
చాలామంది బ్యూటీస్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. అలా హారర్ సినిమాలో దెయ్యంగా భయపెట్టిన ఈ బ్యూటీ.. చాన్నాళ్ల తర్వాత పార్టీలో కనిపించింది. టాలీవుడ్ సెలబ్రిటీలతోనూ తెగ ఫొటోలు దిగింది. మరి ఈమెని కనిపెట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?
2019లో మిస్ ఇండియా రన్నరప్ అయిన బాంధవి, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రపదేశ్2019గా కూడా బాంధవి గెలిచింది. మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో నటించిన బాంధవికి మసూద సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూద తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది.
(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)
అక్కినేని హీరో నాగచైతన్యకు చాలారోజుల నుంచి సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా వచ్చిన 'తండేల్'.. ఆ లోటు తీర్చింది. రూ.100 కోట్ల వసూళ్లు కూడా వచ్చాయి. ఈ ఆనందంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ టీమ్ అందరికీ పార్టీ ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్స్ కి వచ్చిన ఈ బ్యూటీ.. చైతూతో ఫొటో దిగింది.
ఈమె ఎవరా అనుకుంటున్నారా? 'మసూద' సినిమాలో దెయ్యంగా నటించిన అమ్మాయే ఈమె. పేరు బాంధవి శ్రీధర్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో రన్నరప్. కానీ మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది.
కెరీర్ ప్రారంభంలో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. మసూద చిత్రంలో దెయ్యంగా చేసిన తర్వాత కాస్త ఫేమ్ వచ్చింది. ఇప్పుడు తండేల్ సక్సెస్ పార్టీలో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ)

Comments
Please login to add a commentAdd a comment