నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుసగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో డెహ్రాడూన్ వెళ్లిన సమంత.. తాజాగా హిమాలయాల సమీపంలో ఉన్న పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకున్నారు. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అందులో భాగంగా ఆమె ప్రత్యేక హెలికాప్టర్‌లో ఛార్ ధామ్ యాత్ర చేశారు.
తాజాగా ఆమె ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక హెలికాప్టర్ ముందు దిగిన ఫోటోని ఆమె సోషల్ మీడియా షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌గా మారింది.
ఇక సినిమా విషయాలకొస్తే.. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. మరోవైపు షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలోనూ సమంత హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment