న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. దేశీయ క్రీడలో దుమ్మురేపుతున్న మన జట్లు క్వార్టర్స్‌లో అదే ఆధిపత్యం కనబర్చాయి. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో భారత్ 109–16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
వరుసగా ఐదో మ్యాచ్‌లో 100 పాయింట్లకు పైగా స్కోరు చేసిన మన అమ్మాయిలు... ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లె, నస్రిన్ షేక్, ప్రియాంక, రేష్మ రాథోడ్ సత్తా చాటారు.
ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఉగాండా 71–26 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌పై, దక్షిణాఫ్రికా 51–46 పాయింట్ల తేడాతో కెన్యాపై, నేపాల్ 103–8 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాయి. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో ఉగాండాతో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతాయి.
పురుషుల క్వార్టర్ ఫైనల్లో భారత్ 100–40 పాయింట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రామ్‌జీ కశ్యప్, ప్రతీక్, ఆదిత్య విజృంభించడంతో తొలి రౌండ్‌లోనే 58 పాయింట్లు సాధించిన భారత్... చివరి వరకు అదే జోరు కొనసాగించింది.
రెండో రౌండ్‌లో తీవ్రంగా పోరాడిన శ్రీలంక ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 58–38తో ఇంగ్లండ్‌పై, నేపాల్ 67–18తో బంగ్లాదేశ్‌పై, ఇరాన్ 86–18తో కెన్యాపై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. నేడు జరగనున్న సెమీఫైనల్స్‌లో ఇరాన్‌తో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment