Saamna editorial
-
యాక్సిడెంటల్ హోం మినిస్టర్
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు. -
మహారాష్ట్ర రాజకీయాలు మహా ముదురే!!
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బీజేపీ నేత సుధీర్ మృదుగంటివార్ వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఫలితాలొచ్చి వారం దాటిపోయినా ఇంకా శివసేనతో వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో బీజేపీ కొత్త ఎత్తుకి తెరలేపిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ బీజేపీ వ్యాఖ్యానించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్లో ఉన్నారా? లేదా రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ప్రశ్నించింది. బీజేపీ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల తీర్పును అగౌరవ పరిచేలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రపతి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని.. రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి అత్యున్నత వ్యక్తి అని, యావత్ దేశానికి ప్రతినిధి అని చెప్పింది. ఈ దేశం ఏ ఒక్కరి జేబులో లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ స్పందన : 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేని సంఘటస్థితికి చేరుకుంది. ఈ దశలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. ఏ క్షణం ఏం జరగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మీడియా ముందుకొచ్చిన శరద్ పవార్ తన మదిలో అంతరంగాన్ని బయటపెట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఎన్సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని, వారి తీర్పును మేము శిరసావహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, శివసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై మాట్లాడుతూ.. ఈ దిశగా ఎన్సీపీలో ఎలాంటి సంప్రదదింపులు జరపలేదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ - శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను ఇస్తే.. వారు చేస్తున్నదేంటి? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. శివసేన కోరితే మద్దతు ఇస్తామంటూనే కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్షపాత్రకే పరిమితం అవుతామంటోంది. ఇలా ప్రతి పార్టీ కూడా రెండు రకాలుగా వ్యవహరిస్తుండటంతో మహానాటకం రక్తి కడుతోంది. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబుకు శివసేన చురకలు
ముంబై: కేంద్రంలో విపక్షాలను ఏకం చేసి, ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించిందని తమ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ‘ప్రధాని పదవికి ప్రతిపక్షంలో కనీసం ఐదుగురు పోటీదారులు ఉన్నారు. కానీ వీరి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే జవాబు దొరికింది. బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని అమిత్ షా ముందే చెప్పారు. ఐదో విడత ఎన్నికలు ముగిసేసరికే బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంద’ని శివసేన తెలిపింది. ఎటువంటి కారణం లేకుండానే చంద్రబాబు తనకు తానుగా ఎందుకు ఆయాసపడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్ పడనుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా, గత వారం రోజులుగా చంద్రబాబు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్‌లను కలిసి చర్చోప చర్చలు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే విపక్షాలన్నీ ఒక తాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ యాత్రలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడంలో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా ఈరోజు జరగాల్సిన ఢిల్లీ పర్యటనను మాయావతి రద్దు చేసుకున్నారు. -
వాజ్‌పేయి చనిపోయిందెప్పుడు? : శివసేన అనుమానం
-
వాజ్‌పేయి చనిపోయిందెప్పుడు? : శివసేన అనుమానం
ముంబై: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా? అని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన అనుమానం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆగస్టు 16 నాడు మృతి విషయాన్ని వెల్లడించారా? అని శివసేన అధికార పత్రిక సామ్నా.. సంపాదకీయంలో ప్రశ్నించింది. ‘ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12–13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?’ అని ‘స్వరాజ్యమంటే ఏంటి?’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. -
బీజేపీ ఒక హంతక పార్టీ : శివసేన
సాక్షి, ముంబై : ఈనెల(మే) 28న జరగనున్నపల్ఘార్ ఉప ఎన్నికలో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ, శివసేన పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. పల్ఘార్‌లో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా శివసేన.. బీజేపీని మోసం చేసిందంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్ ఆరోపణలపై స్పందించిన శివసేన.. ‘ఉన్మాదిగా మారిన బీజేపీ తనకు అడ్డొచ్చిన వారందరినీ నరికి వేసుకుంటూ వెళ్లే ఒక హంతక పార్టీ’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈమేరకు తన పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘పల్ఘార్ ఎంపీ చింతమన్ వనగా మరణం పట్ల బీజేపీ జాతీయ నాయకులెవరూ కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. ఆయన కుటుంబాన్ని కూడా ఎవరూ పరామర్శించలేదు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మరొకరికి అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ ప్రజాస్వామిక హక్కుగా బీజేపీ భావిస్తున్నట్టుంది. కర్ణాటక ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమంటూ’ శివసేన ఎద్దేవా చేసింది. అంతేకాకుండా బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు మహారాష్ట్రకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కూడా శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రచారంలో భాగంగా మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో కపట నాయకుడు యోగి చెప్పులు కూడా విప్పకుండా ఆయనను అవమానించారు. తద్వారా ఛత్రపతి వంటి యోధులను బీజేపీ ఎంత గౌరవిస్తుందో ఇట్టే అర్థమైపోతుందంటూ’ సామ్నాలో పేర్కొంది. కాగా, ఈ ఏడాది జనవరి 30న బీజేపీ ఎంపీ ఎంపీ చింతమన్ వనగా మరణించిన నేపథ్యంలో పల్ఘార్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ నేత రాజేంద్ర గవిట్‌ను బీజేపీ నిలబెట్టింది. అంతేకాకుండా పల్ఘార్‌లో తమకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టవద్దంటూ శివసేనను కోరింది. అయితే బీజేపీ మాటను లెక్కచేయకుండా రాజేంద్ర గవిట్‌కు పోటీగా.. చింతమన్ కుమారుడు శ్రీనివాస్‌ను నిలబెట్టి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. -
రాజధానిని లండన్ లేదా న్యూయార్క్‌కు మార్చాలి!
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘మౌనీ బాబా’గా శివసేన అభివర్ణించింది. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు దేశంలోని సమస్యల గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేసింది. దేశ రాజధాని లండన్, న్యూయార్క్, టోక్యో, లేదా ప్యారిస్‌కు మార్చాలని, అలా కుదరకుంటే.. న్యూఢిల్లీనే విదేశీ నగరంలా కనిపించేవిధంగా సినిమా సెట్టింగ్‌తో రూపొందించాలని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో ‘మన్మోహన్ మోదీ’ పేరిట ఓ సంపాదకీయాన్ని ప్రచురించింది. మరింతగా మాట్లాడాలని మోదీకి మన్మోహన్ ఇచ్చిన సలహా సముచితమైనదేనని, ఇదే భావనను దేశమొత్తం వ్యక్తం చేస్తోందని శివసేన పేర్కొంది. "అయినా మన్మోహన్ సింగ్ చెప్పింది అర్ధ సత్యమే. మోదీ భారతదేశంలో మౌనీ బాబాగా మారిపోతారు. విదేశాలకు వెళితే మాట్లాడుతారు. దేశంలో తప్పక మాట్లాడాలని ఆయన అనుకోవడం లేదు. దేశంలో జరిగే సంఘటనలు ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే విదేశాలకు మళ్లినప్పుడు ఆయన దేశంలోని సమస్యల గురించి మాట్లాడుతున్నారు’ అని అది పేర్కొంది. ‘దేశంలో జరిగిన రేప్ కేసుల గురించి ప్రధాని లండన్‌లో మాట్లాడారు. ఇది ఆయనలోని సున్నితత్వం. అన్యాయాలపై ఆయన భావోద్వేగానికి లోనవుతారు. ఆ భావోద్వేగపు నిప్పురవ్వ విదేశాలకు వెళ్లగానే భగ్గుమంటుంది’ అంటూ ‘సామ్నా’ పేర్కొంది. రేప్ కేసులపై రాజకీయం చేయొద్దని మోదీ అంటున్నారని, కానీ నిర్భయ కేసు విషయంలో ఆయన వైఖరి ఇందుకు భిన్నంగా ఉందని గుర్తుచేసింది. -
ఇష్టమైతే ఉండు.. లేకపోతే వదిలేయ్..!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కలహాలు కాపురం క్లైమాక్స్‌కు చేరినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ-శివసేన ఆది నుంచి ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీతో తెగదెంపులకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీయే తమ ప్రధాన శత్రువు అని ప్రకటించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. తాజాగా మంగళవారం శివసేన అధికార పత్రిక 'సామ్నా' మరో బాంబ్ పేల్చింది. 'ఠీక్ లగేతో దేఖో, వర్న చోడ్ దో' (ఇష్టమైతే ఉండండి.. లేకపోతే వదిలేయండి' అంటూ 'సామ్నా' ప్రచురించిన సంపాదకీయంలో.. బీజేపీకి నచ్చితో శివసేనతో పొత్తు కొనసాగించాలని, లేదంటే దేవేంద్ర ఫడవిస్ ప్రభుత్వం పొత్తు నుంచి వైదొలగవచ్చునని తేల్చిచెప్పింది. ఇప్పటికే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మిత్రపక్షం శివసేన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏకకాలంలో ఆ పార్టీ అధికారపక్షంగా, ప్రతిపక్షంగా రెండు పాత్రలు పోషించలేదని, కావాలంటే తమతో పొత్తు విషయంలో సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోవచ్చునని అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపే తమ ప్రధాన శత్రువు అని శివసేన నేత రౌత్ వ్యాఖ్యలు చేశారు. మోదీ హవా మసకబారిందని, దేశాన్ని నడిపించే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని ఆయన టీవీ చర్చలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంతో తాజాగా ఫడ్నవిస్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ 'సామ్నా' సంపాదకీయాన్ని ప్రచురించింది. శివసేనతో పొత్తు కొనసాగించాలా? లేదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని తెగేసి పేర్కొంది. -
యూపీ పిల్లల మరణాలు.. శివ సేన స్పందన
సాక్షి, ముంబై: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల మరణాల ఉదంతాలపై చర్యలు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆక్సిజన్, మందుల కొరతతో మృత్యు ఘోష కొనసాగుతున్నా.. ఆదిత్యానాథ్ ప్రభుత్వం పట్టన్నట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానస పు(ప)త్రిక సామ్నలో శివ సేన పార్టీ బీజేపీని ఏకీపడేసింది. మంగళవారం తన సంపాదకీయంలో ఉత్తర ప్రదేశ్ ఆస్పత్రుల వ్యవహారంపై వ్యాసం ప్రచురించింది. గోరఖ్ పూర్, ఫర్రూఖాబాద్ ఆస్పత్రిలో మరణించిన పిల్లలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఏమైనా జరిగితే వారికి ప్రభుత్వాసుపత్రులే గతి. తమ ప్రాణాలను కాపాడే గుడిగా వాటిని పేదవాళ్లు భావిస్తారు. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగా ఇప్పుడు అవే వారిపాలిట మృత్యు కుహరాలుగా మారిపోయాయి అని సామ్న తెలిపింది. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమితోనే పిల్లలంతా చనిపోతున్నారని ప్రభుత్వానికి తెలిసి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. సౌకర్యాలను మెరుగుపరచటం లేదు. అంటే ప్రజల ప్రాణాలపై అక్కడి బీజేపీ ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో అర్థమైపోతుంది అని వ్యాసంలో పేర్కొంది. కాగా, గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో సుమారు 70 మంది, ఫర్రూఖాబాద్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 50 మంది(ఇవాళ మరో చిన్నారి) ఆక్సిజన్, సరైన మందులు లేకపోవటం, సిబ్బంది కొరత తదితర కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. -
ఓడిపోయినా తిరిగి మంత్రిని అవుతా!
ముంబై: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తాను పనాజీ ఎన్నికలో ఓడిపోయినా ఫర్వాలేదని, కేంద్ర రక్షణ మంత్రి పదవి తన కోసం తిరిగి ఎదురు చూస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, శివసేన తన పత్రిక సామ్న సంపాదకీయంలో పారికర్‌ను ఏకీపడేసింది. "పారికర్ రాజకీయ ధురంధరుడు, నిజాయితీ పరుడు అన్న మాట ఈ ప్రకటనతో అబద్ధమని తేలింది. ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్యలు కావు. దేశ అత్యున్నత పదవిని కూడా హేళన చేస్తూ ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో రక్షణ మంత్రి బాధ్యతలు అప్పజెప్పిన ప్రధాని మోదీని కూడా ఆయన అవమానించారు" అని సామ్న వ్యాసంలో పేర్కొంది. ఇలాంటివి ప్రజల్లో నేతలపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయని తెలిపింది. అంతేకాదు సరిహద్దులో ఓ పక్క ఉద్రిక్తత పరిస్థితి ఉన్న సమయంలో, పారికర్ సెలవుపై గోవాకు వెళ్లి చేపల కూర వండుకుని తిన్న ఉదంతంను కూడా సామ్న ప్రస్తావించింది. అయితే బీజేపీ మాత్రం పారికర్ వ్యాఖ్యలతో కూడిన టేప్‌ను ఓ అబద్ధంగా తేల్చేసింది. ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పార్టీ అబద్ధపు ప్రచారంతో ఎన్నికల కోడ్ ను ఉల్లఘిస్తున్నారంటూ పేర్కొంది. రక్షణ మంత్రిగా రాజీనామా చేసిన పారికర్, గోవాలో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరిగి ప్రత్యక్ష ఎన్నిక సమరానికి సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న పనాజీ, వల్పోయి నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నేనేం ఢిల్లీ వెళ్లట్లేదు... ఫడ్నవిస్ మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తుందన్న వార్తలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని ఆయన తేల్చేశారు. కేంద్ర మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, అధిష్ఠానం నుంచి అలాంటి సంకేతాలు కూడా అందలేదని ఆయన తెలిపారు. 2019 వరకు తాను ముఖ్యమంత్రిగా, రావ్ సాహెబ్ దన్వే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. -
20 అడుగుల లోతు గొయ్యిలో పాతిపెట్టారు
ముంబై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీజేపీపై మిత్రపక్షం శివసేన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. నితీశ్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రజలను ఒకసారి మాత్రమే మోసం చేయగలమని బిహార్ ఫలితాలు రుజువు చేశాయని 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్న బీజేపీ- బిహార్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుందని... మోదీ వర్సెస్ నితీశ్ గా ముఖాముఖి పోరు జరిగిందని పేర్కొంది. రాజకీయ వ్యూహాలు, డబ్బు, భారీ ప్యాకేజీ ప్రకటనలు చేసినా బీజేపీ 60 సీట్లు కూడా సాధించలేకపోయిందని ఎద్దేవా చేసింది. ఎన్డీఏ మిత్రపక్షాలను బిహార్ ఓటర్లు 20 అడుగుల లోతు గొయ్యిలో పాతిపెట్టారని దుయ్యబట్టింది. నిరాడంబర ప్రచారం, హానెస్ట్ ఇమేజ్ తో నితీశ్ అధికారం నిలబెట్టుకున్నారని తెలిపింది. బూటకపు హామీలు ఇవ్వలేదని, అనాగరిక భాష వాడలేదని, డబ్బు, అధికారం వినియోగించలేదని... ఇవన్నీ నితీశ్ విజయానికి బాటలు వేశాయని విశ్లేషించింది. మహాకూటమి గెలిచిన తర్వాత పాకిస్థాన్ లో టపాసులు పేలాయే, లేదో తమకు తెలియదని శివసేన వ్యాఖ్యానించింది. బిహార్ ఎన్నికల ఫలితాలకు బీజేపీ కచ్చితంగా ఎదురుదెబ్బేనని పేర్కొంది. వినమ్రత అనేది ఆభరణం కాదని ఆత్మరక్షణ ఆయుధం అనీ బిహార్ ఫలితాలతో రుజువయిందని తెలిపింది. -
బీజేపీని మురికిగా మార్చి ఊడ్చేసిన ఆప్
సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యలు సాక్షి, ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు గుర్తుపై పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని మురికిలాగా ఊడ్చేసిందని శివసేన బుధవారం తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. బీజేపీ ఘోర వైఫల్నాకి ప్రధాని మోదీయే కారణమని పేర్కొంది. కేవలం ఎన్నికల వాగ్దానాలు, ప్రసంగాలతోనే విజయం సాధించలేమని, బీజేపీకి ఢిల్లీ గుణపాఠం నేర్పిందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన బీజేపీని ఆప్ మురికిగా మార్చేసిందని తెలిపింది. తాము గెలిచిన సీట్లను లెక్కించేందుకు బీజేపీ నేతలకు చేతి వేళ్లు కూడా అవసరం లేదని ఎద్దేవా చేసింది. కిరణ్‌బేదీని ఓటమికి బాధ్యురాలిని చేయడం సరి కాదని సూచించింది. అమిత్‌షా తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోయారని, చివరి అస్త్రంగా మోదీని ప్రయోగించినా విఫలమయ్యారని ఎత్తిపొడిచింది. ఇది మోదీ పరాజయమని అన్నా హజారే వ్యాఖ్యానించారని, తాము కూడా అలాగే భావిస్తున్నామని శివసేన తెలిపింది. ఓ కార్పొరేషన్లో శివసేన ఓడితే... ఉద్దవ్ ఠాక్రే ఓడినట్టు భావించాలా..? : సిఎం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొనడం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. నాసిక్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఏదైనా కార్పొరేషన్లో శివసేన ఓడిపోతే అది ఉద్ధవ్ ఠాక్రే పరాజయంగా భావించాలా..? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని నరేంద్ర మోడీ పరాజయంగా పేర్కొనరాదన్నారు. ముఖ్యంగా పక్కింట్లో పిల్లాడు పుట్టాడన్న సంతోషాన్ని ఎక్కువ రోజులు వ్యక్తపరచరాదని కూడా ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో పరాజయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకుంటుందన్నారు. -
‘జావ్‌ఖేడా’ బాధితులకు సత్వర న్యాయం
ముంబై: అహ్మద్‌నగర్ జిల్లా జావ్‌ఖేడా గ్రామంలో ఇటీవల జరిగిన ముగ్గురు దళిత కుటుంబ సభ్యుల హత్య కేసును సత్వరమే పరిష్కరించాలని బీజేపీ ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. బాధితులకు న్యాయం చేయాలని ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయని, దీన్ని అవకాశంగా తీసుకుని స్వార్థ రాజకీయ నాయకులు, నక్సల్స్ హింసను ప్రేరేపించే అవకాశముందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఆ పార్టీ సోమవారం స్పందించింది. ఈ అమానుష ఘటన వెనుక శక్తులను వెంటనే అరెస్టు చేసేందుకు నూతన ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. కాగా, మృతుల కుటుంబాలను ఇప్పటికే మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెన్నెస్ నేత రాజ్‌ఠాక్రే తదితరులు పరామర్శించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని కోరారు. అలాగే ఈ హత్యలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని డీజీపీ సంజీవ్ దయాళ్ను గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఠాక్రేపై గౌరవముంటే విడిపోయేవారా?
