నిజామాబాద్‌లో భారీ మోసం.. రూ. 5 కోట్ల టోకరా | Nizamabad: Lucky Draw Management Cheating Ran Away With Rs 5 Crore | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో భారీ మోసం.. రూ. 5 కోట్ల టోకరా

Published Sat, Jul 3 2021 6:14 PM | Last Updated on Sat, Jul 3 2021 6:43 PM

Nizamabad: Lucky Draw Management Cheating Ran Away With Rs 5 Crore - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా పేరుతో 5 కోట్ల రూపాయలు సేకరించి ఉడాయించారు నిర్వాహకులు. దీంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. వివరాలు... లక్కీ డ్రా పేరుతో 3 వేల మందిలో ఒక్కొక్కరి వద్ద నుంచి నిర్వాహకులు రూ. వెయ్యి రూపాయల చొప్పున  16 నెలలు వసూలు చేశారు. డ్రా గెలుపొందిన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, భూములు, 
గృహవసరాల వస్తువులు, వాహనాలు, బంగారం ఇస్తామని నమ్మబలికారు. 

ఈ క్రమంలో లక్కీ డ్రా లో వచ్చిన వస్తువులు ఇవ్వాలని మొదటి గ్రూప్ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బోర్డు తిప్పేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా జిల్లా కేంద్రంలోనే 30 వరకు లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ మోసం వెనుక కొంతమంది ‘‘పెద్ద మనుషులు’’ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement