శింగనమల : ‘‘మీఫోన్ నంబరు లక్కీ డ్రీలో ఎంపికైంది. మీకు స్యామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ,రెండు గ్రాముల బంగారం, కూపన్, వవీడియోకాన్ వాషింగ్ మిషన్ తగిలాయి. మీ అడ్రసు చెబితే మీకు పంపిస్తాం’’ అని నమ్మబలుకుతూ ఆ స్థానంలో వేరే వస్తువులను పోస్టాఫీసుకు పంపించి అమాయకులను లూఠీ చేస్తోంది హ్యాపీ లైవ్ కేర్. శింగనమల మండలంలో ఐదుగురు ఈ సంస్థ బారిన పడి డబ్బులు పొగొట్టుకోవడంతో వారు లబోదిబోమంటున్నారు. శింగనమలకు చెందిన ఆటో డ్రైవరు ఆంజినేయులు, రైతు షెక్షావలిలకు 9966030751, 9391549692 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి.
మీ ఫోన్ నంబరు లక్కీడ్రాలో గెలుపొందిందని, మీకు 7 వస్తువులు పంపుతామని అడ్రసు తీసుకున్నారు. సెల్‌ఫోన్ అనడంతో వీళ్లు కూడా అడ్రసులు ఇచ్చారు. వారి పేర్ల మీద పోస్టాఫీసులకు బాక్స్‌లు పంపించారు. ముందుగా రూ.3350 చెల్లిస్తేనే బాక్స్‌లు మీకు అందుతాయని సిబ్బంది చెప్పడంతో ఆ డబ్బు చెల్లించా తీసుకున్నారు. తీరా బాక్స్‌లను ఓపెన్ చేసి చూస్తే అందులో చార్జర్, ఫేస్ క్రీంలు ఉండటంతో అవాక్కయారు. గతంలో వచ్చిన ఫోన్ నంబర్లుకు ఫోన్‌చేస్తే బాక్స్‌లు మారాయని, మేనేజరు లేడని సమాధానం రావడం, లేకుంటే కాల్ కట్ చేయడం వంటికి జరగడంతో తాము మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాక్స్‌లపై హ్యాపీ లైఫ్ కేర్, 5, 18వ తూర్పు రోడ్డు , గాంధీనగర్, కాట్‌పాడి, వేలూరు,తమిళనాడు అనే అడ్రసు ఉంది.
స్మార్ట్‌ఫోన్ పేరుతో బురిడీ
Published Wed, Sep 21 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
Advertisement
Advertisement