Aishwarya Rai Bachchan Gets Notice From Revenue Department For Land Tax Due - Sakshi
Sakshi News home page

Aishwarya Rai: ఐశ్యర్య రాయ్‌తో సహా 1200 మందికి రెవెన్యూ శాఖ నోటీసులు!

Published Wed, Jan 18 2023 1:04 PM | Last Updated on Wed, Jan 18 2023 1:47 PM

Aishwarya Rai Gets Notice From Revenue Department for Tax Due - Sakshi

మాజీ విశ్వసుందరి, సినీ నటి ఐశ్వర్యరాయ​ లీగల్‌ నోటీసులు అందాయి. నాసిక్‌లోని తన భూమిక ఏడాది కాలంగా ఆమె పన్ను చెల్లించని నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాజాగా ఐశ్వర్యకు నోటీసులు జారీ చేసింది. వివరాలు.. నాసిక్‌లో జిల్లాలోని సిన్నార్‌లో ఐశ్వర్య పేరు మీదహెక్టారు భూమి ఉందట. ఈ భూమి సంబంధించి ఐశ్వర్య ఏడాది కాలం నుంచి పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని రెవెన్యూ అధికారులు జనవరి 9న ఐశ్వర్యకు లీగల్‌ నోటీసులు ఇచ్చారు.

చదవండి: పఠాన్‌ మూవీ రన్‌ టైం లాక్‌.. ‘బెషరమ్‌ రంగ్‌’ పాటకు 3 సెన్సార్‌ కట్స్‌!

దీని ప్రకారం ఐశ్వర్య రూ. 21, 960 వేలు చెల్లించాల్సి ఉందట. కాగా మండల తాహసిల్థా ఆమెతో మరో 1200 వందల మందికి తాసిల్దార్ ఈ నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇందులో పలువురు సినీ సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  ఏడాది మార్చి చివరి నాటికి పన్ను బకాయిలు వసూలు చేయాలని మహారాష్ట్రలోని భూ రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్‌ సంఘటన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement