డెహ్రాడూన్: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నారు. అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. ఇదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.
దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని చెప్పారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత, యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని ఆలయానికి తీసుకువస్తారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది యాత్రికులు ఈ రెండు ధామాలను సందర్శించుకున్నారు.
ఇది కూడా చదవండి: మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
Comments
Please login to add a commentAdd a comment