india today axis survey
-
ఒడిశాలో హోరాహోరీ
భువనేశ్వర్: 147 స్థానాలున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. విపక్ష బీజేపీకి 62 నుంచి 80 స్థానాలు లభించే అవకాశం ఉందని, అధికార బిజూ జనతాదళ్(బీజేడీ)కి సైతం 62 నుంచి 80 స్థానాలే దక్కే వీలుందని అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ బీజేడీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒడిశాలో కాంగ్రెస్ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరుగుతుందని, బీజేడీ ఓట్ల శాతం 42 శాతం పడిపోతుందని, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలియజేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు, బీజేపీ 23, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 18–20 వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది! -
Exit Polls: కర్ణాటక కాంగ్రెస్‌దే! ఒకవేళ హంగ్ అయితే కింగ్‌మేకర్ ఆ పార్టీయే!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో్ల కాంగ్రెస్‌కే ఎగ్జిట్ పోల్స్ జైకొట్టాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించనుందని ఇండియాటుడే–మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. మెజారిటీకి 113 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్ 122 నుంచి 140 దాకా నెగ్గుతుందని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. బీజేపీకి కేవలం 62 నుంచి 80 సీట్లే వస్తాయని అంచనా వేసింది. మొత్తమ్మీద కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లొస్తాయని, బీజేపీకి 35 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం దాకా రావచ్చని తెలిపింది. టైమ్స్ నౌ, ఇండియా టీవీ కూడా కాంగ్రెస్‌కు 120 సీట్ల దాకా వస్తాయని, బీజేపీ 90 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొన్నాయి. కాంగ్రెసే ఏకైక పెద్ద పార్టీగా నిలవనుందని బుధవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే వెలువడ్డ ఎగ్జిట్‌పోల్స్‌లో చాలావరకు పేర్కొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డా 2018 ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుందని దాదాపుగా సర్వేలన్నీ వెల్లడించాయి. కాంగ్రెస్‌కు 100 నుంచి 112, బీజేపీ 83 నుంచి 95 సీట్లొస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చింది. జన్ కీ బాత్ కాంగ్రెస్‌కు 91 నుంచి 106 స్థానాలు, బీజేపీకి 94 నుంచి 117 ఇచ్చింది. కొన్ని మాత్రం హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. అదే జరిగితే జేడీ(ఎస్) మరోసారి కింగ్‌మేకర్ పాత్ర పోషించే అవకాశముంది. ఆ పార్టీకి 14 నుంచి 30 స్థానాలు రావచ్చని సర్వేలు తేల్చాయి. శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. 38 ఏళ్లుగా కన్నడ ఓటర్లు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని సంగతి తెలిసిందే. ఈ చరిత్రను ఈసారి ఎలాగైనా తిరగరాయాలని బీజేపీ ప్రచారంలో సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని మోదీ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా కలియదిరిగారు. పదుల కొద్దీ బహిరంగ సభలు, ర్యాలీలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ కూడా ఈసారి స్పష్టమైన మెజారిటీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన నేపథ్యంలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 81 ఏళ్ల వయసులోనూ రాష్ట్రమంతటా తిరిగి శ్రమించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వద్రా రోజుల తరబడి జోరుగా ప్రచారం చేశారు. 2018లో అలా... ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 116, కాంగ్రెస్‌కు 69, జేడీ(ఎస్)కు 29 స్థానాలున్నాయి. 2018లో కూడా హంగ్ అసెంబ్లీయే ఏర్పడింది. 104 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు 80, జేడీ(ఎస్)కు 37 సీట్లొచ్చాయి. బీఎస్పీ, కేపీజేపీ, స్వతంత్రులకు ఒక్కో స్థానం దక్కింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణంగా ఏర్పడే ప్రయత్నాల్లో ఉండగానే బీజేపీ ప్రభత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ మెజారిటీ నిరూపించుకోలేక బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. అనంతరం ఊహించినట్టుగానే కాంగ్రెస్–జేడీ(ఎస్) జట్టు కట్టి కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ పాలక కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరడంతో సర్కారు 14 నెలలకే కుప్పకూలింది. మళ్లీ బీజేపీ గద్దెనెక్కింది. తర్వాత 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పన్నెండింటిని బీజేపీ గెలుచుకుని మెజారిటీ సాధించింది. -
అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈసారి ఎదురుగాలి వీయనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ తెలిపింది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన అమేథీలో రాహుల్‌కు బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చని సర్వే తేల్చింది. కాగా, రాహుల్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం వయనాడ్(కేరళ)లో ఆయన విజయం నల్లేరుపై నడకేనని సర్వే స్పష్టం చేసింది. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ 7.30 లక్షల ఓట్ల మెజారిటీ(70 శాతం ఓట్ల)తో విజయం సాధించబోతున్నారని తెలిపింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి, సీపీఐ నేత పి.పి.సునీర్ 23 శాతం ఓట్లతో 2.50 లక్షల ఓట్లను దక్కించుకుంటారని వెల్లడించింది. బీజేపీ–భారత్ ధర్మజనసేన(బీడీజేఎస్) అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లె 7 శాతం ఓట్లను దక్కించుకుంటారని పేర్కొంది. రాయ్‌బరేలీ సోనియాదే: యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో సోనియాగాంధీ ఘనవిజయం సాధిస్తారని తెలిపింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సోనియా మరోసారి ఈ స్థానాన్ని నిలుపుకుంటారని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన దినేశ్ ప్రతాప్‌సింగ్‌ను బీజేపీ సోనియాపై పోటీకి నిలిపింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. జయప్రదకు షాక్.. ఎస్పీ నేత ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఈ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత, నటి జయప్రదకు రాంపూర్‌లో ఓటమి తప్పకపోవచ్చని సర్వేలో తేలింది. రాంపూర్ ప్రజలు ఆజంఖాన్‌కు పట్టం కట్టబోతున్నారని వెల్లడించింది. జయప్రదతో పోల్చుకుంటే ఆజంఖాన్ రాంపూర్‌లో అందరికీ తెలిసిన వ్యక్తికావడం ఆయనకు లాభించిందని అభిప్రాయపడింది. భోపాల్ ప్రజ్ఞా సింగ్‌దే: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు షాక్ తగలనుందని సర్వే తెలిపింది. భోపాల్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దిగ్విజయ్ సింగ్‌ను ఓడించబోతున్నారని ఎగ్జిట్‌పోల్ పేర్కొంది. మాండ్యలో సుమలత జయభేరి.. కర్ణాటకలోని మాండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి సుమలత విజయదుందుభి మోగించబోతున్నారని సర్వే తెలిపింది. సీఎం కుమారస్వామి కొడుకు జేడీఎస్–కాంగ్రెస్ అభ్యర్థి నిఖిల్ గౌడకు పరాజయం తప్పదని స్పష్టం చేసింది. మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు పలికింది. బెగుసరాయ్‌లో కన్హయ్య ఓటమి.. బిహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఘనవిజయం సాధిస్తారని తేలింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తన్వీర్ హసన్ రెండో స్థానంలో, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత, సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్ మూడో స్థానంలో నిలుస్తారని పేర్కొంది తిరుగులేని ‘షా’ గాంధీనగర్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ తెలిపింది. ఈ ఎన్నికల్లో షా 8,92,775 ఓట్లు(67 శాతం) దక్కించుకోనుండగా, కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్ ఛవ్దా 3,31,602 ఓట్లు(26 శాతం), ఇతరులు నాలుగు శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ► యూపీలోని మైన్‌పురిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ మధ్య హోరాహోరీ పోరు. ► కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఎల్డీఎఫ్ అభ్యర్థి దివాకరణ్పై ఘనవిజయం సాధిస్తారు. ► బిహార్‌లోని పట్నాసాహిబ్‌లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్నసిన్హాపై గెలుస్తారు. ► ఈశాన్యఢిల్లీలో కాంగ్రెస్ నేత షీలాదీక్షిత్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు. ► తూర్పుఢిల్లీలో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ కాంగ్రెస్ నేత అర్విందర్ లవ్లీపై గెలుస్తారు. ► తమిళనాడులోని శివగంగ నుంచి కాంగ్రెస్ నేత పి.కార్తి చిదంబరం, బీజేపీ నేత హెచ్.రాజాపై విజయం సాధిస్తారు. ► యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కేంద్ర మంత్రి మేనకాగాంధీ, బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ మధ్య హోరాహోరీ పోరు. స్వల్ప మెజారిటీతో మేనక గట్టెక్కే అవకాశం. ► తమిళనాడులోని తూత్తికుడిలో బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్‌పై డీఎంకే నేత కనిమొళి విజయం. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీజేపీ నేత సన్నీడియోల్ చేతిలో కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ జాఖర్ ఓటమి. ► పిలిభిత్‌లో ఎస్పీ అభ్యర్థి హేమరాజ్ వర్మపై బీజేపీ నేత వరుణ్‌గాంధీ విజయం. ► ఛింద్వారాలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్, ఆనంద్‌పూర్ సాహిబ్‌లో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ఘనవిజయం. ► న్యూఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్‌ను మట్టికరిపిస్తారు. ► కేంద్రమంత్రి రామ్‌కృపాల్ యాదవ్ పాటలీపుత్ర నుంచి మరోసారి మిసాభారతి(ఆర్జేడీ)ని ఓడిస్తారు. ► ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్, దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రాకు ఓటమి తప్పదు. ► పూరీ నుంచి బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర, నాగ్‌పూర్ నుంచి కేంద్రమంత్రి గడ్కారీ, బారామతి నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే విజయం సాధిస్తారు. ► మధ్యప్రదేశ్‌లోని గుణాలో జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్), కేపీ యాదవ్ (బీజేపీ)మధ్య హోరాహోరీ పోరు. -
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ : వైఎస్ఆర్సీపీ ప్రభంజనం
-
జగన్‌కు ఏపీ జై...
-
జగన్‌కి జై కొట్టిన ఏపీ
న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే జగన్మోహన్రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్మోహన్రెడ్డి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని వెల్లడైంది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్లో ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, రాహుల్ కన్వల్ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు. 36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు. ప్రజాసంకల్పయాత్ర పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా జగన్ భారీగా ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. జగన్ వర్సెస్ చంద్రబాబుగా ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. ఈ చర్చలో పాల్గొన్న యాక్సిస్ మై ఇండియా ప్రతినిధి ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు 44.35% ఓట్లు రాగా టీడీపీకి బీజేపీతో కలుపుకుని 46% ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రతిపక్షనేత జగన్‌కి మాత్రమే చంద్రబాబు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షనాయకుల కంటే సీఎంలకే ఎక్కువ ప్రజాదరణ ఉందని చెప్పారు. పొలిటికల్ సైంటిస్ట్ సందీప్ శాస్త్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పడే అవకాశాలున్నాయన్నారు. ఒకవేళ టీడీపీ–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయన్నది అనుమానమేనని, అంతే కాకుండా అక్కడ కాంగ్రెస్ బలం నామమాత్రమేనని అభిప్రాయపడ్డారు. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు అనుకూలంగా 44%, మోదీకి 33% మద్దతు పలికినట్టు ఈ సర్వే తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో ‘ఏపీకి ప్రత్యేకహోదా’ కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. -
తదుపరి సీఎం కేసీఆరే!
న్యూఢిల్లీ: అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల రేసులో ఎవరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియాతో కలిసి చేసిన సర్వేలో.. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారు. కేసీఆర్ తర్వాతి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా, ఆయన తదుపరి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు కేవలం 18 శాతం మందే చెప్పారు. పొలిటికల్ స్టాక్ ఎక్సే్చంజ్ పేరుతో తెలంగాణలో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే జరిగింది. మొత్తంగా 7,110 మంది సర్వేలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, నిరుద్యోగం, వ్యవసాయంలో ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు వెల్లడించారు. కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు 11% మంది చెప్పారు. కుమారస్వామిపై అసంతృప్తి ఇండియా టుడే– మై యాక్సిస్ ఇండియా కర్ణాటకలోనూ సర్వే చేసింది. అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ పనితీరు బాగుందని 23 శాతం మంది, ఫరవాలేదని 28 శాతం మంది చెప్పగా ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని 35 శాతం మంది కర్ణాటక ప్రజలు వెల్లడించారు. 11,480 మంది కన్నడిగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. తదుపరి ప్రధానిగా 55 శాతం మంది నరేంద్ర మోదీకి, 42 శాతం మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయంలో ఇబ్బందులు తమ రాష్ట్రంలో ప్రధాన సమస్యలని సర్వేలో పాల్గొన్న ప్రజలు వెల్లడించారు. కుమారస్వామి సీఎం పదవి చేపట్టి నాలుగు నెలలైనా పూర్తికాకముందే ఆయనపై ఇంతటి వ్యతిరేకత రావడం గమనార్హం. -
ఈశాన్య రాష్ట్రంలో విజయం ఎవరిది?
అసోం పీఠాన్ని ఇప్పటికే బీజేపీ దక్కించుకుంది. త్వరలో జరగబోయే మణిపూర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీయే గెలుస్తుందని ఇండియాటుడే - యాక్సిస్ పోల్ సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే.. ఆ రాష్ట్రంలో 31-35 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని తెలిపింది. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 50 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సర్వే అంచనాలు నిజమైతే అది కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. మరో ఆరు నెలల్లో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దాంతో మణిపూర్ అసెంబ్లీలో ఉండాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 60కి బదులు ఇప్పుడు 53 అయ్యింది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మణిపూర్ కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 19-24 స్థానాల కంటే ఎక్కువ రావని సర్వే తేల్చేసింది. బీజేపీకి 40 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 37 శాతం వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ముక్త భారతదేశం రావాలన్న బీజేపీ నినాదాన్ని రాష్ట్రంలో 37 శాతం మంది ఆమోదిస్తున్నారు. ఇన్నర్‌లైన్ పర్మిట్ అంశం ఇప్పటికీ అక్కడ ఎన్నికలో ప్రధానాంశంగా మారింది. 62 శాతం మంది ఓటర్లు అదే ముఖ్యాంశమని చెప్పారు. రెండో ప్రధానాంశం మౌలిక సదుపాయాలు, తర్వాత ఉపాధి అవకాశాలు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తీసేయాలన్న అంశానికి కేవలం 6 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఒకప్పుడు ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని ప్రసిద్ధి చెందిన ఇరోమ్ షర్మిలా చాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేవాళ్లు కేవలం 1 శాతమే ఉన్నారు. ఆమె ఏళ్లతరబడి చేసిన నిరాహార దీక్ష అసలు ఎన్నికల అంశమే కాదని 75 శాతం మంది చెప్పారు.