ఖోఖో ప్రపంచకప్‌లో రెండు విభాగాల్లోనూ టైటిల్స్ సొంతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడ ఖోఖో తొలి ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. మహిళల విభాగంతోపాటు పురుషుల విభాగంలోనూ భారత జట్టే విజేతగా అవతరించింది.
తొలుత జరిగిన మహిళల ఫైనల్లో భారత జట్టు 78–40 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టును ఓడించగా... పురుషుల ఫైనల్లో టీమిండియా 54–36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపైనే విజయం సాధించింది. భారత జట్టుకు చెందిన ప్రియాంక, ప్రతీక్ ‘బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment