
మేఘాలయ సీఎం, కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంపాతి, సంగ్సక్ నియోజవర్గాల నుంచి బరిలోకి దిగిన సంగ్మా విజయకేతనం ఎగురవేశారు. సంగ్మా రెండు పర్యాయాలు సీఎంగా చేశారు. తొలిసారి 2010 ఏప్రిల్‌లో మేఘాలయ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ముకుల్ సంగ్మా 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. కానీ మేఘాలయలో హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.
శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సూచనలు లేవు. మధ్యాహ్నం సమయానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 2 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్‌పీపీ 16 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేఘాలయాలో ఫలితాలు బీజేపీకి మింగుడు పడటం లేదు. బీజేపీ ఇక్కడ కేవలం 4 స్థానాలు నెగ్గేలా కనిపిస్తోంది. కాగా, మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 47 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment