దహెగాం : లక్కీ డ్రాపేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన దహెగాం మండలంలోని కేస్లాపూర్‌లో వెలుగుచూసిది. స్కీం నిర్వాహకుల చేతిలో మోసపోయినట్లు గ్రహించిన కేస్లాపూర్ గ్రామస్తులు పలువురు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన పాషా కొద్దిరోజుల క్రితం లక్కీ స్కీం నిర్వహించాడు. పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించాడు. ప్రతీ వారం రూ.100 వంతున 20 వారాలు చెల్లించాలని, వారవారం నిర్వహించే డ్రాలో మోటార్‌సైకిల్, రిఫ్రిజిరేటర్, ఎల్‌సీడీ టీవీ లాంటి విలువైన బహుమతులు అందజేస్తామని చెప్పాడు.
సుమారు 2 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. 20 వారాలు వాయిదా కట్టినా ఎలాంటి వస్తువులు అందజేయకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు స్కీం నిర్వాహకుడితోపాటు ఏజెంట్లను పలుమార్లు అడిగారు. అడిగిన ప్రతిసారీ ఇవ్వాళ, రేపు అంటూ కాలం వెల్లదీస్తుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేస్లాపూర్‌కు చెందిన బొడ్డు రాంచందర్, చునార్కర్ మల్లయ్య, తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొనడం గమనార్హం.
లాటరీ పేరుతో మోసం
Published Tue, Sep 16 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement