లక్కీ డ్రా వచ్చిందని.. ఆన్‌లైన్‌ మోసం.. | The case was registered at the police station on the incident of online fraud | Sakshi
Sakshi News home page

లక్కీ డ్రా వచ్చిందని.. ఆన్‌లైన్‌ మోసం..

Published Thu, Jun 29 2017 4:53 AM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM

The case was registered at the police station on the incident of online fraud

బ్యాంక్‌ ఖాతాలో రూ.65,200 వేసిన బాధితుడు
చిట్యాల (నకిరేకల్‌) :
దేవుడి పేరు చెప్పి ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన చేసిన ఘటనపై బుధవారం చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చోటుచేసినట్టు ఎస్‌ఐ బాల్‌గోపాల్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన బూరుగు లక్ష్మయ్యకు ఈ నెల రెండో వారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.


ఆ కాల్‌ చేసిన వ్యక్తి తాను శ్రీకాళహస్తి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తానని.. మీరు రూ.5200 చెల్లిస్తే మీ పేరున ఆలయంలో అన్నదానం చేస్తామని, మీకు మంచి జరిగేలా మూడు వస్తువులను పంపిస్తామని తెలిపాడు. దీంతో లక్ష్మయ్య ఈ నెల 17వ తేదిన చిట్యాలలోని ఆంధ్రా బ్యాంక్‌ ద్వారా రూ.5200లను ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌కు ఆన్‌లైన్‌లో పంపిచారు.

అనంతరం పార్సిల్‌లో లక్ష్మయ్యకు మూడు వస్తువులు వచ్చాయి. వాటితో పాటు మరో పేపర్‌లో మీకు రూ.5.70 లక్షల లక్కీ డ్రా తగిలిందని పేర్కొన్నారు. ఇందుకుగాను మీరు రూ.60 వేలు చెల్లిస్తే డ్రాలో వచ్చిన డబ్బులు మీ బ్యాంక్‌ అకౌంట్‌కు పంపిస్తామని తెలిపారు. దీంతో ఈనెల 19వ తేదిన లక్ష్మయ్య చిట్యాలలోని ఆంధ్రా బ్యాంక్‌ ద్వారా రూ.50 వేలు, ఎస్‌ బీహెచ్‌ ద్వారా రూ.10 వేలను పంపారు. అయినప్పటికీ లక్కీ డ్రాలో వస్తాయనుకున్న డబ్బులో అకౌంట్‌లో జమకాలేదు. దీంతో లక్ష్మయ్య తన కు కాల్‌ వచ్చిన సెల్‌ నంబర్‌లకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వస్తుండడంతో మోసపోయానని గుర్తిం చి చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement