tax dues
-
దేశం విడిచి వెళ్తుంటే ట్యాక్స్ మొత్తం కట్టాల్సిందేనా? కేంద్రం క్లారిటీ
దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టంలోని సెక్షన్ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సెక్షన్ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.అంతేకాకుండా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించారు.ఫైనాన్స్ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి. -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్‌లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ప్రాసెసింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్‌లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్‌లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్‌లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్‌కు ట్యాక్స్ రీఫండ్‌ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
ఐశ్వర్య రాయ్‌కి లీగల్ నోటీసులు!
మాజీ విశ్వసుందరి, సినీ నటి ఐశ్వర్యరాయ లీగల్ నోటీసులు అందాయి. నాసిక్‌లోని తన భూమిక ఏడాది కాలంగా ఆమె పన్ను చెల్లించని నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాజాగా ఐశ్వర్యకు నోటీసులు జారీ చేసింది. వివరాలు.. నాసిక్‌లో జిల్లాలోని సిన్నార్‌లో ఐశ్వర్య పేరు మీదహెక్టారు భూమి ఉందట. ఈ భూమి సంబంధించి ఐశ్వర్య ఏడాది కాలం నుంచి పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని రెవెన్యూ అధికారులు జనవరి 9న ఐశ్వర్యకు లీగల్ నోటీసులు ఇచ్చారు. చదవండి: పఠాన్ మూవీ రన్ టైం లాక్.. ‘బెషరమ్ రంగ్’ పాటకు 3 సెన్సార్ కట్స్! దీని ప్రకారం ఐశ్వర్య రూ. 21, 960 వేలు చెల్లించాల్సి ఉందట. కాగా మండల తాహసిల్థా ఆమెతో మరో 1200 వందల మందికి తాసిల్దార్ ఈ నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇందులో పలువురు సినీ సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది మార్చి చివరి నాటికి పన్ను బకాయిలు వసూలు చేయాలని మహారాష్ట్రలోని భూ రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన! -
పన్ను చెల్లించండి బంగారం గెలవండి
ముంబై: పన్ను రాబడి పెంచుకోవడానికి మహారాష్ట్రలోని ఓ గ్రామం వినూత్న ప్రయోగం చేపట్టింది. వచ్చే సంవత్సరం మార్చి 15 లోపు గ్రామపంచాయతీ పన్ను బకాయిలు చెల్లిస్తే వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామని, లక్కీడ్రాలో వారు బంగారం గెలుపొందవచ్చని ప్రకటించింది. సంగ్లీ జిల్లా కడేగావ్ తాలూకాలోని వాంగీ అనే గ్రామపంచాయతీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పన్ను బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించిన వారి పేర్లతో లక్కీడ్రా తీస్తామని, లక్కీడ్రాలో తొలి రెండు స్థానాల్లో వచ్చినవారు 5 గ్రాములు, 3 గ్రాముల బంగారపు ఉంగరాలు, మూడో స్థానంలో నిలిచిన వారు 2 గ్రాముల బంగారు నాణెం గెలుచుకుంటారని తెలిపింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని వాంగీ గ్రామ సర్పంచ్ విజయ్ హన్మానే తెలిపారు. -
బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్ చేస్తారు..? : మహేష్
-
బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్ చేస్తారు..? : మహేష్
సాక్షి, హైదరాబాద్ : పన్ను బకాయిలు చెల్లించనందుకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ అధికారులు జప్తు చేశారు. ఈ వ్యవహారంపై మహేష్‌బాబు లీగల్ టీమ్ ఎట్టకేలకు స్పందించింది. వివాదం కోర్టు పరిధిలో ఉండగా బ్యాంకు ఖాతాలను ఎలా సీజ్ చేస్తారంటూ, చట్టానికి కట్టుబడే పౌరునిగా మహేష్ బాబు తన పన్నులన్నింటిని సక్రమంగా చెల్లించారంటూ ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. ‘2007-08 ఆర్థిక సంవత్సరానికి గానూ అంబాసిడర్ సర్వీసెస్‌కు ఈ పన్ను చెల్లించాలని జీఎస్టీ అధికారులు ఆదేశించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి ట్యాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి ట్యాక్స్ పరిధిలోకి రాదు. ఈ ట్యాక్స్‌ను సెక్షన్ 65 (105)(zzzzq) ద్వారా 2010 జులై 1నుంచి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించిడం జరిగింది. మహేష్ బాబు తన పనులన్నింటిని సక్రమంగానే చెల్లించారు’ అంటూ మహేష్ బాబు లీగల్ టీమ్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
ప్రస్తుతం మహేష్ ఎక్కడ ఉన్నారంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించే చర్చ జరుగుతోంది. ట్యాక్స్ కట్టలేదని ఆయన ఖాతాలను సీజ్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇక మహేష్ అభిమానులు ఈ విషయంపై కలవరపడుతుంటే.. ఆయన మాత్రం హ్యాపీగా హ్యాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌చేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు విదేశాలకు వెళ్లిన మహేష్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక్కడేమో పన్నులు కట్టలేదనీ, ఆయన ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏమాత్రం స్పందించకుండా మహేష్ సరదాగా హాలిడేను ఎంజాయ్ చేసేస్తున్నారు. జాలీగా హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న పిక్‌ను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చదవండి : మహేష్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాధీనం హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్ -
మహేష్‌బాబుకు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: హీరో మహేష్‌బాబుకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి రూ. 42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు జీఎస్టీ అధికారులు తెలిపారు. ఇంకా రూ. 31 లక్షలు ఆయన నుంచి రాబట్టాల్సివుందని చెప్పారు. మొత్తం రూ. 73 లక్షలు పన్ను బకాయి చెల్లించాల్సివుందన్నారు. 2007-08లో ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయానికి సర్వీసు ట్యాక్స్ చెల్లించకపోవడంతో మహేష్‌బాబు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ జప్తు చేసింది. యాక్సిస్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 31 లక్షలు రికవరీ చేశామని, మిగతా మొత్తం ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్ నుంచి స్వాధీనం చేసుకుంటామని జీఎస్టీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. పన్ను బకాయిలకు సంబంధించి 2010లో నోటీసు ఇచ్చామన్నారు. ఆయన స్పందించకపోవడంతో 2012లో ఆర్డర్ పాస్ చేశామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నా ఆయనకు ఊరట లభించలేదన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును మహేష్ ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆర్థిక చట్టం సెక్షన్ 87 ప్రకారం ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్టు వివరించారు. -
బకాయిల గుదిబండ
పేరుకుపోతున్న నీటి పన్ను బకాయిలు చీమకుర్తి, గిద్దలూరులలో అత్యల్ప వసూలు 15 ఏళ్ల నుంచి పైసా కట్టని ప్రభుత్వ సంస్థలు మొండి బకాయిలపై కొనసాగుతున్న నిర్లక్ష్యం ఒంగోలు, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. నీటిపన్ను బకాయిలు సైతం చెల్లించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పది నెలలు గడిచినా ఇప్పటి వరకు వసూలు చేసింది 23.44 శాతం పన్నులు మాత్రమే. నూరు శాతం పన్నుల వసూలు లక్ష్యంగా ఆర్థిక సంవత్సరం చివరిలో ఒత్తిడి తెస్తున్న అధికారులు మొండిబకాయిలపై దృష్టి సారించడం లేదు. మున్సిపాల్టీ వారీగా వసూళ్ల వివరాలు: ఒంగోలు నగరపాలక సంస్థలో ఈ ఏడాది మార్చి నాటికి నివాస కుటుంబాల నుంచి వసూలుచేయాల్సిన నీటిపన్ను *197.02 లక్షలు. ఇక ప్రభుత్వ సంస్థల నుంచి వసూలు చేయాల్సిన మొత్తం *149.69 లక్షలు. ప్రభుత్వ సంస్థల బకాయిలను పరిశీలిస్తే దాదాపు 15 ఏళ్లుగా పైసా కూడా కట్టకపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వ బకాయి *6.24 లక్షలు కాగా పాత బకాయి *143.45 లక్షలు ఉందంటే పన్ను కట్టి ఎన్ని ఏళ్లయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచి *197.02 లక్షలకుగాను ఇప్పటి వరకు *65.63 లక్షలు వసూలు చేశారు. కందుకూరులో *35.63 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం *19.71 లక్షలు. చీరాలలో *62.14 లక్షలకుగాను *20.33 లక్షలు వసూలు చేశారు. మార్కాపురంలో *59.44 లక్షలకుగాను *16.93 లక్షలు వసూలు చేశారు. అద్దంకి నగర పంచాయతీలో *28.01 లక్షలకుగాను *18.25 లక్షలు వసూలు చేశారు. చీమకుర్తి నగర పంచాయతీ పరిస్థితి పూర్తి భిన్నం. ఈ నగర పంచాయతీలో *20.14 లక్షల నీటిపన్ను వసూలు కావాల్సి ఉండగా అందులో వసూలైంది *40 వేలు మాత్రమే. కనిగిరి నగర పంచాయతీలో *19.55 లక్షలకుగాను వసూలైన మొత్తం *4.28 లక్షలు. గిద్దలూరు నగర పంచాయతీలో *72.66 లక్షలకుగాను వసూలైన మొత్తం *5.51 లక్షలు. చీమకుర్తి, కనిగిరి నగర పంచాయతీల్లో నీటి పన్ను వసూలు మరీ దారుణంగా ఉంది. ప్రస్తుత, పాత బకాయిల వివరాలు: 2013-14 ఆర్థిక సంవత్సరంలో అన్ని మున్సిపాల్టీల్లో కలిపి *278.01 లక్షలు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు వసూలైన మొత్తం * 87.5 లక్షలు. 2013-14 సంవత్సరంలో *366.27 లక్షల పాత బకాయిలు వసూలు చేయాలి. కానీ ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం *63.54 లక్షలు మాత్రమే. అంటే ఇంకో రెండు నెలల్లో వసూలు చేయాల్సిన పాత బకాయిలు *302.73 లక్షలు. ప్రస్తుతం పన్ను చెల్లించకుండా పెనాల్టీకి గురైన వారు 37,122 మంది. వారిలో 877 మంది మాత్రం పెనాల్టీలు చెల్లించారు. ఇంకా 36,245 మంది జరిమానాలు చెల్లించాలని గుర్తించారు. అధికారులు మాత్రం నీటిపన్ను, ఇంటి పన్ను రెండూ కట్టాల్సిందేనని ట్యాపులు పీకేస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని 15 ఏళ్లకుపైగా పన్ను కట్టని ప్రభుత్వ సంస్థల విషయంలో పాటించడం లేదు.