నిధుల దుర్వినియోగానికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలన్ని వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది. మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, మాజీ కార్యదర్శి మనోజ్, మాజీ జాయింట్ సెక్రటరీ అగర్వాల్ సస్పెండ్ వేటు వేసింది. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలుచేయకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిటీ సిఫారసుల ప్రకారం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.