అసెంబ్లీ పోరులో బీజేపీ, బీజేడీ నువ్వానేనా
ఇరుపక్షాలకు 62–80 సీట్లు రావచ్చు
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ వెల్లడి
భువనేశ్వర్: 147 స్థానాలున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. విపక్ష బీజేపీకి 62 నుంచి 80 స్థానాలు లభించే అవకాశం ఉందని, అధికార బిజూ జనతాదళ్(బీజేడీ)కి సైతం 62 నుంచి 80 స్థానాలే దక్కే వీలుందని అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఒకవేళ బీజేడీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఒడిశాలో కాంగ్రెస్ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరుగుతుందని, బీజేడీ ఓట్ల శాతం 42 శాతం పడిపోతుందని, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలియజేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు, బీజేపీ 23, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 18–20 వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది!
Comments
Please login to add a commentAdd a comment