అనంతపురం రూరల్ : హైదరాబాద్‌లోని ఫోరం మాల్‌లో శనివారం రాత్రి తీసిన లక్కి డ్రాలో అనంతపురం రూరల్ మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన పుల్లలరేవు నమ్రతను అదృష్టం వరించింది. లక్కీడ్రాలో రూ.33 లక్షల విలువ చేసే ఆడీ కారు తగిలింది. దీపావళి పండుగను పురస్కరించు కొని ఫోరం మాల్ నిర్వహకులు ప్రతి రూ.5 వేలు కొనుగోలుపై గిఫ్ట్ కూపన్లు అందజేశారు. రూ. 15 వేలు విలువ చేసే టీవీని కొనుగోలు చేసిన నమ్రతాకు లక్కీడ్రాలో ఆడీ కారును సొంతం చేసుకుంది. ఆడీ కారును తన తండ్రికి బహుమతిగా అందజేస్తానని నమ్రత తెలిపింది.