కుంభమేళాలో పాల్గొనే భక్తులకు టీజీసీఎస్‌బీ హెచ్చరిక
నకిలీ వెబ్‌సైట్లు, లింకులను భక్తులు తెరవొద్దు
యూపీ సర్కార్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్ లెన్ బుకింగ్‌లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సూచించింది. ఆన్ లైన్‌లో హోటల్, ధర్మశాల, గెస్ట్‌హౌస్ బుకింగ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్‌సైట్‌లు, నకిలీ బుకింగ్ లింక్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
టీజీసీఎస్‌బీ సూచనలు..
⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్‌సైట్ https://kumbh.gov.in/en/ Wheretostaylist అందుబాటులో ఉంది.
⇒ అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్‌లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయవద్దు.
⇒ తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.
⇒ అధికారికంగా క్రాస్–చెక్ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్ ప్రొవైడర్ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.
⇒ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
⇒ ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించి ఫిర్యాదు చేయండి.
⇒ సైబర్ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి.
Comments
Please login to add a commentAdd a comment