సాక్షి, ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. 25 ఏళ్ల అనుబంధం తెగిపోతున్న సమయంలో బాల్‌ఠాక్రేపై ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలు గుర్తుకురాలేదా..? అని మోడీని నిలదీశారు. శివసేనపై విమర్శలు చేయనని, ఇలా దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు నివాళులు అర్పిస్తున్నాని మోడీ ఆదివారం ముంబైలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఉద్ధవ్.. సామ్నా సంపాదకీయం ద్వారా తనదైన శైలిలో మోడీపై మండిపడ్డారు. ‘బాల్‌ఠాక్రే పై మోడీకి గౌరవం ఉండడం మంచిదే. ఇందుకు మేము ఆయనకు స్వాగతం పలుకుతాం. మేం కూడా మోడీని గౌరవిస్తాం. అయితే హిందుత్వం అనే గట్టిదారంతో ఏర్పడిన బంధాన్ని శివసేన అధినేత బాల్‌ఠాక్రే 25 ఏళ్లు కొనసాగించారు. ఆ బంధం ఇప్పుడెలా తెగిపోయింద’ని ప్రశ్నించారు. సీట్ల పంపకాల విషయంపై ముందుకువచ్చి బంధం తెగకుండా చూసినట్లయితే బాల్‌ఠాక్రేకు అది నిజమైన నివాళి అయ్యేదంటూ చురకలంటించారు. రాష్ట్ర ప్రజలు తెలివైనవారేనని, వారందరికీ అసలు దొంగలెవరు..? బురఖాలో ఉన్న దొంగలెవరో..? అనేది తెలుసునంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రను దోచుకున్నాయని ఆరోపించారు. ‘ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబేన్ పటేల్ ముంబైకి ఏ ఉద్దేశంతో వచ్చివెళ్లారో తెలిసిందే. ముంబైలోని పారిశ్రామికవేత్తలను మహారాష్ట్రలో ఉండవద్దని, అందరు గుజరాత్‌కు తరలిరావాలని ఆనందీబేన్ పిలుపునిచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇలా చేయడం కూడా మహారాష్ట్రను దోచుకోవడమే అవుతుంద’ని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన బెల్గావ్, కారవార్ తదితర ప్రాంతాలపై మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్‌ల అభిప్రాయాలేమిటి..? సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 20 లక్షలమంది మరాఠీలపై జరుగుతున్న అన్యాయంపై వైఖరేమిటి? ఛత్రపతి శివాజీ మహారాజు ఆశీర్వాదాలున్నాయంటు మహారాష్ట్రలోకి వచ్చిన వారు సరిహద్దు అంశంపై ఎందుకు మాట్లాడడంలేదు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మోడీ ప్రధానిగా ఉన్నారు. కాని యెల్లూర్లో మరాఠీ ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగతోంది. ఇలాంటి సమయంలో మరాఠీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మహారాష్ట్రను ముక్కలు చేయాలన్న కలతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింద’ని ఆరోపించారు. తుల్జాపూర్లో ఆవేశంగా.. శివసేన, బీజేపీల బంధం తెగిపోవాలనేది మాతా తుల్జభవాని నిర్ణయం కావొచ్చని, అందుకే బంధం తెగిపోయిందని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తుల్జాపూర్లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు బీజేపీపై విమర్శలు గుిప్పించారు. గోపీనాథ్ ముండే ఉండి ఉంటే కూటమి ముక్కలయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అధికారం చేజిక్కించుకునేందుకు అందరు ప్రచార బరిలోకి దిగారని, ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు అనేక హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. ‘అధికారం మాకివ్వండి.. మాకివ్వండి.. మేము రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తామో చూడండ’ని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సీట్ల పంపకాలపై మాట్లాడుతూ ... ‘అసెంబ్లీపై కాషాయం రెపరెపలాడాలంటే తుల్జాపూర్లో కూడా కాషాయం రావాలని కార్యకర్తలు చెప్పారు. అయితే ఈ సీటు బీజేపీకి వెళ్లితే ఎలా అని కొందరు ప్రశ్నించారు. అదే సమయంలో బంధం తెగిపోయిందని వార్త వచ్చింది. దీన్నిబట్టి నీకు నిండుగా ఇస్తానని చెబుతుండగా కూటమిలో ఏముందని తుల్జాభవాని నాకు సంకేతాలిచ్చినట్టయింది. అలా బీజేపీ, శివసేన కూటమి తెగిపోవాలని మాతా తుల్జాభవాని నిర్ణయించిందని నాకు అనిపిస్తోందన్నారు. తుల్జాపూర్తోపాటు రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఎవరూ శ్రద్ధ వహించలేదు. కానిమేము రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇందుకోసం అన్ని ప్రణాళికలు మావద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే మాకు అధికారం ఇవ్వాలా..? వద్దా..? అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోండ’ంటూ ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. -
‘మహా’ శత్రువులే కారకులు
సాక్షి, ముంబై: మహాకూటమి విచ్ఛిన్నం కావడానికి మహారాష్ట్ర శత్రువులే కారణమని శివసేన పేర్కొంది. బీజేపీని మహారాష్ట్ర శత్రువని అభివర్ణించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠీ అనుకూల ఎజెండాకు ప్రాధాన్యమివ్వనున్నట్లు శివసేన పరోక్షంగా సంకేతాలిచ్చింది. ‘శివసేన, బీజేపీల పొత్తు కొనసాగాలని మహారాష్ట్రలోని 11 కోట్ల ప్రజలు ఆకాంక్షించారు. కాని వీరందరి ఆకాంక్షలు సర్వనాశనం కావడానికి కారకులు మహారాష్ట్ర శతృవులే అవుతారు’ అని సామ్నా ఆరోపించింది. ఇది సంయుక మహారాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన 105 మంది మృతవీరులను అవమానించడమేనని పేర్కొంది. హిందూత్వ విధానాలతో 25 ఏళ్ల పాటు కొనసాగిన బంధం ముగిసిపోవడం దురదృష్టకరమని సంపాదకీయం పేర్కొంది. నిన్నటి వరకు ఈ టెంటులో ప్రార్థనలు చేసిన వారు నేడు మరో శిబిరంలో నమాజు చేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్య, భారతీయ ముస్లిమ్‌లు దేశభక్తులనిప్రశంసించిన ప్రధాని మోడీని ఉద్దేశించి చేసినట్టు తెలుస్తోంది. పోయిన వారు (బీజేపీ) ‘పిండం’ కోసం ఎగిరిపోయిన కాకులు, మిగిలిన వారు మావ్లే (ఛత్రపతి శివాజీ సైనికులు) అని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీపై కూడా సామ్నా విమర్శలు గుప్పించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముంబై నగర ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని విమర్శించింది. నిజానికి కాంగ్రెస్ రక్తమాంసాలున్న మొరార్జీ దేశాయ్ కాలంలోనే ఆ కుట్ర జరిగిందని గుర్తు చేసింది. సమైక్య ముంబై, మహారాష్ట్రల కోసం కాంగ్రెస్, దాని నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాషాయ పతాకం రాష్ట్రాన్ని రక్షించగలదని పేర్కొంది. ఇటు కాషాయ కూటమి, అటు కాంగ్రెస్-ఎన్సీపీల బంధం తెగిపోవడంపై సామ్నా వ్యాఖ్యానిస్తూ అమావాస్య జీవనం ముగిసింది, నవరాత్రి శుభదినాలు ప్రారంభమయ్యాయని తెలిపింది. సామ్నా వ్యాఖ్యలు దురదృష్టకరం: బీజేపీ తమను మహారాష్ట్ర శత్రువులని శివసేన వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండగలరని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలోని చిన్న పార్టీలను మోసగించే కుట్రలో బీజేపీ భాగం పంచుకోగలదని శివసేన ఆశించరాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే వారు సీట్ల సర్దుబాటును ప్రతిపాదించారని, దానిని ఆమోదించి ఉంటే చిన్న పార్టీలన్నీ కూటమి నుంచి బయటకు వెళ్లిపోయేవని రూడీ పేర్కొన్నారు. శివసేన వాడే పరుష పదజాలంతో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ఓడించలేమని ఆయన హితవు చెప్పారు. -
మోడీ సర్కారుపై శివసేన ఫైర్
ముంబై: రైల్వే చార్జీల పెంపుపై విపక్షాల దాడులు ఎదుర్కొంటున్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తాజాగా స్వపక్షం నుంచి విమర్శల బారిన పడింది. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన...రైల్వే చార్జీల పెంపును తప్పుబట్టింది. చార్జీల పెంపుతో సామాన్యుడిపై మోయలేని భారం పడిందని విమర్శించింది. రైల్వే మంత్రి సదానంద గౌడ మొదటిసారే భారీగా చార్జీలు పెంచారని శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపాడుతుందని ప్రజలు భావించారని, రైల్వే చార్జీల పెంపుతో ఈ నమ్మకం వమ్మయ్యే ప్రమాదముందని అభిప్రాయపడింది.