
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు కొత్త తరహా విద్యా వ్యాపారానికి తెర తీశాయి. తమ స్కూల్లో ముందుగా చేరితే లక్కీ డ్రా తీసి బహుమతులు ఇస్తామని నోటీసు బోర్డుల్లో పెట్టాయి. ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు పైతరగతుల్లో నిర్ణీత తేదీలోగా చేరినా, కొత్త వారు చేరినా బహుమతులు ఇస్తామని ఎరవేస్తున్నాయి.
కిండర్ గార్టెన్ నుంచి ఐదో తరగతి వరకు 5 బహుమతులు, 6 నుంచి పదో తరగతి వరకు 6 బహుమతులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఇస్తామంటూ నోటీసు బోర్డుల్లో పెట్టారు. ఈ నెల 22 లోగా విద్యార్థులు తమ అడ్మిషన్‌ను పైతరగతులకు రెన్యువల్ చేసుకోవాలని హయత్‌నగర్‌లో ఓ పాఠశాల ఈ బోర్డు పెట్టింది. అయినా విద్యాశాఖకు ఇవేమీ పట్టడం లేదు.