bank accounts seize
-
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాగా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ సవాల్ చేసింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌లు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని.. పార్టీ ఎగ్గొ ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది. అయితే తొలుత ఈ పిటిషన్లపై మార్చి 20న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి నేడు తీర్పు వెల్లడించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. చదవండి: అందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు: శరద్ పవార్ కాగా అంతకుముందు ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. 2018-19 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీ శాఖ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ.. స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇక తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అబద్దంగా మారిందని ఆరోపిన్నారు. ఎన్నికల్లో పోరాడకుంటా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాటి చర్యలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ న్యాయస్థానంలోనూ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. -
కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌కు సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో తమ దగ్గర ఫండ్స్ లేవంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తే ఏంటి?.. గతంలో తమ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాల ద్వారా కూడబెట్టిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవచ్చని జేపీ నడ్డా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ తన అసమర్థత, చేతకానితనాన్ని ‘ఆర్థిక ఇబ్బందులు’గా పేర్కొంటోందని విమర్శించారు. ‘నిజానికి వారు ఆర్థికంగా దివాళా తీయలేదని నైతికంగా, మేధోపరంగా దివాలా తీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్లో) పోస్టు చేశారు. చదవండి: Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. ‘రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారు. ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే భారత ప్రజాస్వామ్యం, ఐటీ, దర్యాప్తు సంస్థలపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా.. అధికారులను, వ్యవస్థలను నిందిస్తోంది. ఐటీ లేదా ఢిల్లీ హైకోర్టు అయినా నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. అందుకు తగ్గట్టే పన్నులు చెల్లించాలని కాంగ్రెస్‌ను కోరాయి. కానీ ఆ పార్టీ ఎప్పుడూ అలా చేయదు. దేశంలో ప్రతి రాష్ట్రాన్ని, అన్ని రంగాలను అన్ని విధాలా దోచుకున్న పార్టీ(కాంగ్రెస్).. ఆర్థిక నిస్సహాయత గురించి మాట్లాడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ నేతలు జీపు నుంచి హెలికాప్టర్ల వరకు బోఫోర్స్ లాంటి అన్ని స్కామ్‌ల ద్వారా దోచుకున్న సొమ్మును తమ ప్రచారానికి వాడుకోవచ్చు. భారతదేశం ప్రజాస్వామ్యం అనేది ఒక అబద్ధమని కాంగ్రెస్ పార్ట్‌టైమ్ నాయకులు అంటున్నారు. 1975 నుంచి 1977 మధ్య కొన్ని నెలలు మాత్రమే భారత్‌లో ప్రజాస్వామ్య పాలన లేదు. ఆ సమయంలో భారత ప్రధానిగా కాంగ్రెస్‌కు చెందిన ఇందిరా గాంధే ఉన్నారు.’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. Congress is going to be totally rejected by the people and fearing a historic defeat, their top leadership addressed a press conference and ranted against Indian democracy and institutions. They are conveniently blaming their irrelevance on ‘financial troubles’. In reality, their… — Jagat Prakash Nadda (Modi Ka Parivar) (@JPNadda) March 21, 2024 కాగా లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభించడం ద్వారా తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని సోనియా గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. తమ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేసొ మోవా క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని, డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు నిర్వహించలేకపోతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఇక బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేసి.. డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం. తమ బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్ చేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. -
వివోకి భారీ షాక్: పెద్ద ఎత్తున నగలు, నగదు, బ్యాంక్ ఖాతాలు సీజ్
సాక్షి, ముంబై: చైనాకు చెందిన కంపెనీలకు షాకిస్తున్న కేంద్రం తాజాగా వివో మొబైల్స్‌కు భారీ ఝలకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలపై భారీ ఎత్తున బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 48 ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఇండియా వ్యాపారానికి సంబంధించిన 119 బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు ఈడీ గురువారం ప్రకటించింది. మనీలాండరింగ్‌పై దర్యాప్తులో భాగంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని 23 అనుబంధ కంపెనీల్లో విస్త్రృత తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా 465 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. 119 బ్యాంకుల్లో 73 లక్షల నగదు సహా, 66 ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 కేజీలల బంగారం బార్స్ ఈడీ స్వాధీనం చేసుకుంది. వివో భారతీయ విభాగం దాదాపు 62,476 కోట్ల రూపాయల టర్నోవర్‌లో దాదాపు 50 శాతం "రెమిట్" చేసిందని ఈడీ గురువారం వెల్లడించింది. విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నష్టాలను చూపించి పన్నులు చెల్లించకుండా ఎగవేసిందని, ఆ నిధులను దేశం వెలుపలికి తరలించిందనీ ఆరోపించింది. 2018లో వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ దేశం విడిచి పారిపోయాడని పేర్కొంది. -
మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన
కోల్‌కతా/న్యూఢిల్లీ: సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి చెందిన భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలన్నింటికీ కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ‘మదర్ థెరిసా నెలకొల్పిన సంస్థ... మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంఓసీ)కు భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యా! 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయింది. చట్టమే సర్వోన్నతమైనది... కాకపోతే మానవతాసాయం విషయంలో రాజీపడకూడదు’ అని మమత ట్వీట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను స్తంభింపజేశారనే వార్త తీవ్ర కలకలం రేపింది. టీఎంసీతో పాటు సీపీఎం తదితర విపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. దాంతో హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు వీలుగా... ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)–2011 కింద రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేయాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈనెల 25న తిరస్కరించామని తెలిపింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, పైగా ఈ సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని వివరణ ఇచ్చింది. అయితే ఈ ప్రతికూల సమాచారమేమిటి? ఏయే నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉల్లంఘించదనే వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టలేదు. ‘ఎప్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది అక్టోబరు 31తోనే ముగిసింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న ఇతర సంస్థలతో పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీకి కూడా గడువును డిసెంబరు 31 దాకా పొడిగించాం’ అవి హోంశాఖ వివరించింది. ఎంఓసీయే తమ విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేయాలని కోరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు తెలిపిందని పేర్కొంది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ నిరాకరణ నిర్ణయంపై పునఃపరిశీలన కోసం ఎంఓసీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని హోంశాఖ తెలిపింది. మేమే లావాదేవీలు నిలిపివేశాం: ఎంఓసీ విదేశీ నిధుల జమయ్యే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని దేశంలోని తమ ప్రాంతీయ కేంద్రాలను కోరినట్లు మిషనరీస్ ఆప్ చారిటీ సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు ఆ ఖాతాలను వాడొద్దని చెప్పామని తెలిపింది. ‘ఎఫ్సీఆర్ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, సస్పెండ్ చేయడం గాని జరగలేదని మేము స్పష్టం చేయదలచుకున్నాం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే మాకు సమాచారమిచ్చింది. మావైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో సమస్య పరిష్కారమయ్యే వరకు విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని మా కేంద్రాలను కోరాం’ అని ఎంఓసీ సూపీరియర్ జనరల్ సిస్టర్ ఎం.ప్రేమ సంతకంతో విడుదలైన ప్రకటన తెలిపింది. అయితే హోంశాఖ చెప్పినట్లుగా ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్బీఐని కోరిందనే అంశంపై... ఈ ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరిసా కోల్‌కతా కేంద్రంగా 1950లో స్థాపించారు. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీయే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ. దీని తరఫున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి. -
తండ్రి చేసిన అప్పుకు తనయుడి ఖాతా స్తంభన, నిండు ప్రాణం బలి
సాక్షి, చెన్నై: ఓ జాతీయ బ్యాంక్ అధికారి తీరుకు నిండు ప్రాణం బలైంది. తండ్రి చేసిన అప్పు కోసం తన ఖాతాను అధికారులు స్తంభింపజేశారు. దీంతో వైద్యం ఖర్చులకు నగదు కరువై అతను ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆదివారం తిరుప్పూర్ జిల్లా పల్లడంలో వెలుగు చూసింది. పొంగలూరు కులం పాళయంకు చెందిన కనకరాజ్ రైతు. అతనికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలల క్రితం అతని బ్యాంక్ ఖాతాను ఎస్బీఐ అధికారులు స్తంభింపజేశారు. కనకరాజ్ బ్యాంక్ అధికారులను సంప్రదించగా అసలు విషయం తెలిసింది. అదే బ్యాంక్‌లో కనకరాజ్ తండ్రి రంగస్వామికి సైతం ఖాతా ఉంది. 2017లో ఆయన అనారోగ్యంతో మరణించడంతో బ్యాంక్‌లో తీసుకున్న పంట రుణం రూ.75 వేలు బకాయి ఉంది. ఆ మొత్తాన్ని చెల్లించాలని కనకరాజ్ మీద ఒత్తిడి తెస్తూ ఖాతాను స్తంభింప చేసినట్టు తేలింది. రంగస్వామికి మరో కుమారుడు నారాయణ స్వామి ఉన్నా, అతడిని వదలి పెట్టి తన మీద మాత్రం బ్యాంకర్లు ఒత్తిడి తీసుకురావడంతో అప్పు చెల్లించేది లేదని కనకరాజ్ తేల్చాడు. కొద్ది రోజుల క్రితం కనకరాజ్ హఠాత్తుగా కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. చికిత్సకు రూ.లక్ష చెల్లించాలని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు సూచించాయి. దీంతో కనకరాజ్ ఖాతాలో ఉన్న నగదును తీసుకునేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగానే ప్రయత్నించారు. రంగస్వామి తీసుకున్న అప్పు చెల్లిస్తేనే కనకరాజ్ ఖాతాను తిరిగి పనిచేసేలా చేస్తామని బ్యాంక్ మేనేజర్ సుందరమూర్తి పేర్కొన్నారు. ఖాతాలో రూ.1.5 లక్షల నగదు ఉన్నా తీసుకునేందుకు వీలుకాకపోవడంతో వైద్యం అందలేదు. దీంతో కనకరాజ్ శనివారం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం చెందాయి. నేతలు ఆదివారం కనకరాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. సంబంధిత బ్యాంక్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, బ్యాంక్ ద్వారా ఆ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించడమే కాకుండా, రంగస్వామి తీసుకున్న రుణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా ఆ బ్యాంక్ మేనేజర్ సుందరమూర్తిని మీడియా ప్రశ్నించగా వైద్య ఖర్చుల కోసం అడగ్గానే ఖాతా మళ్లీ పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఏటీఎం నుంచి నగదు రాకపోతే దానికి తాను బాధ్యడిని ఎలా అవుతానని సమాధానం ఇవ్వడం గమనార్హం. చదవండి: విటమిన్ పేరిట విషం.. ముగ్గురి హత్య -
జీఎస్టీ రిటర్ను ఎగవేస్తే.. ఖాతా జప్తే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రిటర్నులు దాఖలు చేయని అసెసీలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి రానుంది. ప్రభుత్వం.. అలాంటి అసెసీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం లేదా ఏకంగా రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయని సంస్థలతో వ్యవహరించాల్సిన విధానాలకు సంబంధించి కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించింది. ఇందులో నిర్దిష్ట కఠిన చర్యలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. దఫదఫాలుగా నోటీసులు... కాంపొజిషన్ స్కీమ్ ఎంచుకున్న అసెసీలు.. మూడు నెలలకోసారి, మిగతా వారు నెలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, జీఎస్టీ అసెసీల్లో 20 శాతం మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని, దీనివల్ల పన్ను వసూళ్లు గణనీయంగా దెబ్బతింటున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐసీ... ఎస్‌వోపీని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో డిఫాల్టరుకు ముందు సిస్టమ్ నుంచి ఒక నోటీస్ వెడుతుంది. ఆ తర్వాత అయిదు రోజుల్లోగా చెల్లించకపోతే.. ఫారం 3–ఎ కింద మరో నోటీసు జారీ అవుతుంది. ఇది వచ్చాక 15 రోజుల్లోగానైనా చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ కట్టకపోతే.. అధికారులు సదరు అసెసీ కట్టాల్సిన పన్ను బాకీలను మదింపు చేసి, ఫారం ఏఎస్‌ఎంటీ–13 జారీ చేస్తారు. -
నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాక్..!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్‌లో సుమారు 6.122 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్‌డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్ మోదీకి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్బీని నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. -
క్యూనెట్ గుట్టు రట్టు.. 58 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: డబ్బు ఆశ చూపి వేల సంఖ్యలో బాధితులకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ మోసగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను, అమాయకులను ట్రాప్ చేసి చైన్ సిస్టమ్ ద్వారా ప్రైజ్ మనీ, కమీషన్లు వస్తాయంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన 58 మంది కేటుగాళ్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఎకానిమిక్స్ అఫెన్స్ వింగ్) అధికారులు మల్టిలెవల్ మార్కెటింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో క్యూనెట్ మోసంపై 14 కేసుల నమోదయినట్టు పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా క్యూనెట్ బ్యాంకు అకౌంట్లను, గోదాంలను సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్టు చేసిన 58 మందిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే క్యూనెట్ చైర్మన్ మైకెల్ ఫెరారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. రూ.1000 కోట్ల మోసం బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక, నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ ముగ్గులోకి దింపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటుగాళ్లను ఆరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం సజ్జనార్ పలు విషయాలు వెల్లడించారు. ‘వివధ రకాల కేసుల్లో మొత్తం 58 మందిని అరెస్టు చేశాము. క్యూనెట్ సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముఠాలో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. 2001 నుంచి వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. కచ్చితంగా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అంటూ సజ్జనర్ వివరించారు. -
మహేశ్‌బాబు బాకీ వసూలు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు మహేశ్‌బాబు చెల్లించాల్సిన పన్ను మొత్తం వసూలైంది. జీఎస్టీ కింద కట్టాల్సిన రూ.73లక్షల పైచిలుకు మొత్తంలో రూ.42లక్షలను గురువారమే రికవరీ చేయగా, తాజాగా జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేసిన అకౌంట్లోని రూ.31.47లక్షలను ఐసీఐసీఐ బ్యాంకు ప్రభుత్వ ఖజానాకు జమచేసింది. ఈ మొత్తాన్ని డీడీ రూపంలో గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్‌కు శనివారం జమ చేసినట్టు జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మహేశ్‌బాబు చెల్లించాల్సిన మొత్తం పన్ను జమ అయిందని తెలిపాయి. అథారిటీలు ఒప్పుకోలేదు అయితే, తాను చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి మహేశ్‌బాబు చేసుకున్న అప్పీళ్లను రెండు స్థాయిల్లోని అథారిటీలు తిరస్కరించడంతోపాటుగా పన్ను మొత్తాన్ని కట్టాలని ఆదేశించాయని జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆయన ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని, అందుకే తాము చర్యలకు దిగాల్సి వచ్చిందని తెలిపాయి. ఈ పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయనకు 2010లోనే నోటీసులిచ్చినట్టు తెలిపాయి. వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించే ప్రకటనల సర్వీసులు కూడా బిజినెస్ ఆక్సిలరీ సర్వీసెస్ కింద పన్ను చెల్లింపు కిందకు వస్తాయని చట్టం చెబుతోందని తెలిపాయి. -
బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్ చేస్తారు..? : మహేష్
-
బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్ చేస్తారు..? : మహేష్
సాక్షి, హైదరాబాద్ : పన్ను బకాయిలు చెల్లించనందుకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ అధికారులు జప్తు చేశారు. ఈ వ్యవహారంపై మహేష్‌బాబు లీగల్ టీమ్ ఎట్టకేలకు స్పందించింది. వివాదం కోర్టు పరిధిలో ఉండగా బ్యాంకు ఖాతాలను ఎలా సీజ్ చేస్తారంటూ, చట్టానికి కట్టుబడే పౌరునిగా మహేష్ బాబు తన పన్నులన్నింటిని సక్రమంగా చెల్లించారంటూ ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. ‘2007-08 ఆర్థిక సంవత్సరానికి గానూ అంబాసిడర్ సర్వీసెస్‌కు ఈ పన్ను చెల్లించాలని జీఎస్టీ అధికారులు ఆదేశించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి ట్యాక్స్ పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి ట్యాక్స్ పరిధిలోకి రాదు. ఈ ట్యాక్స్‌ను సెక్షన్ 65 (105)(zzzzq) ద్వారా 2010 జులై 1నుంచి చేర్చడం జరిగింది. టాక్స్ పేయర్ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించిడం జరిగింది. మహేష్ బాబు తన పనులన్నింటిని సక్రమంగానే చెల్లించారు’ అంటూ మహేష్ బాబు లీగల్ టీమ్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
ప్రస్తుతం మహేష్ ఎక్కడ ఉన్నారంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించే చర్చ జరుగుతోంది. ట్యాక్స్ కట్టలేదని ఆయన ఖాతాలను సీజ్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇక మహేష్ అభిమానులు ఈ విషయంపై కలవరపడుతుంటే.. ఆయన మాత్రం హ్యాపీగా హ్యాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌చేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు విదేశాలకు వెళ్లిన మహేష్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక్కడేమో పన్నులు కట్టలేదనీ, ఆయన ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏమాత్రం స్పందించకుండా మహేష్ సరదాగా హాలిడేను ఎంజాయ్ చేసేస్తున్నారు. జాలీగా హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న పిక్‌ను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చదవండి : మహేష్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాధీనం హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్ -
మహేష్‌బాబుకు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: హీరో మహేష్‌బాబుకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి రూ. 42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు జీఎస్టీ అధికారులు తెలిపారు. ఇంకా రూ. 31 లక్షలు ఆయన నుంచి రాబట్టాల్సివుందని చెప్పారు. మొత్తం రూ. 73 లక్షలు పన్ను బకాయి చెల్లించాల్సివుందన్నారు. 2007-08లో ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయానికి సర్వీసు ట్యాక్స్ చెల్లించకపోవడంతో మహేష్‌బాబు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ జప్తు చేసింది. యాక్సిస్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 31 లక్షలు రికవరీ చేశామని, మిగతా మొత్తం ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్ నుంచి స్వాధీనం చేసుకుంటామని జీఎస్టీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. పన్ను బకాయిలకు సంబంధించి 2010లో నోటీసు ఇచ్చామన్నారు. ఆయన స్పందించకపోవడంతో 2012లో ఆర్డర్ పాస్ చేశామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నా ఆయనకు ఊరట లభించలేదన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును మహేష్ ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆర్థిక చట్టం సెక్షన్ 87 ప్రకారం ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్టు వివరించారు. -
సిద్దూకు షాక్; బ్యాంక్ అకౌంట్లు సీజ్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, పంజాబ్ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ షాకిచ్చింది. ట్యాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా అతనికి సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. 2014-15 సంవత్సరంలో సిద్ధూ ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని, అదనంగా రూ.52 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుందని గతేడాది జనవరిలోనే ఆయనకు నోటీసులు ఇచ్చామని అధికారులు గుర్తుచేశారు. అయితే సరదు నోటీసులపై సిద్దూ అప్పీలుకు వెళ్లారని, విచారణ చేపట్టిన కమిషనర్ చివరికి పన్ను కట్టాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశామని ఐటీ శాఖ గురువారం ఒక ప్రకటన చేసింది. సిద్దూ పన్ను ఎగ్గొట్టింది వీటిపైనే..: ఐటీ శాఖ పేర్కొన్నట్లు మంత్రి సిద్దూ రూ.52 లక్షల పన్ను కట్టాల్సిఉంది. అవి ఏయే ఖర్చులకు సంబధిచినవో కూడా ప్రకటనలో పేర్కొన్నారు. 2014-15లో సిద్దూ దుస్తుల కోసం రూ.28.38లక్షలు, పర్యటన కోసం రూ38.24లక్షలు, జీతం వ్యయం రూ.47.11లక్షలు, పెట్రోల్,డీజిల్ కోసం రూ.17.80లక్షలు ఖర్చుపెట్టినట్లు ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయా ఖర్చులకు సంబంధించిన బిల్లులు లేదా ఇన్వాయిస్లను సమర్పించడంలో విఫలమయ్యారు. ఇక సిద్దూ బ్యాంక్ అకౌంట్ల సీజ్ వ్యవహారం ఇటు రాజకీయంగానూ ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్లైంది. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను స్టార్ క్యాంపెయినర్‌గా పంపాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. మాటలమాత్రికుడు సిద్ధూ అకౌంట్ల సీజ్‌పై స్పందించాల్సిఉంది. -
హెచ్‌సీఏపై హైకోర్టు సంచలన ఆదేశాలు
-
హెచ్‌సీఏపై హైకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్: నిధుల దుర్వినియోగానికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలన్ని వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది. తాజా మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, కార్యదర్శి మనోజ్, జాయింట్ సెక్రటరీ అగర్వాల్ సస్పెండ్ వేటు వేసింది. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలుచేయకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిటీ సిఫారసుల ప్రకారం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే పాత కమిటీని కూడా రద్దు చేసి వెంటనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలేవీ కూడా ఇప్పటి వరకు హెచ్‌సీఏ తీసుకోలేదు. గత ఐదేరాళ్లుగా హెచ్‌సీఏకు పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నట్లు సమాచారం. ఏటా దాదాపు 31కోట్లు వస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ నిధులను జిల్లాలో స్టేడియాల పేరిట దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎక్కడా ఒక్క స్టేడియాన్ని, ఇతర మౌలిక వసతులు ఏర్పాటుచేసినట్లుగానీ కనిపించని నేపథ్యంలో మరిన్ని నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే హైకోర్టు ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.