Gangotri Child Artist Kavya Kalyan Ram Latest Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Kavya Kalyan Ram: ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’పాప ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

Published Sat, Nov 19 2022 5:15 PM | Last Updated on Sat, Nov 19 2022 6:00 PM

Gangotri Child Artist Kavya Kalyan Ram Latest Pics Goes Viral - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా ఎదిగినవారు టాలీవుడ్‌లో చాలానే ఉన్నారు. శ్రీదేవి, రాశి, మీనా, రోజా, లయ.. ఇలా ఎందరో బాల తారలుగా వచ్చి హీరోయిన్స్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు. వీరిలో కొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యారు. తాజాగా మరో చైల్డ్‌ ఆర్టిస్టు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమే కావ్య కల్యాణ్‌రామ్. కావ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కాని  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి.  

హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్‌ రామ్‌ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్‌’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్‌ కల్యాణ్‌ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. దాదాపు 16 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది.

తాజాగా ‘వల్లంకి పిట్ట’ హీరోయిన్‌గా ‘మసూద’ సినిమాలో నటించింది. హారర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్‌ 18) విడుదలైంది.  ఇందులో కావ్య నటనను మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో పాటు వారాహి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ‘ఉస్తాద్‌’లో కూడా కావ్య హీరోయిన్‌గా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ భామ హీరోయిన్‌గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement