
సాక్షి, తిరుమల: టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్ల మోసాలు కలకలం రేపుతున్నాయి. దర్శన టికెట్లు, గదులు కేటాయిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్ల నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. 40 వెబ్ సైట్లపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం తాజాగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.