పన్ను బకాయిలు చెల్లించనందుకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ అధికారులు జప్తు చేశారు. ఈ వ్యవహారంపై మహేష్‌బాబు లీగల్ టీమ్ ఎట్టకేలకు స్పందించింది. వివాదం కోర్టు పరిధిలో ఉండగా బ్యాంకు ఖాతాలను ఎలా సీజ్ చేస్తారంటూ, చట్టానికి కట్టుబడే పౌరునిగా మహేష్ బాబు తన పన్నులన్నింటిని సక్రమంగా చెల్లించారంటూ ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది.