0తో గెలుపు ►ట్యూనీషియాపై 5–2తో విజయం ►ఇంగ్లండ్‌పై 1–0తో గెలుపు ►ప్రి క్వార్టర్స్‌లో 3–2తో జపాన్‌పై విజయం ►క్వార్టర్స్‌లో 2–1తో బ్రెజిల్‌పై జయభేరి హెన్రీ... నువ్వు సరైన పక్షాన లేవు బెల్జియం సహాయ కోచ్ థియరీ హెన్రీ ఫ్రాన్స్ ఒకనాటి మేటి ఫుట్‌బాలర్. కెప్టెన్ డెచాంప్స్, జినెదిన్ జిదాన్తో కలిసి 1998లో దేశానికి కప్ అందించాడు. ప్రస్తుతం బెల్జియం విజయాల్లో అతడి పాత్ర విస్మరించలేనిది. దీంతో హెన్రీని లక్ష్యంగా చేసుకుని ఫ్రాన్స్ వాగ్బాణాలు సంధిస్తోంది. అతడు సరైన పక్షాన నిలవలేదని ఎత్తిపొడుస్తోంది. మరో చిత్రమేమంటే... ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్–బెల్జియం చివరిసారిగా తలపడింది 1986లో. మూడో స్థానం కోసం సాగిన ఆ పోరులో ఫ్రాన్స్ 4–2 తేడాతో గెలుపొందింది. బెల్జియం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ జట్టుకిదే ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన. తర్వాత 8 అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో బెల్జియం రెండింటిలో నెగ్గింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఫ్రాన్స్, బెల్జియం జట్లు 73 మ్యాచ్‌ల్లో ముఖాముఖీ తలపడ్డాయి. ఫ్రాన్స్ 24 మ్యాచ్‌ల్లో... బెల్జియం 30 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో 19 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
ఇంగ్లండ్ జిగేల్
ఫేవరెట్‌గా బరిలో దిగిన సందర్భాల్లోనూ... డేవిడ్ బెక్‌హామ్, వేన్ రూనీల హయాంలోనూ సాధ్యం కాని దానిని... యువ హ్యారీ కేన్ సారథ్యంలోని ఇంగ్లండ్ సాధించింది. తమకు మింగుడు పడని ప్రత్యర్థి అయిన స్వీడన్‌ను క్వార్టర్ ఫైనల్లో అలవోకగా ఓడించింది. మొదటి భాగం, రెండో భాగంలో ‘తల’మానికమైన గోల్స్‌తో 1990 తర్వాత తొలిసారి ప్రపంచ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సమారా: ఇప్పటివరకు వేర్వేరు టోర్నీల్లో 24 సార్లు స్వీడన్‌తో తలపడిన ఇంగ్లండ్ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడింది. 9 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ఈ గణాంకాలు చాలు... వీటి మధ్య చిరకాల పోరాట తీవ్రతను చాటేందుకు. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో రెండు జట్లు ఎదురుపడటంతో అందరూ మరోసారి పోటాపోటీ తప్పదనుకున్నారు. కానీ, ఇంగ్లండ్ దాడి ముందు స్వీడన్ నిలవలేకపోయింది. కనీస ప్రతిఘటన చూపలేక చేతులెత్తేసింది. హ్యారీ మగ్యురె (30 నిమిషం), డెలె అల్లీ (59వ ని.)ల హెడర్ గోల్స్‌తో శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2–0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. 1990 తర్వాత ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్వీడన్ పొడిచేస్తుందనుకుంటే! ఓపికగా ఆడి పట్టు సాధించే ఇంగ్లండ్ మ్యాచ్‌లో అదే వ్యూహం మేరకు ఫలితం పొందగా, రక్షణాత్మక శైలితో దాడులకు దిగే స్వీడన్ మాత్రంఎవరూ ఊహించని పేలవ ప్రదర్శనతో లొంగిపోయింది. రెండు జట్లు పట్టుదలగా ఆడటంతో మ్యాచ్ సమంగానే ప్రారంభమైంది. అప్పటికీ ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ గోల్ ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. అయితే, 30వ నిమిషంలో ఎడమ వైపు నుంచి ఆష్లి యంగ్ కొట్టిన లాఫ్టెడ్ కార్నర్‌ను ఆటగాళ్లందరి మధ్యలో అందుకున్న డిఫెండర్ మగ్యురె... హెడర్‌తో నెట్లోకి పంపి స్కోరు చేశాడు. రహీమ్ స్టెర్లింగ్, కీరన్ ట్రిప్పర్ల సమన్వయంతో ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. అంతకుముందు స్టెర్లింగ్కే రెండు గోల్ అవకాశాలు వచ్చినా అవి లక్ష్యం చేరలేదు. మొదటి భాగంలో చిన్న పొరపాట్లతో వెనుకంజ వేసిన స్వీడన్... రెండోభాగంలో ప్రభావవంతంగా ఆడే తమ లక్షణాన్ని కూడా ప్రదర్శించలేదు. స్ట్రయికర్ మార్కస్ బెర్గ్ చక్కటి షాట్‌ను డైవ్‌తో అందుకున్న ఇంగ్లండ్ కీపర్ పిక్‌ఫోర్డ్ ఆసాంతం అడ్డుగోడలా నిలిచాడు. ఇంతలోనే ఇంగ్లండ్‌కు రెండో గోల్ దక్కింది. బాక్స్ నుంచి లిన్‌గార్డ్ ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న అల్లీ సులువుగా తలతో గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టును 2–0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ ఇంకో 20 నిమిషాలు ఉందనగానే స్వీడన్ ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసినట్లు కనిపించారు. ఇదే అదనుగా పట్టు నిలబెట్టుకునేలా ప్రత్యర్థిపై ఇంగ్లండ్ దాడులు పెంచింది. స్వీడన్ చివర్లో ముగ్గురు సబ్స్టిట్యూట్లను దింపినా... ఉపయోగం లేకపోయింది. మ్యాచ్ మొత్తంలో స్వీడన్ మూడుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌పై గురి చూసి షాట్లు కొట్టింది. రష్యా, క్రొయేషియా జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. -
బ్రెజిల్ ఢమాల్
మాజీ చాంపియన్లకు ఈ ప్రపంచకప్ ఓ పీడకలేనేమో! లీగ్ దశలో జర్మనీ..! ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, స్పెయిన్..! క్వార్టర్స్‌లో ఉరుగ్వే, బ్రెజిల్..! ఇలా ఒక్కోటి వరుసగా ఇంటి ముఖం పడుతున్నాయి! ఇందులో మిగతావాటి సంగతెలా ఉన్నా... ఐదుసార్లు విజేతైన బ్రెజిల్‌ది మాత్రం స్వయంకృతమే. టోర్నీలో భీకరంగా ఆడకపోయినా, పుంజుకుంటున్నట్లు కనిపించిన సాంబా జట్టు... నాకౌట్ మ్యాచ్‌ల్లో చేయకూడని పొరపాటు చేసి బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. అంతకు కొన్ని గంటల క్రితమే ఉరుగ్వే నిష్క్ర మించగా, బ్రెజిల్ కూడా వెనుదిరగడంతో వరుసగా నాలుగోసారి సైతం కప్ యూరప్ దేశాల ఖాతాలో చేరడం ఖాయమైంది. కజన్: అసలే ప్రత్యర్థి జోరుమీదుంది. ఏమాత్రం వీలు చిక్కినా మింగేసేలా ఆడుతోంది. అలాంటి దానికి పైచేయి సాధించే అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉంటుందా? బెల్జియంతో శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ఇలాగే ఆడి చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. మ్యాచ్‌లో బంతిపై 57 శాతం నియంత్రణ కనబర్చినా, ప్రత్యర్థి కంటే రెండు రెట్లు దాడులు ఎక్కువగానే చేసినా... ఫెర్నాండిన్హో (13వ నిమిషం) సెల్ఫ్ గోలే సాంబా బృందం కొంపముంచింది. ఆత్మరక్షణలో పడిన ఆ జట్టును... బెల్జియం మిడ్ ఫీల్డర్ డి బ్రుయెన్ (31వ ని.) రెండో గోల్తోమరింత దెబ్బకొట్టాడు. ప్రథమార్ధంలోనే 2–0తో వెనుకబడిన బ్రెజిల్‌కు ఆగస్టొ (76వ ని.) స్కోరు అందించినా, తర్వాత తీవ్రంగా ప్రతిఘటించినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో స్టార్ ఆటగాడు నెమార్ కొట్టిన షాట్‌ను రెడ్ డెవిల్స్ కీపర్ కోర్టొయిస్ చేతి కొనవేళ్లతో గోల్ పోస్ట్ పైకి పంపి... మాజీ చాంపియన్‌ను ఇంటి దారి పట్టించాడు. అదే దెబ్బకొట్టింది... ప్రారంభంలోనే బ్రెజిల్ డిఫెండర్ థియాగో సిల్వా కొట్టిన షాట్... గోల్ బార్ సమీపం నుంచి వెళ్లింది. సాంబా ఆటగాళ్ల దూకుడుతో బెల్జియం వెనుకంజ వేసింది. అయితే, 13వ నిమిషంలో ఆ జట్టుకే అదృష్టం కలిసొచ్చింది. విసెంట్ కంపానీ కార్నర్ కిక్‌ను తప్పించే క్రమంలో ఫెర్నాండిన్హో బంతిని తమ గోల్ పోస్ట్లోకే కొట్టుకున్నాడు. ఊహించని ఈ పరిణామాన్ని బ్రెజిల్ చాలాసేపు జీర్ణించుకోలేకపోయింది. ఆధిక్యం దక్కిన ఆనందంలో బెల్జియం ప్రతిదాడులతో ఒత్తిడి పెంచింది. డి బ్రుయెన్ పాస్‌ల నైపుణ్యం, లుకాకు వేగం, ఈడెన్ హజార్డ్ టెక్నిక్‌తో ప్రత్యర్థిని కట్టి పడేశారు. బ్రెజిల్ నష్ట నివారణకు చూస్తుండగా... 31వ నిమిషయంలో డి బ్రుయెన్ బుల్లెట్ షాట్‌తో ‘రెడ్ డెవిల్స్’కు గోల్ అందించాడు. ప్రత్యర్థులను తప్పిస్తూ మైదానం మధ్య నుంచి లుకాకు అందించిన పాస్‌ను... డి బ్రుయెన్ 20 గజాల దూరం నుంచి లక్ష్యానికి చేర్చాడు. రెండోభాగంలో బ్రెజిల్ తాడోపేడో అన్నట్లు ఆడింది. అయితే, నెమార్‌ను బెల్జియం కట్టడి చేసింది. దీంతో ఆగస్టొను సబ్‌స్టిట్యూట్‌గా పంపింది. 76వ నిమిషంలో కౌటిన్హొ క్రాస్ షాట్‌ను అతడు హెడర్ ద్వారా నెట్లోకి పంపి ఖాతా తెరిచాడు. సమయం ముగియనుండటంతో సాంబా జట్టు వరుసపెట్టి దాడులకు దిగినా గోల్ మాత్రం చేయలేకపోయింది. ►వరుసగా నాలుగో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో యూరోప్ జట్టు చేతిలో బ్రెజిల్ ఓడిపోయింది. 2006లో ఫ్రాన్స్ చేతిలో... 2010లో నెదర్లాండ్స్ చేతిలో... 2014లో జర్మనీ చేతిలో ఓడింది. ►ప్రస్తుత ప్రపంచకప్‌లో బెల్జియం తరఫున తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు గోల్ చేశారు. 2006లో ఇటలీ, 1982లో ఫ్రాన్స్ తరఫున అత్యధికంగా పది మంది వేర్వేరు ఆటగాళ్లు గోల్ చేశారు. ►ప్రపంచకప్ చరిత్రలో బెల్జియం సెమీఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. తొలిసారి 1986లో సెమీస్ చేరిన ఆ జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. ►ఓవరాల్‌గా బ్రెజిల్‌పై బెల్జియం నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 1963లో ఒకే ఒక్కసారి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను బెల్జియం ఓడించింది. -
ఫ్రాన్స్ ప్రతాపం...
ప్రపంచ కప్ ప్రయాణాన్ని నిదానంగా ప్రారంభించినా, క్రమంగా తనదైన ఆటను బయటకు తీస్తోంది మాజీ చాంపియన్ ఫ్రాన్స్. లీగ్ దశను అజేయంగా ముగించి... ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌నే ఓడించిన ఉరుగ్వేను... క్వార్టర్ ఫైనల్లో అలవోకగా మట్టికరిపించి సెమీస్ బెర్తును కొట్టేసింది. స్టార్ స్ట్రయికర్ ఎడిన్సన్ కవానీ లేని లోటుతో పాటు... మరో స్టార్ లూయీజ్ సురెజ్ మెరుపులు కొరవడటంతో ఉరుగ్వే ఉసూరుమంటూ వెనుదిరిగింది. నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులూ... కాచుకోండి! ఫ్రాన్స్ ఆట పదునెక్కుతోంది! మొదటి క్వార్టర్ ఫైనలే ఇందుకు నిదర్శనం! ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే ఉరుగ్వేను గుక్క తిప్పుకోనీయకుండా మట్టికరిపించిన తీరే దీనికి సాక్ష్యం! ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆంటోన్ గ్రీజ్మన్ ప్రతిభతో శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–0తో గెలుపొంది దర్జాగా సెమీస్‌లో అడుగు పెట్టింది. 40వ నిమిషంలో రఫెల్ వరెన్కు ఫ్రీ కిక్ పాస్ అందించి అతడు గోల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రీజ్మన్... 61వ నిమిషంలో స్వయం గా గోల్ కొట్టి జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. ఆటగాళ్ల దూకుడు, వరుస ఎల్లోకార్డులు, గోల్‌పోస్ట్ వద్ద పోరాటాలతో క్వార్టర్స్ మ్యాచ్ కొంత ఉత్కంఠ రేకెత్తించింది. ఓ దశ వరకు ఉరుగ్వే దీటుగానే కనిపించినా ఫినిషింగ్ లోపం వేధించింది. అందివచ్చిన ఒకటి, రెండు చక్కటి అవకాశాలను కాలదన్నుకున్న ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. సమంగా ప్రారంభమై... అంతా భావించినట్లే ఉరుగ్వే రక్షణ శ్రేణి, ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి పోటీలా ప్రారంభమైంది మ్యాచ్. ప్రత్యర్థిని ఆశ్చర్యానికి గురిచేస్తూ సురెజ్, టొరీరాల వేగంతో ఉరుగ్వేకే మొదట అవకాశాలు దక్కాయి. అయితే అవి కొంత క్లిష్టమైనవి. బంతి ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయింది. ఎంబాపె, గ్రీజ్మన్, గిరౌడ్‌ల పాస్‌లను ఉరుగ్వే మధ్యలోనే అడ్డుకుంది. ఎంబాపెకు కొన్ని హెడర్లు వచ్చినా సఫలం చేయలేకపోయాడు. 38వ నిమిషంలో బెంటాన్కర్ ప్రత్యర్థి ఆటగాడిని అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు ఫ్రీకిక్ లభించింది. దీనిని కార్నర్ నుంచి గ్రీజ్మన్ షాట్ కొట్టగా... గోల్‌పోస్ట్ ముందున్న వరెన్ హెడర్‌తో నెట్లోకి పంపాడు. గాయంతో కవానీ దూరం కావడం సురెజ్ ప్రదర్శనపైనా ప్రభావం చూపింది. సరైన సహకారం కరవైన అతడు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. రెండోభాగంలో రెండో గోల్... ఆధిక్యం కోల్పోయిన ఉరుగ్వే రెండో భాగంలో దాడుల తీవ్రత పెంచేందుకు రొడ్రిగెజ్, గోమెజ్లను సబ్స్టిట్యూట్లుగా దింపింది. కానీ, పేలవమైన ఆటతో ఫ్రాన్స్‌కు గోల్ ఇచ్చింది. పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకున్న గ్రీజ్మన్ మరో ఆలోచన లేకుండా గోల్‌పోస్ట్ దిశగా కొట్టాడు. దీనిని ఉరుగ్వే ఆటగాళ్లెవరూ అడ్డుకోలేకపోగా... కీపర్ ముస్లెరా గోల్‌పోస్ట్ వద్ద తడబడ్డాడు. దారి మళ్లించే క్రమంలో అతడు విఫలమవడంతో బంతి గోల్ లైన్‌ను తాకింది. 2–0 ఆధిక్యం దక్కడంతో ఫ్రాన్స్ మిగతా సమయం ప్రశాంతంగా ఆడుకుంటూ పోయింది.ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఆరోసారి సెమీస్ చేరింది. 1958, 82, 86, 98, 2006లలోనూ సెమీస్ చేరిన ఫ్రాన్స్ 1998లో విజేతగా, 2006లో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు ఉరుగ్వేతో ఆడిన ఫ్రాన్స్ రెండోసారి మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఏకైకసారి 1986లో ఉరుగ్వేను ఫ్రాన్స్ ఓడించింది. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... రెండింటిలో ఓడిపోయింది. -
డబుల్స్ సెమీస్‌లో సుమీత్ రెడ్డి జంట ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న తెలంగాణ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీస్‌లో ఓడిపోయాడు. శనివారం సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో సుమీత్–మను ద్వయం 17–21, 15–21తో బెర్రీ అంగ్రియవాన్–హర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన సుమీత్ జంటకు 2,100 డాలర్ల (రూ. లక్షా 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీస్‌లో పేస్ జంట
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ పేస్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ 6–3, 2–6, 17–15తో ‘సూపర్ టైబ్రేక్’లో రూబెన్ గొంజాలెజ్ (ఫిలిప్పీన్స్)–హంటర్ రీస్ (అమెరికా) జంటపై గెలుపొందింది. -
సింధు సెమీస్‌కు... శ్రీకాంత్ ఇంటికి
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పూసర్ల వెంకట సింధు సీజన్‌ను గొప్పగా ముగించే దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రతిష్టాత్మక వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఈ తెలుగు తేజం సెమీఫైనల్‌కు చేరుకొని తన తొలి లక్ష్యాన్ని అధిగమించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయంతో అనూహ్యంగా లీగ్ దశలోనే నిష్క్రమించాడు. ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ ఈ మెగా టోర్నీలో మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: తొలి లీగ్ మ్యాచ్‌లో గట్టెక్కేందుకు కాస్త శ్రమించిన భారత స్టార్ పీవీ సింధు రెండో లీగ్ మ్యాచ్‌లో మాత్రం జూలు విదిల్చింది. కేవలం 36 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించింది. మహిళల సింగిల్స్ విభాగంలోని గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 21–12తో సయాకా సాటో (జపాన్)ను చిత్తుగా ఓడించింది. ఇదే గ్రూప్‌లో ఉన్న అకానె యామగుచి కూడా రెండు విజయాలు సాధించడంతో సింధుతో కలిసి ఆమె కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన వారు గ్రూప్ టాపర్‌గా నిలుస్తారు. ఈ ఏడాది సయాకా సాటోను రెండుసార్లు ఓడించిన సింధు మూడోసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలో 1–3తో వెనుకబడిన సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 7–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ తెలుగు అమ్మాయి తన జోరును మరింతగా పెంచింది. సాటోకు ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు ఆటకు ఎదురులేకపోయింది. స్కోరు 11–7 వద్ద సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 19–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత సాటోకు ఐదు పాయింట్లు కోల్పోయినా... ఏకాగ్రత కోల్పోకుండా ఆడి తన విజయానికి అవసరమైన రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. శ్రీకాంత్‌కు షాక్... పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో భారత స్టార్ శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 18–21, 18–21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రపంచ చాంపియన్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ ఓడిన సంగతి తెలిసిందే. టియెన్తో 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ నిలకడలేని ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నాడు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన టియెన్ పదునైన స్మాష్‌లతో శ్రీకాంత్‌కు కళ్లెం వేశాడు. శుక్రవారం జరిగే నామమాత్రమైన మూడో లీగ్ మ్యాచ్‌లో షి యుకి (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో షి యుకి 13–21, 21–18, 21–17తో అక్సెల్సన్ను ఓడించి రెండో విజయంతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. టియెన్, అక్సెల్సన్ల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన వారు షి యుకితో కలిసి మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంటారు. -
ఆధిపత్యం మనది గెలుపు అర్జెంటీనాది
భువనేశ్వర్: ముఖాముఖి రికార్డులో స్పష్టమైన ఆధిక్యం ఉన్నా... మైదానంలో ఆటపరంగా ఆధిపత్యం చలాయించినా... తుది ఫలితం మాత్రం భారత్‌కు నిరాశ కలిగించింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 0–1 తేడాతో ఓడిపోయింది. భారీ వర్షంలోనే జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌పై ఐదు సార్లు షాట్ కొట్టినా... ‘డి’ ఏరియాలో 11 సార్లు చొచ్చుకెళ్లినా... చివరి క్వార్టర్లో ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా గోల్ మాత్రం చేయలేకపోయారు. మరోవైపు అర్జెంటీనాకు ఆట 17వ నిమిషంలో లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను గొంజాలా పిలాట్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత భారత్ పలుమార్లు అర్జెంటీనా గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినా బంతిని మాత్రం లక్ష్యానికి చేర్చలేకపోయింది. టర్ఫ్‌పై ఎక్కువగా నీళ్లు ఉండటంతో భారత ఆటగాళ్లు తమ సహజశైలిలో వేగంగా కదల్లేకపోయారు. ఫీల్డ్ గోల్స్ చేయడం కష్టమైన తరుణంలో పెనాల్టీ కార్నర్లపైనే రెండు జట్లు ఆధారపడ్డాయి. అర్జెంటీనా తమకు దక్కిన ఏకైక అవకాశాన్ని అనుకూలంగా మల్చుకోగా... భారత్ తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. చివరి ఐదు నిమిషాల్లో భారత్ గోల్‌కీపర్ లేకుండానే ఆడింది. గోల్ కీపర్ ఆకాశ్ చిక్టేను వెనక్కి రప్పించి అతని స్థానంలో అదనంగా మరో ప్లేయర్‌ను ఆడించింది. అయితే ఈ వ్యూహం కూడా కలసిరాలేదు. జర్మనీ, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో ఆదివారం భారత్ కాంస్య పతకం కోసం ఆడుతుంది. ఈ మెగా ఈవెంట్ టోర్నీలో భారత్ సెమీస్‌లో ఓడిపోవడం వరుసగా రెండోసారి. 2015లో రాయ్‌పూర్‌లో జరిగిన టోర్నమెంట్లోనూ భారత్ సెమీఫైనల్లో ఓడి చివరకు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
భారత్‌కు రెండో విజయం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కెనడాతో శనివారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–0తో గెలిచింది. భారత్ తరఫున ఎస్వీ సునీల్ (5వ నిమిషంలో), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ నిమిషంలో), సర్దార్ సింగ్ (18వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.చస్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–1తో నెగ్గిన సంగతి విదితమే. వరుసగా రెండు విజయాలతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. నేడు పాక్‌తో పోరు... ఒకవైపు లండన్‌లో చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్, పాక్ క్రికెట్ జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుండగా... అదే నగరంలో భారత్, పాకిస్తాన్ హాకీ జట్లు నేడు లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటివరకు భారత్, పాక్ హాకీ జట్లు 167 మ్యాచ్‌ల్లో తలపడగా... భారత్ 55 మ్యాచ్‌ల్లో, పాక్ 82 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 30 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్ 324 గోల్స్, పాక్ 388 గోల్స్ సాధించాయి. నేటి సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీ ఫైనల్లో మెదక్ జట్టు
అండర్ 19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ మహబూబ్‌నగర్‌లో సెమీ ఫైనల్స్ సంగారెడ్డి టౌన్: అండర్ 19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం స్థానిక అంబేద్కర్ మైదానంలో జరిగిన మెదక్, నల్లగొండ మ్యాచ్‌లో మెదక్ ఘన విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్లగొండ 118 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెదక్ జట్లు 8 వికెట్లకు 120 పరుగు చేసి ఘన విజయం సాధించింది. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో వరంగల్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరంగల్ 259 పరుగులతో భారీ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. వరంగల్ జట్టులో రఘు సెంచరీ చేయడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం 77 పరుగులకు అలౌట్ అయింది. వరంగల్ జట్టు ఇంతకు ముందే సెమీ ఫైనల్లో అడుగిడిన విషయం విదితమే. మెదక్, వరంగల్ జట్లు ఈ నెల 10 మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. -
ఫుట్‌బాల్ సెమీస్‌లో బ్రెజిల్
రియో డి జనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్మార్ ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో గోల్స్ ఖాతా తెరిచాడు. దీంతో శనివారం కొలంబియాతో జరిగిన క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య జట్టు 2-0తో గెలిచింది. బుధవారం జరిగే సెమీస్‌లో బ్రెజిల్ జట్టు హోండురస్‌తో ఆడుతుంది. ఇప్పటిదాకా అంతగా ఆకట్టుకోలేకపోతున్న నెయ్మార్ కీలక మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. ఆట ప్రారంభమైన 12వ నిమిషంలోనే 25 గజాల దూరం నుంచి ఫ్రీ కిక్ ద్వారా జట్టుకు ఆధిక్యం అందించాడు. ద్వితీయార్ధం 83వ నిమిషంలో లువాన్ మరో గోల్‌తో బ్రెజిల్ విజయం సాధించింది. మరో సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టు నైజీరియాతో తలపడుతుంది. అథ్లెటిక్స్ పురుషుల ట్రిపుల్ జంప్ రంజిత్ మహేశ్వరి సమయం: సాయంత్రం 6.00 గంటల నుంచి మహిళల 200మీ. శ్రబాని నందా సమయం: సాయంత్రం 6.05 గంటల నుంచి మహిళల 3000మీ. స్టీపుల్ చేజ్ ఫైనల్ లలితా బాబర్ సమయం: రాత్రి 7.45 గంటల నుంచి బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్ పురుషుల మిడిల్‌వెయిట్ 75 కేజీ వికాస్ క్రిషన్ x బెక్టెమిర్ (ఉజ్బెకిస్తాన్) సమయం: మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రెజ్లింగ్ పురుషుల గ్రీకో రోమన్ 85కేజీ (క్వాలిఫికేషన్) రవీందర్ ఖత్రి సమయం: సాయంత్రం 6.30 గంటల నుంచి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ సమయం: మంగళవారం తెల్లవారుజాము 3.00 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ 1,2లలో పోటీలన్నీ ప్రత్యక్ష ప్రసారం -
అతడే ఒక సైన్యం
-
సెమీఫైనల్స్‌లో సానియా జంట
టొరంటో: రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-2 తో చాన్ సోదరీమణులు హవో-చాన్, యుంగ్-చాన్ జంటపై గెలిచింది. ఆట ముగిసిన తర్వాత హింగిస్ మాట్లాడుతూ.. గత మూడు నెలలనుంచి మేం బాగా ఆడుతున్నాం, ముఖ్యంగా వింబుల్డన్ విజయం తర్వాత మా ఆట తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. తొలి రౌండ్ లో కొంచెం వెనకంజలో ఉన్నా ఇద్దరం కలిసి మెరుగ్గా ఆడి విజయం సాధించాం అన్నారు. ప్రతి మ్యాచ్‌లో ఆటతీరు మెరుగు పరుచుకుంటున్నామని తెలిపారు. -
మరో విజయంపై గురి
నేడు పోలండ్‌తో భారత్ ‘ఢీ’ హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో గట్టెక్కిన భారత పురుషుల హాకీ జట్టు మరో విజయంపై దృష్టి పెట్టింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో భాగంగా మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని, ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైన ఆటతీరును కనబరచాలనే పట్టుదలతో సర్దార్ సింగ్ బృందం ఉంది. ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే ఎనిమిది స్థానాలు దిగువన ఉన్నప్పటికీ పోలండ్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశముంది. చురుగ్గా కదులుతూ ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లే పలువురు ఫార్వర్డ్స్ పోలండ్ జట్టులో ఉన్నారు. భారత రక్షణపంక్తి అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ఫలితం వస్తుంది. ‘ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడంలేదు. పోలండ్ ఏ ర్యాంక్‌లో ఉందనే విషయంతో అసలు పనిలేదు. ఈ టోర్నీకి మేము పర్యాటకుల్లా రాలేదు. రియో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించినప్పటికీ ఈ టోర్నీలోనూ మంచి ఫలితాలు సాధించాలనే కసితో ఉన్నాం’ అని భారత కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ఇదే టోర్నీ మహిళల విభాగం లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. వాల్మీకికి రూ. లక్ష నజరానా తన కెరీర్లో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే గోల్ చేసిన భారత యువ ఆటగాడు దేవేందర్ వాల్మీకికి హాకీ ఇండియా ప్రోత్సాహకంగా లక్ష రూపాయల నజరానాను ప్రకటించింది. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవేందర్ రెండో గోల్‌ను అందించాడు. ‘దేవేందర్ క్రమశిక్షణ కలిగిన ఆటగాడు. జూనియర్ స్థాయిలోనూ అతను చాలా బాగా ఆడాడు’ అని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ మహ్మద్ ముస్తాక్ అన్నారు. పురుషుల విభాగం భారత్ + పోలండ్ రాత్రి గం. 7.30 నుంచి మహిళల విభాగం భారత్ + న్యూజిలాండ్ సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
హాకీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ గెలుపు
బెల్జియం: ఎఫ్ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 1-0తో ఫ్రాన్స్‌పై గెలిచింది. రూపిందర్ పాల్ సింగ్ (23వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు అటాకింగ్‌కు దిగాయి. తొలి క్వార్టర్స్‌లో వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నా... గోల్స్ చేయలేకపోయాయి. అయితే రెండో సెషన్లో భారత్ దూకుడును పెంచింది. ఈ క్రమంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ అద్భుతమైన గోల్‌గా మలిచాడు. తర్వాత స్కోరు సమం చేసేందుకు ఫ్రాన్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్... బెల్జియంతో తలపడుతుంది.