రూ.50 పన్నుకడితే.. బంపర్ ఆఫర్ | GHMC lucky draw for property tax | Sakshi
Sakshi News home page

రూ.50 పన్నుకడితే.. బంపర్ ఆఫర్

Published Wed, Jun 1 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

GHMC lucky draw for property tax

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ లక్కీ డ్రా ఆఫర్‌లో భాగంగా రూ. 50 ఆస్తిపన్ను బకాయి చెల్లించిన ఓ పౌరుడికి లక్ష రూపాయల బంపర్ ప్రైజ్ వరించింది. మల్కాజిగిరి సర్కిల్‌లోని నేరెడ్‌మెట్ కాకతీయనగర్‌కు చెందిన జి. బాపిరెడ్డి రూ.100 రూపాయల పన్నుకు గాను మొదటి విడత బకాయి కింద రూ. 50 చెల్లించారు. మే నెల 29, 30,31 తేదీల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి బుధవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో బంపర్ ప్రైజ్ కింద లక్ష రూపాయల బహుమతికి బాపిరెడ్డి ఎంపికయ్యారు.

మొదటి బహుమతి రూ. 50 వేలు సైతం రూ. 101 చెల్లించిన ఆబిడ్స్ కు చెందిన పి. ఆశకు దక్కింది. రెండో బహుమతిగా రూ. 25 వేల వంతున గెలుచుకున్న ఇద్దరిలో చార్మినార్ సర్కిల్ కు చెందిన ఎం. సునీత, ఖైరతాబాద్ (సర్కిల్ 10ఎ) ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. రూ.10 వేల చొప్పున మూడో బహుమతి ఐదుగురికి, రూ. 5 వేల చొప్పున నాలుగో బహుమతి పది మందికి, రూ. 2 వేల చొప్పున కన్సొలేషన్ బహుమతులు వందమందికి గాను ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్ ద్వారా డ్రా తీశారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డిలు ల క్కీడ్రాలో విజేతల పేర్లు ప్రకటించారు.


వారం వారం లక్కీ డ్రా
వార్షిక సంవత్సరం ఆరంభంలోనే మొత్తం ఆస్తిపన్ను చెల్లించే అలవాటును పెంపొందించేందుకు గాను జూన్ నెలలో వారం వారం లక్కీ డ్రా నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జూన్ 1 నుంచి 7వ తేదీ లోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 8వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డ్రా ద్వారా బంపర్ బహుమతిగా లక్షరూపాయలతో పాటు 25,000 , 12,500, 5000, 1000 రూపాయల చొప్పున బహుమతులందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement