
సాక్షి, అమరావతి: విజయవాడలోని వేణుగోపాలరావు తన కుటుంబంతో కలసి ఈ నెల 5న తిరుమలకు వెళ్లాలని నిశ్చయించుకుని నెల ముందుగానే ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు కొన్నారు. అయితే, వారు తిరుమల వెళ్లాక ఆ టికెట్లు చెల్లుబాటు కాలేదు. దీనిపై వారు టీటీడీ అధికారులను ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. కారణం.. వారు టికెట్లు బుక్ చేసింది అధికారిక టీటీడీ వెబ్‌సైట్‌లో కాదు, అదే పోలికలతో ఉండే నకిలీ వెబ్‌సైట్‌లో. దీంతో ఆ టికెట్లు చెల్లుబాటుకాక ఆ కుటుంబం నానా ఇబ్బందులు పడుతూ శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి చేరింది. ఇది ఒక్క వేణుగోపాలరావు సమస్య మాత్రమే కాదు. రోజూ వంద లాది మంది భక్తులు నకిలీ వెబ్‌సైట్ల బారిన పడుతున్నారు.
దర్శన టిక్కెట్ రూ.300: తెలియక నకిలీ వెబ్‌సైట్ల బారినపడుతున్న భక్తుల నుంచి ఆ వెబ్‌సైట్ల యాజమా న్యాలు భారీగా నగదు గుంజుతున్నాయి. శ్రీఘ్ర దర్శన టికెట్ ధర రూ.300 ఉండగా, సర్వీసు కాస్ట్ పేరుతో రూ.200 అదనంగా కలిపి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున నకిలీ దర్శన టిక్కెట్లకు ఆ వెబ్‌సైట్లు భక్తుల నుంచి వసూలు చేస్తున్నాయి. భక్తులు స్వామి దర్శన టికెట్ కోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ మొదలుపెట్టగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ కంటే ముందు ఈ నకిలీ వెబ్‌సైట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సైట్‌లలో నగదు చెల్లించిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల మధ్య భక్తులు పేర్కొన్న ఈమెయిల్ ఐడీకి నకిలీ దర్శన టికెట్లు మెయిల్ చేస్తారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లు ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నా టీటీడీ విజిలెన్స్ విభాగం వీటిపై దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మా దృష్టికి వచ్చింది
ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్ల కొనుగోలుకు సంబం ధించి నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసిన స్వామివారి దర్శన టికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కొన్ని నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకుంది. నకిలీల పట్ల చర్యలు తీసుకుంటున్నాం.
–రవికృష్ణ, టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్
తిరుమలలో హోటళ్ల మూసివేతకు ఆదేశం
సాక్షి, తిరుమల: తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లు మూసివే యాలని టీటీడీ శనివారం నోటీ సులిచ్చింది. అద్దె బకాయిలు, జరిమానా చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెండర్ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలు నిర్ణీత ధరల కంటే అధిక ధరకు విక్రయించటం, దేవస్థానం నిబంధనలు పాటిం చకపోవడంతో తిరుమలలోని హోటళ్లపై హైకోర్ట్‌లో పిల్ దాఖ లైంది. దీంతో టీటీడీ అధికా రులు తిరుమలలోని 8 పెద్ద హోటళ్లు, మరో 13 చిన్న జనతా హోటళ్లకు ఒక్కోనెల అద్దెను జరి మానాగా విధించి ఆ మొత్తాన్ని వారి ఈఎండీ నుంచీ రికవరీ చేసి నోటీసులు ఇచ్చారు. వ్యవధిలో నే బకాయిలు చెల్లిస్తామని నిర్వా హకులు విజ్ఞప్తి చేసినా టీటీడీ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment