‘ఆన్‌లైన్’తో ప్రమాదమూ ఉంది! | Also have danger with online | Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్’తో ప్రమాదమూ ఉంది!

Published Wed, Dec 7 2016 2:46 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

‘ఆన్‌లైన్’తో ప్రమాదమూ ఉంది!

‘ఆన్‌లైన్’తో ప్రమాదమూ ఉంది!

- ‘సైబర్ భద్రత-నగదు రహితం’పై సదస్సులో డీజీపీ అనురాగ్‌శర్మ
-‘క్యాష్ లెస్’తో సౌకర్యంతోపాటు సమస్యలు కూడా..
- సమాచారంపై సైబర్ నేరగాళ్లు, టైస్టుల దాడులకు అవకాశం
- సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులు నైపుణ్యం పెంచుకోవాలి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్‌తో ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే ముప్పు పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు ఎంతో నైపుణ్యంతో టెక్నాలజీని వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహిస్తున్నారుు. భారీగా ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మళ్లినప్పుడు తప్పకుండా మోసాలూ జరుగుతారుు. ‘క్యాష్ లెస్’తో కొత్త దారుల్లో నేరగాళ్లు విజృంభి స్తారు. రాబోయే రోజుల్లో హ్యాకర్లు, సైబర్ నేర గాళ్లు, టైస్టులు పేట్రేగిపోయే ప్రమాద ముంది..’’అని డీజీపీ అనురాగ్‌శర్మ హెచ్చరిం చారు. భవిష్యత్ పోలీసింగ్ ఇదేనని, సైబర్ నేరాల ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలా దర్యా ప్తు జరపాలన్న అంశంపై పోలీసులు సిద్ధమై ఉండాలని సూచించారు. ‘సైబర్ భద్ర త-నగదు రహిత లావాదేవీలు’ అంశంపై మంగళవారం నేర పరిశోధక విభాగం (సీఐ డీ) నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం ప్రతి జిల్లాలో సైబర్ క్రైం విభాగం, ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

 ఎన్నో మార్గాల్లో దోపిడీ..
 సైబర్ నేరస్తులు టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నారని డీజీపీ హెచ్చరించారు. ‘‘బ్యాంకుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ఖాతాదారుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తున్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఖాతాదారులకు ఫోన్ చేసి వారి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు తెలుసుకుని మోసగిస్తున్నారు. అందమైన అమ్మారుుల ఫొటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేసి గాలం (ఫిషింగ్) వేసి వ్యక్తుల బలహీ నత ఆధారంగా కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. ఇలా హ్యాకింగ్, ఫిషిం గ్‌ల ద్వారా తస్కరించిన సమాచారాన్ని ఇతరులకు అమ్ముకోవడం లేదా బ్యాంకింగ్ నేరా లు, ఆర్థిక మోసాలకు పాల్పడడం వంటివి జరుగుతున్నారుు.’’అని డీజీపీ వివరించారు.

మేధోపరమైన సమాచారాన్ని సైతం దొంగి లిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం.. సైబర్ నేరాలను, నేరస్తులను గుర్తించడం.. ఈ రెండే పోలీసుల ముందు ఉన్న కర్తవ్యమని తెలిపారు. ఆర్థిక లావా దేవీలకు సంబంధించిన సైబర్ నేరాలపై ఫిర్యాదు వస్తే నిందితులెవరు, ఎలా తస్కరిం చారన్న అంశాలను గుర్తించడంలో పోలీసులు నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు సీఐడీ రూపొందించిన ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా డీజీపీ ఆవిష్కరించారు. కార్యక్రమానికి భారీగా హాజరైన పోలీసు అధికారులకు ‘సైబర్ భద్ర త’పై ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనూజ్ అగర్వాల్, రంగాచారి, జతిన్ జైన్‌లు అవగాహన కల్పించారు.
 
 ఆర్మీ డేటాను ‘స్మాష్’ చేసిన పాకిస్తానీ హ్యాకర్లు!
 ‘స్మాష్’అనే ఓ మొబైల్ అప్లికేషన్ (యాప్) ద్వారా వేల మంది భారతీయుల సెల్‌ఫోన్ల నుంచి కాంటాక్టు నంబర్లు, ఆడియో, వీడి యో ఫైళ్లు, ఇతర సమాచారాన్ని పాకిస్తానీ హ్యాకర్లు తస్కరించారని ఇండియా ఇన్ఫోసెక్ కన్సార్షియం వ్యవస్థాపకుడు, ఎథికల్ హ్యాకర్ జతిన్‌జైన్ సదస్సులో వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్లలో ఉండే సమా చారాన్ని శాశ్వతంగా తొలగించేందుకు ఉద్దేశించిన ఈ యాప్‌ను చాలా మంది పోలీసు, సైనిక అధికారులు వినియోగించారని.. ఈ యాప్ ద్వారా తొలగించిన సమాచారం వెలికితీయడం చాలా కష్టమని చెప్పారు. అరుుతే ఈ యాప్‌ను డీకోడ్ చేస్తే దాని సర్వర్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు గుర్తించామని.. ఆ సర్వర్‌లో మన దేశం నుంచి తస్కరించిన 44 వేల ఆడియోలు, 70 వేల వీడియో ఫైళ్లు, 60 వేల కాంటాక్టు నంబర్లను నిక్షిప్తం చేసినట్లు గుర్తించామని తెలిపారు.

సరి హద్దుల్లో పనిచేసే పోలీసు, సైనికుల సమాచారం అందులో లభిం చిందని వెల్లడించారు. ఇలా తస్కరించిన సమాచారంతోనే పాక్ ముష్కరులు పఠాన్‌కోట్, ఉడీ ఉగ్ర దాడులకు పాల్పడ్డారని అభి ప్రాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల వద్ద లభించిన జీపీఎస్ పరికరాలూ ఈ విషయాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు. ఒక వ్యక్తి సెల్‌ఫోన్ ఆధారంగా అతని గురించి అన్ని విషయాలూ తెలుసుకోవచ్చని, అతని కదలికలు పసిగట్టవచ్చని స్పష్టం చేశారు. మన చుట్టూ ఉన్నవారిలో ఏ ఒక్కరైనా మాల్‌వేర్ యాప్ వాడినా.. మన సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించగలరని చెప్పారు. అందువల్ల భద్రత లేని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దన్నారు.
 
 పాస్‌వర్డ్‌లు తరచూ మార్చుకోవాలి
 ‘‘ఈ రోజుల్లో పాస్‌వర్డ్‌లను ఊహించడం సులువుగా మారింది. స్పెషల్ క్యారెక్టర్లతో పాస్‌వర్డ్‌లను సెట్ చేసు కోవాలి. తరచూ మార్చుకుంటూ ఉండాలి. షాపింగ్ మాల్స్‌లో కార్డులను వినియోగించిన తర్వాత వెంటనే పాస్ వర్డ్ మార్చుకోవడం మంచిది..’’
 - అనూజ్ అగర్వాల్, సైబర్ సెక్యూరిటీ  నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement