ప్రతీకాత్మక చిత్రం
ఏడాది క్రితం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముదాంగల్లీలో ఓ ఇంటిముందు కూర్చున్న దంపతుల వద్దకు వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. మీరు సెల్‌ఫోన్ రీచార్జీ చేసుకుంటే మీ పేరిట లాటరీ తగిలింది, మా ఆఫీసుకు వస్తే సంతకాలు చేసి లాటరీ లో గెలుచుకున్న స్కూటీ తీసుకెళ్లవచ్చని నమ్మించాడు. పేదవారికే బహుమతులు వర్తిస్తాయని, మెడలోని బంగారం ఇంట్లో పెటి రమ్మన్నాడు. ఇంట్లోనే కదా పెట్టేది అ నుకున్నారు. చెప్పినట్టే చేశారు. భార్యాభర్తలిద్దరూ ఆ వ్యక్తితో కలిసి బైక్‌పై బయలుదేరారు. ఇప్పుడే వస్తానంటూ దారి మధ్యలో వారిని దింపిన దుండగుడు నేరుగా వా రి ఇంటికే వెళ్లాడు. దాచిన బంగారు గొలుసును తెమ్మంటున్నారని వారి కూతురితో చెప్పి బంగారం తీసుకుని ఉడాయించాడు. బాధితులు లబోదిబోమన్నారు.
అంతకు వారం రోజుల ముందే దేవునిపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భారతి అనే మహిళకు లక్కీడ్రాలో బహుమతి గెల్చుకున్నావని మాయమాటలు చెప్పిన ఓ దుండగుడు బైక్‌పై తీసుకెళ్లాడు. మత్తుమందు చల్లి మెడలోని బంగారం గొలుసు లాక్కున్నాడు.
కామారెడ్డి క్రైం:పైన పేర్కొన్న సంఘటనలు ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో గతంలో చాలానే వెలుగుచూశాయి. సరిగ్గా ఏడాది గడిచింది. మళ్లీ జిల్లాలో ఇదే తరహాలో మోసాలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం బాన్సువాడ డివిజన్ పరిధిలో ఒకేరోజు రెండుచోట్ల ఇలాంటి మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. మాటమాట కలిపి నట్టేట ముంచుతారు. అపరిచితులతో మాట్లాడకపోవడమే మంచిదని కొందరు అంటున్నారు.
నిఘా పెరగాల్సిందే..
ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన లేదు. అంతేకాకుండా పోలీసుల నిఘా సైతం తగ్గినట్లు తెలుస్తోం ది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల కెమెరాల ఏర్పాటు అవసరం ఉంది. ఏడాది క్రితం కామారెడ్డిలో దేవునిపల్లి భారతి మెడలోంచి గొలుసును చోరీ చేసిన దుండగులు మాయమాటలతో ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని బస్టాండ్ ప్రాంతంలో తిరిగాడు. అప్పట్లో బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఏ ఒక్కటి పనిచేయక కేసు పరిశోధనలో అడ్డంకులు తలెత్తాయి. సీసీ కెమెరా ల ఏర్పాటు ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని అధికారులు గుర్తించారు. అయినా చాలాచోట్ల సీసీ కెమెరాల నిర్వహణ అధ్వానంగానే ఉం ది. అపరిచిత వ్యక్తులపై పోలీసుల నిఘా సైతం అం తంతమాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. నేరా ల నియంత్రణకు పోలీసు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.
ప్రధానంగా మహిళలే లక్ష్యం
తరుచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలను చూస్తే దుండగులు అమాయకులనే టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం బాన్సువాడ వచ్చిన దండుగులు ఓ మహిళతో మాట లు కలిపాడు. మీ భర్త బహుమతి గెల్చుకున్నాడని షోరూంకు తనతో రమ్మన్నాడని నమ్మించాడు. బం గారం ఇంట్లో పెట్టించాడు. వెంట తీసుకెళ్లి మధ్యలో వదిలేసి వారి ఇంటికే వచ్చి బంగారం ఎత్తుకెళ్లాడు. వర్ని మండలం ఆపందిఫారంలోనూ ఇలాగే మోసగించారు. సుభద్ర దేవి–దేవిదాస్ దంపతుల ఇంటికి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి మీరు మూడు తులాల బంగారం, ఓ స్కూటీని లాటరీలో గెల్చుకున్నారని నమ్మించాడు. తనతో వస్తే ఇప్పిస్తానని తీసుకువెళ్లి మధ్యలో వదిలేశాడు. తిరిగి వారింటికే వచ్చి వారి కోడలు సుమలతతో మీ అత్త బంగారు గొలుసు తెమ్మని పంపిందని మాయమాటలు చెప్పాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల గొలుసు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు విచారణ జరుపుతున్నా రు. అయినా గ్రామీ, పట్టణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రజకుల ఇలాంటి నేరాలపై ఇప్పటికే సరైన అవగాహన లేదు. ప్రతి ఏటా వేసవికాలంలోనే ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కిడ్రా, స్కీంల పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల మాటలు నమ్మొద్దు. లాటరీ తగిలిందని చెప్పి చోరీలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరాలను కట్టడి చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. –శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment